E-Paper
Advertisement

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సెల్లార్‌లో లభించిన ఆ రహస్యాలు అవేనా..?

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సెల్లార్‌లో లభించిన ఆ రహస్యాలు అవేనా..?
Advertisement

SaiKrishna Case: ఏపీలో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారిన సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంపై సిట్‌ ఫుల్ సీరియస్‌గా ఉందని అర్థమవుతోంది. ఓ వైపు సాయికృష్ణ ఇంట్లో వాళ్లను విచారిస్తూనే మరోవైపు కృష్ణలంక పీఎస్‌లో అసలేం జరిగింది అనే దానిపై ఫోకస్ చేసింది సిట్ టీమ్. ఆదివారం సాయంత్రం దర్యాప్తు విషయంలో ఫుల్ ఛార్జ్ తీసుకున్న సిట్ టీమ్ అంతకుముందు క్షేత్రస్థాయిలో సేకరించిన కీలక వివరాలతో ప్రాథమిక విచారణ నివేదికను హ్యాండోవర్ చేసుకుంది. ఏసీపీ దైవప్రసాద్ సిట్‌కు ఈ రిపోర్ట్‌ను అందించారు. ఓ వైపు ఈ రిపోర్ట్‌ను స్టడీ చేస్తూనే మరోవైపు ఈ కేసులో లభించిన సాంకేతిక ఆధారాలు, ఇప్పటివరకు రికార్డు చేసిన పోలీసుల స్టేట్‌మెంట్లపై ఫోకస్ చేసింది. సిట్ చీఫ్ రవిప్రకాష్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

దాదాపు ఐదున్నర గంటల పాటు..

ఇక విజయవాడ కృష్ణలంకలోని సాయి కృష్ణ నివాసంలో సిట్ అధికారులు విచారణ జరిపారు. మిస్సింగ్ వ్యవహారంపై ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు దాదాపు ఐదున్నర గంటల పాటు సిట్ బృందం సుదీర్ఘంగా దర్యాప్తు చేపట్టింది. సాయి కృష్ణ తల్లి, ఇద్దరు మేనమామలతో పాటు ఇతర కుటుంబ సభ్యుల నుంచి అధికారులు స్టేట్‌మెంట్స్ రికార్డ్ చేశారు.

వ్యవహార శైలి ఎలా ఉండేది?

Advertisement

అసలు సాయి కృష్ణ గత ట్రాక్ రికార్డ్ ఏంటి? అతని వ్యవహార శైలి ఎలా ఉండేది? ఎవరితోనైనా విభేదాలు గానీ, గొడవలు గానీ ఉన్నాయా? అనే అంశాలపై సిట్ ఫోకస్ చేసింది. ఘటన జరగడానికి ముందు, ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనే పూర్తి సమాచారాన్ని సేకరించారు. చివరిసారిగా సాయి కృష్ణతో ఎప్పుడు మాట్లాడారనే వివరాలను కూడా నోట్ చేసుకున్నారు. ఇప్పటికే సేకరించిన సాక్ష్యాధారాలతో కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను సిట్ అధికారులు సరిపోల్చి చూస్తున్నారు. ఘటనకు సంబంధించి ఎలాంటి పత్రాలు, ఆధారాలు ఉన్నా తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులను కోరారు.

Also read: Sai Baba: సనాతన ధర్మంలో కొత్త వివాదం.. కుండబద్దలు కొట్టిన మంత్రి ఆనం..!

పోలీసుల కదలికలు..

Advertisement

సాయి కృష్ణ నివాసంలో విచారణ ముగిసిన అనంతరం సిట్ అధికారులు నేరుగా పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు వెళ్లారు. ఘటన జరిగిన రోజున నమోదైన కాల్ రికార్డ్స్, పోలీస్ వైర్‌లెస్ కమ్యూనికేషన్ వివరాలను సేకరించారు. ఘటన జరిగిన సమయానికి పోలీసుల కదలికలు ఎలా ఉన్నాయి? ఎవరు ఎక్కడ డ్యూటీలో ఉన్నారు? అనే అంశాలపై పూర్తిస్థాయిలో సమాచారాన్ని సేకరించారు. ఆ తర్వాత కృష్ణలంక పోలీసు స్టేషన్ పరిసరాలను తనిఖీ చేసింది సిట్ టీమ్. స్టేషన్ మొత్తాన్ని ఫోరెన్సిక్ టీమ్‌లు జల్లెడ పట్టాయి. స్టేషన్‌లోని అన్ని ప్రాంతాల్లో ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. వీడియో కెమెరాతో స్టేషన్ మొత్తాన్ని రికార్డు చేశారు. సాయికృష్ణను తీసుకొచ్చిన పరిసరాల్లో ఏమైనా ఆధారాలు ఉన్నాయా అనేకోణంలో దర్యాప్తు చేశారు. సెల్లార్‌లో ఉన్న వాహనాలను, గదులను పరిశీలించిన సిట్‌ సభ్యులు.. మిస్సింగ్‌ రోజు సాయికృష్ణను ఎక్కడ ఉంచారన్న దానిపై ఆధారాలను సేకరించారు. ఇదే సమయంలో సీసీ ఫుటేజ్‌కు సంబంధించిన డాటా కూడా సీట్‌ టీమ్‌కు చేరినట్టు తెలుస్తోంది.

టీమ్ ఏం తేల్చుతుంది?

మొత్తానికి సాయికృష్ణ కనిపించకుండా పోవడంలో పోలీసుల పాత్ర ఉందా? అనే కోణంలోనే ప్రస్తుతం విచారణ జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఈ కేసులో కుటుంబసభ్యుల స్టేట్‌మెంట్‌ల కంటే.. పోలీసులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లే ఎక్కువగా ఉపయోగపడే అవకాశం కనిపిస్తోంది. మరి సిట్‌ టీమ్ ఏం తేల్చుతుంది? అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఎందుకంటే చాలా మంది సాయికృష్ణ మృతి చెందాడు అనే అనుకుంటున్నారు. మరి ఇది నిజమా? కాదా? నిజమే అయితే ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరు? కాకపోతే సాయికృష్ణ ఏమైనట్టు? అనేది ఇప్పుడు సిట్ టీమ్ తేల్చాల్సి ఉంది.

Storey By Appa Rao Big Tv

Also read: Monsoon Deficit: 146 ఏళ్లలో ఎన్నడూ లేని మహా ఘోరం.. లోటు వర్షపాతంతో వణికిపోతున్న భారతదేశం..!

Related News

ప‌నిచేయ‌ని బీసీ కార్డు.. కరువైన సానుభూతి.. ఆదుకోని మ‌హిళా బీసీ నేత కోటా… ఆ కుటుంబంపై అంత‌టా వ్య‌తిరేక‌తే.. ఎందుకు?

టంగ్ స్లిప్ప‌వుతుందా? ఓట‌మిని ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారా? జ‌నాల‌ను కించ‌ప‌రిచేలా ఈ మాట‌లేలా?

ఆది నుంచి త‌ప్పట‌డుగులే.. వివాదాలే ఆమె దారి? ఇదీ కొండా సురేఖ వైఖరి!

ఇకపై అసమ్మతి గళాలకు బ్రేకులు… పరిపాలన పై రేవంత్ సర్కార్ మరింత పట్టు..

రేవంత్ నాయకత్వాన్ని బలపరిచేలా అధిష్టానం అడుగులు! ఢిల్లీ పెద్ద‌ల‌తో స‌త్సంబంధాల సంకేతాలు..!

సీఎంగా రేవంత్ ఉన్నంతకాలం కేసీఆర్ అసెంబ్లీకి రారు.. కేటీఆర్ క్లారిటీ!

లీ క్వాన్ యూ ఎవరు? కేసీఆర్‌ను ఆయనతో పోల్చిన కేటీఆర్‌.. అసలు కథ ఇదే!

మేమొచ్చినా.. వెంట‌నే హామీలు అమ‌లు చేయ‌లేం.. ! కుదురుకోవ‌డానికి ఐదారేళ్లు ప‌డుతుందేమో..? ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై కేటీఆర్ కామెంట్స్‌..

Big Stories

Advertisement
×