Sivakarthikeyan Politics: తమిళనాడులో విజయ్ సీఎం అయ్యాక చాలామంది సినీ నటులు పాలిటిక్స్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ లిస్టులోకి తాజాగా శివకార్తికేయన్ చేరాడు. ఫ్యాన్స్‌తో ఇప్పటికే మీటింగ్ పెట్టిన శివకార్తికేయన్ తాను పీపుల్ మేడ్ స్టార్‌ని అంటూ సస్పెన్స్ పెంచాడు. ఈ మీట్‌కు 3 వేల మంది ఫ్యాన్స్ హాజరుకావడంతో రాజకీయంగా చర్చకు తెరతీసింది.
ఫ్యాన్ మీట్‌లో భాగంగా అభిమానులకు, విద్యార్ధులకు కీలక సూచనలు చేశాడు శివకార్తికేయన్. విమర్శలను పట్టించుకోకుండా, మనందరం ప్రేమతో కలిసి ఉండాలని సూచించాడు. విద్యార్ధులు బాగా చదవాలని, కుటుంబానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని కోరాడీ హీరో. ఈ మీట్ తర్వాత ఆయన కూడా పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నాడన్న చర్చ చెన్నైలో పెరుగుతోంది.
Also read: వర్కింగ్ వీసాలపై అమెరికా మరో బిగ్ వార్నింగ్.. H-1B వీసాలను రద్దు..?
తమిళనాట హీరోలు వరుసగా నిర్వహిస్తున్న ఫ్యాన్ మీట్‌లు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా నటులు తమ అభిమాన బలాన్ని ఒక క్రమశిక్షణ గల వ్యవస్థగా మలచుకోవడానికి, సేవా కార్యక్రమాలను విస్తృతం చేయడానికి, భవిష్యత్తు రాజకీయ వ్యూహాల కోసం ఈ తరహా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇటీవలే హీరోలు ధనుష్, సూర్య, విశాల్ కూడా అభిమానులతో భేటీ అయ్యారు. ప్రజాసేవలో భాగం కావాలని పిలుపునిచ్చారు. మరోవైపు ప్రముఖ కోరియోగ్రాఫర్, దర్శక నటుడు రాఘవ లారెన్స్ కూడా పొలిటికల్ హీట్ పెంచాడు. తాను రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించాడు లారెన్స్.
ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ కూడా గతంలో ఇలాంటి ఫ్యాన్ మీట్‌లతోనే రాజకీయాలు స్టార్ట్ చేశారు. ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ ఫ్యాన్ క్లబ్ ప్రతినిధులతో పనైయూర్ ఫామ్‌హౌస్‌లో వరుసగా నిర్వహించిన రాజకీయ సన్నాహక సమావేశాలే ప్రస్తుత కోలీవుడ్ హీరోల ఫ్యాన్ మీట్స్‌కు స్ఫూర్తిగా నిలిచాయని కోలీవుడ్ కోడై కూస్తోంది.
Also read: మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఆ భూముల కేసులో జోక్యానికి నో!