E-Paper
Advertisement

టీపీసీసీ చీఫ్‌ సొంత జిల్లాలో గౌడ్‌ల సాంఘీక బహిష్కరణ.. వీడీసీల ఆగడాలకు చెక్‌ పడేదెలా…? దశాబ్దాలుగా ఆ రెండు నియోజకవర్గాల్లో ఇదే అరాచకం..

టీపీసీసీ చీఫ్‌ సొంత జిల్లాలో గౌడ్‌ల సాంఘీక బహిష్కరణ.. వీడీసీల ఆగడాలకు చెక్‌ పడేదెలా…? దశాబ్దాలుగా ఆ రెండు నియోజకవర్గాల్లో ఇదే అరాచకం..
Advertisement

విలేజ్‌ డెవలప్‌మెంట్‌ కమిటీల పేరుతో నిజామాబాద్‌ జిల్లాలో సమాంతర ప్రభుత్వాలు నడపే అలవాటు ఇంకా పోలేదు. ఇక్కడ దశాబ్దాలుగా బీసీలు, దళితులపై అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. సాంఘీక బహిష్కరణ పేరుతో పెద్దరాయుడి తీర్పులు వెలువరిస్తూనే ఉన్నారు.

మాట వినకపోతే చాలు..ఆ కులానికి సంబంధించిన కుటుంబాలన్నింటినీ సాంఘీక బహిష్కరణ చేయడం ఇక్కడ పరిపాటి. ఆ వీడీసీలు ఇచ్చే తీర్పుకు ఆ ఊరు ఊరంతా కట్టుబడి ఉండాలి. లేదంటే వారికీ జరిమానా తప్పదు. పాలు పోపేవాడి దగ్గర్నుంచి కిరాణా సామాను అమ్మే దుకాణం వాడు… అంతా వీరిని బహిష్కరించాలి. ఎట్టి పరిస్థితుల్లో సహకరించొద్దు. మాట్లాడొద్దు. వస్తువుల అమ్మొద్దు. పట్టించుకోవద్దు.. ఇవీ ఆ పెదరాయుడి తీర్పు కట్టుబాట్లు.

Advertisement

సమాజం ఎంత డెవలప్‌ అవుతున్నా.. రాజకీయంగా జనం చైతన్యవంతువుతూ వస్తున్నా.. ఇంకా ఇలాంటి చాదస్తపు కట్టుబాట్లు, నియంతృత్వ పోకడలతో ఉన్న గ్రామాలున్నాయి. దశాబ్దాలుగా ఇలాంటి కట్టుబాట్లు ఇక్కడ అమలవుతూ వస్తున్నాయి. పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ సొంత ఇలాఖా నిజామాబాద్‌ జిల్లాలో ఇలాంటి ఘటనలు తరుచూ పునరావృతమవుతున్నాయి.

మహేశ్‌ సొంత నియోజకవర్గం బాల్కొండ పరిధిలోని ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్‌లో ఏకంగా 49 కుటుంబాలపై (39 గౌడ, 10 ఎస్సీ కుటుంబాలు) విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ (VDC) సాంఘిక బహిష్కరణ విధించింది. తొమ్మిది నెలల క్రితం ఈ వివాదానికి బీజం పడింది. తాళ్ల రాంపూర్‌ గ్రామానికి చెందిన గీత కార్మికుల (గౌడ కులస్థుల) సంఘానికి చెందిన 4 ఎకరాల ఈత వనాల భూమిని వీడీసీ అమ్ముకుందని, ఈత చెట్లను ధ్వంసం చేసిందని వివాదం మొదలైంది. ఆ సమయంలో సాంప్రదాయ వృత్తిని చేసుకోనివ్వకుండా అడ్డుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

Advertisement

మాపైనే ఫిర్యాదు చేస్తారా? అంటు అప్పుడు వీడీసీ తొలిసారిగా వీరిని సాంఘీక బహిష్కరణ చేసింది. ఇది పెద్ద వివాదం కావడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. తాజాగా ఆ వీడీసీ పెద్దలకు పోలీసు శాఖ నోటీసులు జారీ చేసింది. దీంతో మళ్లీ ఈ వివాదం రచ్చకెక్కింది.  ఇటీవల మళ్లీ 39 గౌడ కులస్తుల తోపాటు 10 ఎస్సీ కుటుంబాలకు సాంఘీక బహిష్కరణ చేస్తూ వీడీసీ తీర్పునిచ్చింది. ఈ తీర్పును జవదాటిన వారికి 25వేల రూపాయల జరినామా విధిస్తామని ప్రకటించింది.

దీనిపై జిల్లా సీపీ పి సాయి చైతన్యతో మొరపెట్టుకున్నారు బాధితులు. అంతకు ముందు ఆ ఊరికి వెళ్లి వీడీసీలతో చర్చలు జరిపినా ఫలితం దక్కలేదు. వీడీసీలు తమ వైఖరి మార్చుకోలేదు. తమకు ఎదురు తిరిగితే ఇదే గతి పడుతుందనేలా తీర్పులు ఇస్తూనే ఉంది. నిజామాబాద్‌ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ నియోజవర్గాల్లో ఈ తరహా వీడీసీ పెద్దరాయుడి తీర్పులు ఇక్కడ దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి.

వీరిని ఏ రాజకీయ పార్టీ కూడా ఎదురించదు. ఎన్నికల్లో వీరంతా ఎవరికి ఓటేయమని చెబితే వారికే ఓటేస్తారనే కట్టుబాట్లు కూడా ఉండటమే దీనికి కారణంగా చెబుతారు. అయితే ఇప్పుడిది టీపీసీసీ చీఫ్‌ ఇలాఖా కావడంతో రాజకీయంగా చర్చకు తెర తీసింది. మహేశ్‌ గౌడ్‌కు చెందిన సామాజిక వర్గానికి చెందిన వారే సాంఘీక బహిష్కరణ కావడంతో ఈ వివాదం ప్రాధాన్యతను సంతరించుకున్నది.

Tags

Related News

బైపోల్ తో ఇక అన్నీ సమకూరుతున్నట్టేగా! ఇందిరమ్మ ఇండ్లకు కొదవలేదు… అభివృద్ధి పనులకు అడ్డులేదు..!

గెలుపు గ్రాఫ్‌ తగ్గని నేత.. ప్రజాబలంలో మార్పు లేదు. బలమైన నేతగా దానం.. బరిలో ప్రత్యర్థివర్గానికి గట్టిపోటీ..!

కేసీఆర్‌ను కామెడీ పీస్‌ను చేసిండ్రు కదరా!? చావు నోట్లో తలపెట్టి.. డైలాగెందుకు వాడినట్టో…!? ఉద్యమాన్ని అవమానించడం కాదా?

DSC ఉద్యోగాల అమ్మకాలపై వైసీపీ సంచలన ఆధారాలు.. షాక్‌లో కూటమి సర్కార్!

పసికందుల విక్రయ దందా పై హైకోర్టు ఫైర్.. ఆ శాఖకు నోటీసులు జారీ?

దేశ రాజధానిలో ఘోరాతి ఘోరం.. 6 ఏళ్ల చిన్నారిని కూడా వదలని కిరాతకులు?

తెల్గు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఫామ్‌హౌజ్‌…! ఆ పదం రాసినందుకు ఇలేకరికి ఇచ్చిపడేసిన పెద్దసారు..!

Big Stories

Advertisement
×