E-Paper
Advertisement

సింగరేణి కార్మికులకు భారీ గుడ్ న్యూస్.. బోనస్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం!

సింగరేణి కార్మికులకు భారీ గుడ్ న్యూస్.. బోనస్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం!
Advertisement

Singareni Bonus: రానున్న దసరా, దీపావళి, నవరాత్రుల పండుగల కానుకగా సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,10,250 చొప్పున బోనస్‌ ఇవ్వాలని నిర్ణయమైనదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దేశానికి వెలుగులు పంచేందుకు పగలు, రాత్రి కష్టపడి పనిచేస్తున్న సింగరేణి కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని ఆయన తన ఖాతాలో పోస్ట్ చేసారు.

దేశాభివృద్ధిలో..

సింగరేణి బొగ్గు ఉత్పత్తి సంస్థ మాత్రమే కాదు. సింగరేణి పరిశ్రమ మన తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారం. లక్షలాది కుటుంబాలకు జీవనాధారం అని అన్నారు. దేశాభివృద్ధిలో తెలంగాణ అభివృద్ధిలో కీలక భాగస్వామని, సింగరేణి కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, సింగరేణి భవిష్యత్తు కోసం సింగరేణి యాజమాన్యం, కార్మికులు మరింత సమన్వయంతో పనిచేయాలని కోరుతున్నానని అన్నారు. ప్రస్తుత అవసరాలు, భవిష్యత్తు దృష్ట్యా సింగరేణి కూడా బొగ్గు ఉత్పత్తిని మరింతగా పెంచేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని కిషన్ రెడ్డి తెలిపారు.

Advertisement

Also read: తమిళ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు.. శివకార్తికేయన్ సమావేశం వెనుక వ్యూహం ఇదేనా?

హృదయపూర్వక శుభాకాంక్షలు..

దేశ ప్రగతిలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి మరింత కీలకపాత్ర పోషించాలని కోరుతున్నాను. తెలంగాణ ప్రభుత్వం కూడా సింగరేణికి ఇవ్వాల్సిన 60 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నానని కిషన్ రెడ్డి తెలిపారు. సింగరేణి కార్మికులకు, ఉద్యోగులు వారి కుటుంబసభ్యులకు దసరా, దీపావళి పండుగల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

Advertisement

Also read: వర్కింగ్ వీసాలపై అమెరికా మరో బిగ్ వార్నింగ్.. H-1B వీసాలను రద్దు..?

Tags

Related News

ఉల్లి రూ.70, వెల్లుల్లి రూ.240.. సామాన్యుడు ఎలా బతకాలి? రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు ప్రశ్నల వర్షం

హైదరాబాద్‌లో దారుణం.. వృద్ధుడే లక్ష్యంగా హనీట్రాప్.. రూ.38 లక్షలు కాజేసిన కేటుగాడు!

బీఆర్ఎస్ సోషల్ మీడియాకు.. బల్మూరి వెంకట్ మాస్ వార్నింగ్!

తెలంగాణ సచివాలయానికి మంచినీటి స‌ర‌ఫ‌‌రా బంద్!

కేంద్రంతో తెలంగాణ రోడ్ల ముచ్చట.. నితిన్ గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక భేటీ!

ఒక్కో అధికారికి 10 మండలాలా? తెలంగాణ ఉద్యాన శాఖలో ఏం జరుగుతోంది!

తెలంగాణ ఇంటర్ బోర్డ్ సంచలన నిర్ణయం.. 35 మంది జూనియర్ లెక్చరర్ల తొలగింపు!

Big Stories

Advertisement
×