BigTV English

AP Liquor Scam: లిక్కర్ స్కామ్ సూత్రధారులెవరు? వీళ్లంతా ఎలా దొరికారంటే

AP Liquor Scam: లిక్కర్ స్కామ్ సూత్రధారులెవరు? వీళ్లంతా ఎలా దొరికారంటే

AP Liquor Scam: చెప్పింది మద్యపాన నిషేధం చేస్తామని. తీరా అధికారంలోకి వచ్చాక చూస్తే ప్రపంచంలోనే అతి పెద్ద మద్యం స్కామ్ చేశారా? ఇంతకీ ఏపీ లిస్కర్ స్కామ్ డెప్త్ ఏంటి- ఆ డెన్సిటీ ఎలాంటిది? సూత్రధారులెవరు? పాత్రధారులెవరు? ఎవరి నుంచి ఎవరికి ఈ మొత్తం మనీ వెళ్లింది? నెలకు ఎంత మొత్తం కమిషన్లు, కిక్ బ్యాక్ ల ద్వారా పొందారు? సిట్ అధికారులు తమ విచారణలో ఏం తేల్చారు? ఆ డీటైల్స్ ఎలాంటివో ఇప్పుడు చూద్దాం.


మద్యపాన నిషేధంగా మొదలైన వ్యవహారం

గత వైసీపీ పాలకులు మద్యపాన నిషేధం.. అన్న మోటివ్ తీస్కున్నారు. ఫైనల్ గా చూస్తే అది నెలకు 50 నుంచి అరవై కోట్ల రూపాయల కిక్ బ్యాక్ సొమ్ము కోసమని తేలిందంటారు దర్యాప్తు అధికారులు.


ఏ 1- రాజ్ కేసిరెడ్డి, ఏ 4- మిథున్ రెడ్డి..

ఇందులో ఏ 1- రాజ్ కేసిరెడ్డి, ఏ 4- మిథున్ రెడ్డి.. ఏ 5- విజయసాయిరెడ్డి, ఏ 7- ముప్పిడి అవినాష్ రెడ్డి, ఏ 6- సజ్జల శ్రీధర్ రెడ్డి, ఏ 2- వాసుదేవరెడ్డి, నాటి బేవరేజస్ కార్పొరేషన్ ఎండీ సత్యప్రసాద్ వంటి వారితో పాటు ఏ 38- చెవిరెడ్డి, ఏ 31- ధనంజయ్ రెడ్డి, ఏ 32- కృష్ణమోహన్ రెడ్డి, ఏ 33- బాలాజీ గోవిందప్ప.. ఒక సిండికేట్ గా ఏర్పడి.. కమిషన్లు, కిక్ బ్యాక్ లు, ధరల పెరుగుదల వంటి వాటి కార్యకలాపాలకు పాల్పడినట్టు గుర్తించింది సిట్. డిస్టలరీలు, సరఫరాదారులకు అవసరమైన ఆర్ధిక ప్రయోజనం కలిగించడానికి కుట్ర పన్నినట్టు గుర్తించింది దర్యాప్తు బృందం. సిండికేట్ ఈ టార్గెట్లు రీచ్ కావడానికి వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ లతో సహా ఇతర అధికారులు వ్యూహాత్మకంగా నియమించినట్టు చెబుతున్నారు విచారణాధికారులు.

2019 అక్టోబర్ 8న మిథున్ రెడ్డి నివాసంలో నాటి ఎక్సైజ్ AC భేటీ

నాటి ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ సత్యప్రసాద్.. 2019 అక్టోబర్ 8న తిరుపతి మిథున్ రెడ్డి నివాసంలో.. కలసినట్టు చెబుతున్నారు అధికారులు. అంతే కాదు వాసుదేవరెడ్డితో పాటు హైదరాబాద్ లోని విజయసాయి రెడ్డి ఇంటికి వెళ్లినట్టు తాము ఆధారాలు సేకరించామని అంటున్నారు. ఇక్కడ APSBCL గత అమ్మకాల వివరాలు తీసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది.

A1- రాజ్ కేసిరెడ్డి, A7- ముప్పిడి అవినాష్ రెడ్డి, A2- వాసుదేవ రెడ్డి, A4- మిధున్ రెడ్డి, A3- సత్య ప్రసాద్..

సిట్ దర్యాపును అనుసరించి చెబితే.. ఏ1- రాజ్ కేసిరెడ్డి, ఏ7- ముప్పిడి అవినాష్ రెడ్డి, ఏ2- వాసుదేవ రెడ్డి, ఏ4- మిధున్ రెడ్డి, ఏ3- సత్య ప్రసాద్, ఏ5- విజయసాయి రెడ్డి ఇంట్లో.. 2019 అక్టోబర్ 13న మరో మారు కలిసినట్టు చెబుతున్నారు అధికారులు. గత మూడేళ్ల బేవరేజెస్ అమ్మకాల డాటా అధారంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు మున్ముందు ఎలా సాగించాలన్న విషయంపై చర్చించినట్టు తమ పరిశోధనలో తేల్చారు సిట్ అధికారులు. డాటా విశ్లేషణ తర్వాత వివిధ డిస్టలరీలు, పంపిణీదారుల నుంచి కమీషన్లు, కిక్ బ్యాక్ ల రూపంలో నెలకు 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయల మేర వసూళ్లు సాగించాలని ఒక నిర్దారణకు వచ్చినట్టు తెలుస్తోంది. వీరంతా కలసి ఆర్డర్ ఫర్ సప్లై దాట వేయడానికి ప్రభుత్వ రీటైల్ అవుట్ లెట్ లలో అమ్మకాలు నిర్వహించడానికి ఒక పథక రచన చేసినట్టు సిండికేట్ కూడా ఒప్పుకుందని చెబుతున్నారు అధికారులు. అందుకే ఏపీ హోం మంత్రి అనిత పక్కా ఆధారాలతోనే ఈ అరెస్టులు జరిగినట్టు చెబుతున్నారు.

సత్య ప్రసాద్ కు ఐఏఎస్ హోదా ఇచ్చేలా హామీ

మరింత లోతులకు వెళ్లి పరిశీలిస్తే ఏపీలోని కొన్ని బ్రాండ్లు, కంపెనీలకు మాత్రమే అనుకూలంగా వ్యవహరించడం వారు కోరిన విధంగా ముడుపులు చెల్లించడం, తద్వార ఆర్ధిక ప్రయోజనం పొందాలని భావించినట్టు తెలుసుకున్నారు అధికారులు. అంతే కాదు సత్యప్రసాద్ ఈ మొత్తం ఎపిసోడ్ లో సహకరించినందుకు ప్రతిఫలంగా 2023 నాటికి ఐఏఎస్ హోదా ఇస్తామని హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు విచారణాధికారులు.

ఒక హోటల్లో ఏ 6 సజ్జల శ్రీధర్ రెడ్డి డిస్టలరీ ఓనర్స్ తో మీటింగ్

ఇప్పటి వరకూ సిట్ చేసిన దర్యాప్తు ఆధారంగా చెబితే 2019 ద్వితీయార్ధంలో హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో ఏ 6- సజ్జల శ్రీధర్ రెడ్డి డిస్టలరీ యజమానులతో ఒక సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది. డిస్టలరీ ఓనర్లు తాము రూపొందించిన కొత్త పాలసీని అనుసరించి అమ్మకాలు సాగించాలని.. శ్రీధర్ రెడ్డి వీరికి సూచించినట్టు చెబుతున్నారు సిట్ అధికారులు.

ఎంపిక చేసిన పంపిణీదారులకు ఆర్డర్ ఆఫ్ సప్లై

తాము ఎంపిక చేసిన మద్యం పంపిణీదారులకు మాన్యువల్ ఆర్డర్ ఫర్ సప్లై జారీ చేయడంలో సహకరించాలని కోరినట్టు తెలుస్తోంది. ఒక వేళ వీరు తమ ప్రతిపాదనలు ఒప్పుకోకుంటే.. వారికి ఎలాంటి ఆర్డర్లుండవని బెదిరించినట్టు కూడా తెలుస్తోంది. ఆర్డర్ ఫర్ సప్లై ని అడ్డు పెట్టుకుని.. కిక్ బ్యాక్ లు పొందడం.. దోపిడీతో సమానంగా అభివర్ణించింది సిట్.

వీరు ఈ మొత్తం నాటి సీఎం జగన్ కి బదిలీ చేశారంటోన్న సిట్

ఈ విధానం ఒప్పుకోకుంటే.. తమ వ్యాపారంలో ఎలాంటి నష్టం వస్తుందోనని భయపడ్డ డిస్టలరీలు 12 శాతం కిక్ బ్యాక్ చెల్లించేందుకు ఒప్పుకున్నట్టు చెబుతున్నారు సిట్ అధికారులు. వీరు ఎలాగూ తమ దారికి వచ్చినట్టు తెలియడంతో.. కిక్ బ్యాక్ పర్సంటేజీని 20 శాతానికి పెంచినట్టు తెలుస్తోంది. సేకరించిన మొత్తాన్ని ఏ1 రాజ్ కేసిరెడ్డి కి అప్పగించేవారని గుర్తించారు సిట్ అధికారులు. ఆ తర్వాత రాజ్ కేసిరెడ్డి ఈ సొమ్మును ఏ 5- విజయ్ సాయి రెడ్డి, ఏ 4- మిథున్ రెడ్డి, ఏ 33- బాలాజీ గోవిందప్ప..కు బదిలీ చేసేవారని తెలుస్తోంది. వీరు దాన్ని నాటి సీఎం జగన్ మోహన్ రెడ్డికి బదిలీ చేసేలా ఒక కారిడార్ ని తాము కనుగొన్నట్టు చెబుతున్నారు సిట్ అధికారులు. ఈ మొత్తం సగటున నెలకు 50 నుంచి అరవై కోట్ల రూపాయల మేర జగన్ మోహన రెడ్డికి చేరినట్టు నిర్దారించారు విచారణాధికారులు.

అడాన్, లీలా అనే డిస్ట్రిబ్యూటర్స్ కి ఎక్కువ OFCలు

ఈ మొత్తం వ్యవహారంలో జరిగిన మరో మిస్టేక్ ఏంటంటే.. కొన్ని బ్రాండ్లు ఎక్కువగా అమ్ముడుపోయేలా చేయడం. ఏపీలోని అడాన్, లీలా అనే డిస్ట్రిబ్యూటర్స్ కి ఎక్కువ ఆర్డర్ ఫర్ సప్లై లు ఇచ్చినట్టు గుర్తించింది సిట్. అయితే ఇక్కడ మరో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే.. అప్పటి వరకూ చెలామణిలో ఉన్న టాప్ మోస్ట్ కంపెనీలకు, ఫేమస్ బ్రాండ్లకు OFSలు ఇవ్వకుండా ఆపేసినట్టు కనుగొన్నారు అధికారులు. ఈ ప్రముఖ బ్రాండ్లు నాటి జగన్ పాలనలో దాదాపు నిషేధం ఎదుర్కున్నట్టు గా చెబుతున్నారు సిట్ అధికారులు.

కిక్ బ్యాక్ లు, కమిషన్లు చెల్లించని బ్రాండ్లకు ఏపీలో

దీంతో ఏపీ కోటాను వారు ఇతర రాష్ట్రాలకు బదిలీ చేసుకున్నట్టు కనిపిస్తోంది. జనం బాగా ఇష్టపడే బ్రాండ్ల అమ్మకాలు ఏపీ లిక్కర్ మార్కెట్లో దారుణంగా పడిపోయినట్టు గుర్తించారు. కిక్ బ్యాక్ లు, కమిషన్లు చెల్లించని బ్రాండ్లకు ఏపీలో బొత్తిగా చోటు లేకుండా చేసినట్టు చెబుతారు సిట్ అధికారులు. ఇందుకు తగిన ఆధారాలను కనుగొన్నామంటున్నారు విచారణాధికారులు.

మెక్ డొవెల్
2018- 19 మధ్య 22, 73, 06 ఆర్డర్లు 2023- 24 మధ్య కేవలం ఐదు ఆర్డర్లు

మెడ్ డొవెల్ కంపెనీ 2018- 19 మధ్య కాలంలో 22, 73, 06 ఆర్డర్లు పొందితే అదే 2023- 24 మధ్య కేవలం ఐదంటే ఐదు ఆర్డర్లు లభించాయి. ఇంపీరియల్ బ్లూ 2018- 19 మధ్య 20, 21, 955 ఆర్డర్లు పొందగా.. 2023- 24 మధ్య ఏడంటే ఏడు మాత్రమే పొందినట్టు గుర్తించారు. కింగ్ ఫిషర్ 2018- 19 మధ్య కోటి రెండు లక్షల 47 వేల 566 ఆర్డర్లు పొందగా.. అదే 2023- 24 మధ్య 11 లక్షల 82 వేల 388 ఆర్డర్లు పొందినట్టు తెలుస్తోంది. ఇక బడ్ వైజర్ బీర్ సంగతికి వస్తే.. 2018- 19 మధ్య కాలంలో 22 లక్షల 52 వేల 195 ఆర్డర్లు పొందగా.. 2023-24 మధ్య కాలంలో ఇది తన ఆర్డర్లను సున్నాగా నమోదు చేసింది.

ప్రముఖ బ్రాండ్లు దాదాపు నిషేధం ఎదుక్కున్నట్టు గుర్తింపు

దీని కారణంగా మార్కెట్లో అప్పటి వరకూ జనామోదం పొందిన బ్రాండ్లు.. అందుబాటులో లేక పోవడంతో.. మద్యం ప్రియుల నుంచి తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తమైనట్టు గుర్తించారు అధికారులు. సిండికేట్ లోని వారు.. మార్కెట్ డిమాండ్ ఏంటన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తించలేదని చెబుతున్నారు. వినియోగదారులకు ఏమైనా కానీ, వారి మనోభావాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టించుకోకుండా.. కిక్ బ్యాక్ లు, కమిషన్లు చెల్లించే బ్రాండ్ లకు మాత్రమే ఆర్డర్లు వెళ్లినట్టు గుర్తించారు. అప్పటికీ తమకు అమ్ముతున్న బ్రాండ్ల నాణ్యతపై వినియోగదారుల నుంచి భారీగా ఫిర్యాదులందాయి. కానీ ప్రభుత్వం ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్టు తమకు కనిపించలేదని అంటారు విచారణాధికారులు.

మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మద్యం మొత్తం

మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మద్యం మొత్తం. ఈ స్కామ్ మనీ ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారు. అసలా నెట్ వర్క్ ఎలా సాగింది? కీలకంగా ఎవరు వ్యవహరించారు? వారికి సహకరించిన వారెవరు? అధికారులు ఎలాంటి ఆధారాల ద్వారా ఈ మొత్తం లిక్కర్ స్కామ్ ఐడెంటిఫై చేశారు.

ఏపీ మద్యం స్కామ్ విలువ రూ. 3500 కోట్ల మొత్తం

పాస్ పోర్ట్ నెంబర్లతో సహా ఐడెంటిఫై చేసిన సిట్ఒకటీ రెండు కాదు.. ఏకంగా 3500 కోట్ల మొత్తం సేకరణ ఎలా జరిగింది? అసలీ మొత్తం ఆధారాలను ఎలా సేకరించారు? ఈ లిక్కర్ స్కామ్ లో గుర్తించాల్సిన ముఖ్యమైన విషయాలేంటి? అని చూస్తే దర్యాప్తు అధికారులు ఎందరో సాక్షుల వాంగ్మూలాలు, డాక్యుమెంట్లు, బ్యాంకు రికార్డులు, ట్రావెల్ రూట్ మ్యాప్స్ వంటి ఆధారాలను బట్టీ ఏ1 రాజ్ కేసిరెడ్డి నేతృత్వంలో ఈ మొత్తం సిండికేట్ ఎలా పని చేసిందో కనుగొన్నారు అధికారులు.

2019- 2024 మధ్య వివిధ డిస్టలరీలు

2019- 2024 మధ్య వివిధ డిస్టలరీలు, లిక్కర్ మార్కెటింగ్ కంపెనీలు, ఒక చైన్ లింక్ ద్వారా 3500 కోట్ల రూపాయల మేర కిక్ బ్యాక్ లను క్రమ పద్ధతిలో సేకరించినట్టు చెబుతున్నారు సిట్ అధికారులు. ఈ మొత్తాన్ని ఎలా దారి మళ్లించారు? అన్న కోణంలోనూ ఎన్నో వివరాలు సేకరించారు విచారణాధికారులు.

ట్రావెల్ రికార్డుల ద్వారా గుర్తింపు

వివిధ వర్గాల సాక్షుల నుంచి వీరి కాల్ రికార్డుల ఆధారాలతో కలిపి, లిక్కర్ సిండికేంట్ ఎలా పని చేసిందో గుర్తించారు అధికారులు. ఈ మొత్తం సొమ్ము గత ప్రభుత్వ హయాంలో కీలకంగా పని చేసిన వారెవరో ఐడెంటిఫై చేశారు. వీరిలో బాలాజీ గోవిందప్పన్, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి వంటి వారితో పాటు సీనియర్ అధికారులు సైతం ఉన్నట్టు చెబుతున్నారు. కాల్ రికార్డింగుల విశ్లేషణ ద్వారా వీరు ప్రధాన కుట్రదారులుగా తెలుస్తోంది. అయితే వీరందరిలోకీ రాజ్ కేసిరెడ్డి అతడి సన్నిహితుల మధ్య పదే పదే చర్చలు జరిగినట్టు గుర్తించారు. ఈ మేరకు కాల్ రికార్డింగులు తాము కనుగొన్నట్టు చెబుతున్నారు అధికారులు. తద్వారా వీరు సేకరించిన మద్యం నిధులు, వీటి కోసం పుట్టించిన అక్రమ రసీదులు.. సైతం సేకరించారు విచారణాధికారులు.

2012- 2024 వరకూ చెవిరెడ్డి ద్గర PSOగా గిరిబాబు

2024 ఎన్నికల్లో ఓటర్లకు పంచడానికి తిరుపతి ఏఆర్ కానిస్టేబుల్ గా పని చేసిన గిరిబాబు.. తాను చెవిరెడ్డి దగ్గర 2012 నుంచి 2024 వరకూ PSOగా పని చేసినట్టు తమ దర్యాప్తులో గుర్తించినట్టు చెబుతున్నారు అధికారులు. ఎన్నికలకు ఆరు నెలల ముందు రాజ్ కేసిరెడ్డి అధ్వర్యంలో కిరణ్‌ కుమార్ రెడ్డి, చాణక్య, సైమన్ తదితరులు ఒక నెట్ వర్క్ గా ఏర్పడి పని చేసినట్టు తెలుస్తోంది. నగదు రవాణా చేయడంలో వీరికి సాయం చేయమని ఎమ్మెల్యే చెవిరెడ్డి తన PSOలకు సూచించినట్టు తెలుస్తోంది.

ప్రజాప్రాతినిథ్య చట్టం, అవినీతి నిరోధక చట్టం కింద నేరం

పోలింగ్ కి ముందు రోజుల్లో గరికపాడు చెక్ పోస్టు దగ్గర 8. 36 కోట్ల విలువైన కన్సైన్మెంట్ గల లారీని స్వాధీనం చేసుకున్నట్టు అధికారుల ముందు ఒప్పుకున్నాడు గిరిబాబు. ఈ క్యాష్ బాక్స్ లను దాచడానికి ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలను ఎంపిక చేశారని చెబుతున్నారు. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడానికి తమ క్యాష్ డంప్ ల నుంచి నగదు విస్తృతంగా వాడినట్టు గుర్తించారు అధికారులు. దీని ద్వారా ప్రజాప్రాతినిథ్య చట్టం, అవినీతి నిరోధక చట్టం వంటి పాటు పలు సెక్షన్ల కింద వీరు నేరాలకు పాల్పడ్డట్టు తాము గుర్తించినట్టు చెబుతున్నారు అధికారులు.

హైదరాబాద్ లో పలు అపార్ట్ మెంట్లు, తాడేపల్లి అపార్ట్ మెంట్లలో నగదు నిల్వ..

ఈ అక్రమ నిధులకు సంబంధించిన డంప్ లు హైదరాబాద్ లోని పలు అపార్ట్ మెంట్లు, తాడేపల్లి ల్యాండ్ మార్క్ అపార్ట్ మెంట్లలో నిల్వ చేసినట్టు గుర్తించారు. తాడేపల్లిలో ప్రణయ్ ప్రకాష్, హైదరాబాద్ లో వెంకటేష్ నాయుడు, సైమన్ వంటి వారి నుంచి డబ్బు సేకరించి కార్టన్లలో ప్యాక్ చేసి.. అధికారిక తుడా వాహనాల్లో, కొన్నిసార్లు ప్రైవేట్ లారీల్లో మరికొన్ని మార్లు.. ఈ మొత్తం తరలించినట్టుగా కనుగొన్నారు.

పొదిలి, ఒంగోలు, కావలితో సహా వివిధ ప్రాంతాలకు మొత్తాలు

2023 చివరి నాటి నుంచి 2024 ఎన్నికల వరకూ అనేకసార్లు నగదు రవాణా చేసినట్టు కనుగొన్నారు. ఒక్కో ట్రిప్పునకు 8 నుంచి 12 కోట్ల మేర తరలించినట్టు చెబుతున్నారు. పొదిలి, ఒంగోలు, కావలితో సహా వివిధ ప్రాంతాలకు ఈ మొత్తాలు వెళ్లినట్టు చెబుతున్నారు అధికారులు. ఆయా ప్రాంతాల్లో వైసీపీ అభ్యర్ధుల ఎన్నికల ప్రచారానికి, ఓటర్లకు డబ్బు పంచడానికి ఈ మొత్తాలను వాడినట్టు కనుగొన్నారు. ఈ మొత్తం ఆపరేషన్స్ ని ఎమ్మెల్యే చెవిరెడ్డి, బాలాజీకుమార్ యాదవ్, నవీన్ సమన్వయం చేసినట్టు చెబుతున్నారు. వీరికి తుడా డ్రైవర్లు, మరి కొందరు అనుచరులు సహకరించినట్టు తెలుస్తోంది. 3500 కోట్లలో కనీసం 200 కోట్లు ఎన్నికల కోసం వాడినట్టు చెబుతున్నారు సిట్ అధికారులు.

పలు స్థిరాస్తులు కొన్న ఏ1 రాజ్ కేసిరెడ్డి

ఏవన్ రాజ్ కేసిరెడ్డి మద్యం ద్వారా వచ్చిన ఈ మొత్తాన్ని.. స్థిరాస్తులను ఒక పద్దతి ప్రకారం కొన్నట్టు చెబుతున్నారు. రాజ్ కేసిరెడ్డి తన తల్లి సుభాషిణి పేరిట, తన అనుబంధ సంస్థ ఎషాన్వి ఇన్ ఫ్రా వంటి వాటి ద్వారా పెద్ద ఎత్తున భూమి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. షాబాద్, మచ్చనపల్లె, దామరపల్లె వంటి ప్రాంతాల్లో సుమారు 92 ఎకరాలను సేకరించినట్టు తాము ఆధారాలతో సహా తెలుసుకున్నామంటున్నారు సిట్ అధికారులు. రాజ్ కేసిరెడ్డి కొన్న భూముల విషయంలో రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్లు పెద్ద ఎత్తున సహకరించినట్టు తెలుస్తోంది. ఈ కన్సల్టెంట్లకు అదాన్ డిస్టలరీ ఖాతాల నుంచి నేరుగా డబ్బు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ భూముల మార్కెట్ విలువ వంద కోట్ల మేర ఉన్నట్టు చెబుతున్నారు అధికారులు. వివిధ ప్రైవేట్ సంస్థల నుంచి సుమారు పాతిక కోట్ల అనధికారిక లోన్లు మంజూరైనట్టు కూడా తెలుస్తోంది. రాజ్ కేసిరెడ్డి కొన్న భూముల విలువ పెంచడానికి కూడా ప్రణాళికలు రచించినట్టుగానూ చెబుతున్నారు.

రామ్ ఇన్ఫో, విజువల్ ఐటీ ద్వారా.. UNI కార్పొరేట్‌కు నిధులు

కిక్ బ్యాక్ లు, APSBCL నుంచి వచ్చిన నిధులను రామ్ ఇన్ఫో, విజువల్ ఐటీ ద్వారా మళ్లించి.. UNI కార్పొరేట్‌కు మళ్లించినట్టు కనుగొన్నారు. ఆపై బినామీల పెట్టుబడుల కోసం ఏ1, ఏ9లకు సొమ్ము మళ్లించినట్టు గుర్తించారు. రాజ్ కేసిరెడ్డి కి చెందిన ఎషాన్వీ ఇన్ ఫ్రా అనే కంపెనీ పేరిట- గచ్చిబౌలీలో 326 గంజాల భూమిని కొన్నట్టు ఆధారాలు సేకరించారు. ఈ సైట్ ఓపెన్ మార్కెట్ విలువ 9 కోట్ల వరకూ ఉన్నట్టు తాము ఐడెంటిఫై చేశామంటున్నారు అధికారులు. ఇక UNI కార్పొరేట్ సొల్యూషన్స్ కి 1. 6 కోట్ల వైట్ మనీ మళ్లించినట్టు ఆధారాలు సేకరించారు. మిగిలిన మొత్తాన్ని బ్లాక్ లో చెల్లించినట్టు కనుగొన్నారు. ఈ లావాదేవీలన్నీ రాజ్ కేసిరెడ్డి ఆదేశాల మేరకే జరిగినట్టు చెబుతున్నారు సిట్ అధికారులు. ఈ ల్యాండ్ కొనుగోలు వ్యవహారంలో అవకతకవకలున్నట్టు చెబుతున్నారు అధికారులు. ఇందులో మనీ లాండరింగ్ జరిగినట్టు తాము గుర్తించినట్టు చెబుతున్నారు. ఏవన్ రాజ్ కేసిరెడ్డి ఆదేశాలతో, ఏ9 కిరణ్ సాయంతో UNI కార్పొరేట్ సొల్యూషన్స్.. ఈ లావాదేవీలు జరిపినట్టు తెలుస్తోంది.

దుబాయ్ లో అక్రమ లావాదేవీల కోసం కొంత మళ్లింపు

దుబాయ్ లోనూ అక్రమ ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహించడానికి లిక్కర్ సొమ్ములో కొంత భాగం దారి మళ్లించినట్టుగా తెలుస్తోంది. రహస్య మార్గాల ద్వారా.. దుబాయ్ కి ఈ నిధులు వెళ్లినట్టు గుర్తించారు. ఇది మనీ లాండరింగ్ కిందకు వస్తుందని అంటున్నారు. ఇదుకు తగిన ఆధారాలను తాము సేకరించినట్టు చెబుతున్నారు అధికారులు. ఇక్కడ గుర్తించాల్సిన మరో ముఖ్యమైన విషయమేంటంటే.. జాంబియా, టాంజానియా వంటి ఆఫ్రికన్ దేశాలలో మైనింగ్ వెంచర్లను అన్వేషించడానికి కోట్ల రూపాయల మేర ఖర్చు చేసినట్టు కూడా కనుగొన్నారు. నిందితులు.. ఈ క్రమంలో ఆయా దేశాల్లో సంచరించినట్టుగానూ వారి ట్రావెల్ రికార్డుల చెబుతున్నాయంటారు అధికారులు.

2021- 3, 2022- 5, 2023- 13, 2024- 7 ట్రిప్పులు..

ఏ వన్ రాజ్ కేసిరెడ్డి ఆదేశాల మేరకు ఏ9 కిరణ్.. పలు హవాలా మార్గాల ద్వారా యూఏకి కోట్లాది రూపాయల మేర బదిలీ చేసినట్టు గుర్తించింది సిట్. ఈ నిధులను ఉపయోగించి.. TEKKR ట్రేడింగ్ LLC, TEKKR ట్రక్ UAE, ట్రాన్స్‌పోర్ట్ LLC, హోమ్‌హేవ్స్ ఆన్‌లైన్ ఫర్నిచర్ కంపెనీ, TEKKR ట్రాన్స్‌పోర్ట్ లిమిటెడ్ UK వంటి పలు కంపెనీలు స్థాపించినట్టు కనుగొన్నారు విచారణాధికారులు. ఈ కంపెనీల కోసం 2021లో 3, 2022 ఐదు, 2023లో 13 ట్రిప్పులు, 2024లో ఏడు ట్రిప్పులు.. మొత్తంగా రాజ్ కేసిరెడ్డి అండ్ కో 28 విదేశీ పర్యటనలు చేసినట్టుగా గుర్తించారు. పాస్ పోర్టు నెంబర్లతో సహా ఐడెంటిఫై చేసి వీరి విదేశీ కార్యకలాపాలపై ఒక అంచనాకు వచ్చింది సిట్.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×