BigTV English

Tadipatri Politics: తాడిపత్రి వైసీపీలో వార్.. పెద్దారెడ్డికి షాక్ తప్పదా?

Tadipatri Politics: తాడిపత్రి వైసీపీలో వార్.. పెద్దారెడ్డికి షాక్ తప్పదా?

Tadipatri Politics: అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజక వర్గంలో జేసి వర్సెస్ కేతి రెడ్డిల వార్ పీక్ స్టేజ్ కు చేరుతోంది. జేసి ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలోకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని రానివ్వనురా అంటూంటే తప్పక వస్తా అని పట్టుబడి మరి పెద్దారెడ్డి సుప్రీం కోర్ట్ మెట్లెక్కి తాడిపత్రి వెళ్ళేందుకు అనుమతి తెచ్చుకున్నారు. ఇంతలో తాడిపత్రి సెగ్మెంట్ వైసపీలో మాజీ ఎమ్మెల్యే స్థానంలో పాగా వేసేందుకు ఇద్దరు ప్రయత్నిస్తూ ఉండడంతో ఆయనకు మనశశాంతి లేకుండా చేస్తున్నారట. అసలు ఇంతకే తాడిపత్రి వైసపీ లో జరుగుతున్న ఆ రాజకీయం ఏంటి?


తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డి సుప్రీం కోర్టు అనుమతి

అనంతపురం జిల్లాలోని తాడిపత్రి వెళ్ళేందుకు వైసపి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీం కోర్ట్ అనుమతి ఇచ్చింది. ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులను నిలిపి వేసింది. తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్ళేందుకు భద్రత కల్పించాలని ఆయన గతంలో హైకోర్టును ఆశ్రయించగా పోలీసులు భద్రత కల్పించాలని సింగిల్ జడ్జ్ బెంచ్ తీర్పిచ్చింది. ఆ ఉత్తర్వులను అనంతపురం ఎస్పీ సవాల్ చేశారు. ఆ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసింది.


ఈ నెల 22న సుప్పీంకోర్టును ఆశ్రయించిన పెద్దారెడ్డి

ఈ ఆదేశాలపై పెద్దారెడ్డి ఈ నెల 22న సుప్రీం కోర్టుకు వెళ్ళారు. ఆయన పిటిషన్ పై తాజాగా ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాదులు భద్రతకు అవసరమైన ఖర్చులన్నీ తామే భరిస్తామని తెలియజేశారు. దీంతో ధర్మాసనం ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జ్ ఉత్తర్వులను సమర్థించింది. డివిజన్ బెంచ్ ఉత్తర్వులపై స్టే విధించింది. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్ళేందుకు అనుమతిచ్చింది. దాంతో ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇంతకాలానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన నివాసానికి వెళ్ళటానికి లైన్ క్లియర్ అయింది. అధికారం అటూ ఇటు మారటం తాడిపత్రి సెగ్మెంట్లో గెలుపోటములు సాధారణమే అయిన టిడిపి నేత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ వర్గంపై 2019 ఎన్నికల్లో మొదటిసారి వైసపీ నుంచి గెలిచి ఆధిపత్యం చెలాయించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిలు మాత్రం మొదటి నుంచి తమ వైఖరి మారదంటున్నారు. తాడిపత్రిలో ఫ్యాక్షన్ వాతావరణం సృష్టిస్తూ అటు ప్రజలను ఇటు ప్రభుత్వ యంత్రాంగాన్ని టెన్షన్ పెడుతూనే వస్తున్నారు.

అధికారంలో ఉన్నప్పుడు హవా నడిపించిన పెద్దారెడ్డి

ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న సీమ పౌరుషం చూపిస్తూ ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకోవడం కోసం ఎంతకు తగ్గటం లేదు. దాంతో తాడిపత్రి రాజకీయం ఎప్పుడు న్యూస్ హెడ్లైన్ గా ఉంటుంది. అటు జేసి ప్రభాకర్ రెడ్డి ఇటు కేతిరెడ్డి పెద్దారెడ్డిఇద్దరికీ ఆరు పదుల వయసు దాటింది. ఇంకా చెప్పాలంటే ఇద్దరికీ మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. అయినా ఎవరు తగ్గేది లేదంటున్నారు. తాడిపత్రిలో రాజకీయ ఆధిపత్యం కోసం ఇరువురు నువ్వా నేనా అనే రీతిలో పోటీ పడుతున్నారు. వైసపి అధికారంలో ఉన్నప్పుడు తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి తన హవా నడిపించారు. ఏకంగా జేసి ప్రభాకర్ రెడ్డి ఇంటికవెళ్లి కూర్చుని సవాలు విసిరారు. ఆ విషయం అప్పట్లో సంచలనం రేపింది. అంతటితో ఆగకుండా ఏకంగా జేస ప్రభాకర్ రెడ్డిని తాడిపత్రి రాకుండా అనేక సందర్భాల్లో అడ్డుకున్నారు. కేతి రెడ్డి గోరి మెహ్మల అనేక మార్లు తాడిపత్రిలోకి వెళ్ళేందుకు ప్రయత్నాలు చేయటం దాన్ని జేసీ వర్గం అడ్డుకోవటం శరా మామూలయింది. ఆ క్రమంలో ఇటీవల తాడిపత్రి వెళ్ళేందుకు హైకోర్ట్ ఆదేశాలు తీసుకొచ్చారు పెద్దారెడ్డి.

లా ఆర్డర్ సమస్య వస్తుందని అడ్డుకున్న పోలీసులు

హైకోర్టు ఆదేశాలతో ఇక తనకు లైన్ క్లియర్ అయిందని పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్ళటానికి రెడీ అయినా ఎప్పటికప్పుడు జేసీ వర్గీయులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులు లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందంటూ పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. పైగా కోర్ట్ ఇచ్చిన ఆర్డర్ మీద అపీల్ కు వెళ్ళారు. దీంతో మూడు వారాల పాటు స్టే విధించింది హైకోర్ట్. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్ళలేకపోయారు. ఒకవేళ బలవంతంగా అడుగు పెట్టగలిగిన అక్కడ యక్టివ్ పాలిటిక్స్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ వైసపి సంగతి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినప్పటి నుంచి తాడిపత్రి పట్టణంలో వైసపి కార్యకలాపాలు దాదాపు కరువయ్యాయి. అంతో ఇంతో తాడిపత్రి మిగతా మండలాల్లు వైసపి కార్యకలాపాలు ఉన్న వాటన్నిటిని తాడిపత్రి పట్టడం డామినేట్ చేస్తుంది. ఒకవేళ స్థానిక నేతలు ఏదో ఒక పార్టీ కార్యక్రమం చేయాలనుకున్న జేసీ భయంతో వెనకడుగు వేస్తున్నారట. ఆ భయానికి భరోసా ఇవ్వటానికి పెద్దారెడ్డి స్థానికంగా లేకపోవటమే అని చెప్పొచ్చు. ఇలా ఎంతకాలం ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇది ఇలాగే కొనసాగి పార్టీ యాక్టివిటీస్ లేకపోతే తాడిపత్రి నియోజక వర్గంలో పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుందట వైసపి క్యాడర్లు.. సరిగ్గా ఇక్కడే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొందరు స్థానిక నాయకులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

కేతిరెడ్డి కొడుకులు, కోడళ్లను కూడా రానివ్వబోనని జేసీ ప్రతిజ్ఞ

ఇక్కడ పెద్దారెడ్డి తప్ప వైసపి తరపున ఎవరైనా రాజకీయాలు చేసుకోవచ్చని స్పష్టంగా చెప్తున్నారు జేస ప్రభాకర్ రెడ్డి. అంతే తప్ప మాజీ ఎమ్మెల్యే కేతి రెడ్డి కొడుకులు కోడళ్లను కూడా రాణివ్వబోరని ప్రతిజ్ఞ చేశారు ఆయన. దీంతో ఆ గ్యాప్ ను భర్తీ చేసేందుకు స్థానిక వైసీపీ నేతలు కొంతమంది తహతహలాడుతున్నారు. తాడిపత్రి స్థానిక వైసపి నేత ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత రమేష్ రెడ్డి తాను పెద్దారెడ్డి ప్లేస్ లోకి రావాలని ఉత్సాహంగా ఉన్నారట. కొద్దిగా రమేష్ రెడ్డి ఆశలు పెట్టుకున్నాడో లేదో అప్పుడే ఆ ఆశలపై నీళ్లు చల్లే ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరో వైసపి నాయకుడు విఆర్ రామిరెడ్డి. గతంలో జేసి ప్రభాకర్ రెడ్డి పై స్వల్ప తేడాతో ఓడిపోయిన రామిరెడ్డి మరోసారి చాలా కాలం తర్వాత తాడిపత్రిలోకి ఎంట్రీ ఇచ్చి సంచలనం రేపుతున్నారు. రహస్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డితో మంతనాలు జరుపుతున్నట్టు ఆయన ముఖ్యానుచరులు అంటున్నారు. అధిష్టానం నియోజక వర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణుల అభిప్రాయాలు సేకరించగా వైసపి కార్యకర్తలు తాడిపత్రి వైసపి ఇంచార్జ్గా బిఆర్ రామిరెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారట.

Also Read: మోడీ దెబ్బ.. అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ అవుట్..

ఎప్పుడో పాలిటిక్స్ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న రామిరెడ్డి సడన్ గా ఇప్పుడు తాడిపత్రికి రావటం అందులోనూ కార్యకర్తలతో సమావేశం అవ్వటం తాడిపత్రి పాలిటిక్స్ లో ఉత్కంట రేపుతోంది. ఎన్నాళ్ళు ఇద్దరు కృష్ణులే అనుకుంటే ఇప్పుడు మూడో కృష్ణుడి రూపంలో విఆర్ రామిరెడ్డి రావడంతో తాడిపత్రి వైసపీలు తీవ్ర గంధరగోళం ఏర్పడింది. మరి ఇప్పుడు వైసపి అధిష్టానం ఈ గందరగోళానికి ఎలా తెరదించుతుందో ఎవరికి ఇంచార్జ్ బాధ్యతలు అప్ప చెప్తుందో చూడాలి.

Story By Ajay Kumar, Bigtv

Related News

Telangana BJP: సీక్రెట్‌గా షోకాజ్ నోటీసులు.. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది?

Bigg Boss 9: అయ్యో మళ్లీ కాటేశాడే.. ఉత్కంఠతో పాటు నవ్వులు కురిపించిన శ్రీముఖి!

Congress: వర్ధన్నపేట ఎమ్మెల్యేకి కొత్త కష్టాలు..

Telangana Politics: పొన్నం టార్గెట్ రీచ్ అవుతాడా?

Kothagudem Congress: కొత్తగూడెంలో కాంగ్రెస్‌కు కష్టాలు తప్పవా?

Big Stories

×