E-Paper
Advertisement

టాటా To మహీంద్రా.. బ్లైండ్ స్పాట్ ఫీచర్ ఉన్న కార్ల లిస్ట్ ఇదే!

టాటా To మహీంద్రా.. బ్లైండ్ స్పాట్ ఫీచర్ ఉన్న కార్ల లిస్ట్ ఇదే!
Advertisement

Blind Spot Monitor Cars in India: కార్లు నడిపేటప్పుడు డ్రైవర్‌కు ఎదురయ్యే ప్రధాన సమస్యల్లో బ్లైండ్ స్పాట్ ఒకటి. ముఖ్యంగా లేన్ మార్చే సమయంలో పక్కనే ఉన్న వాహనం అద్దంలో కనిపించకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను తగ్గించేందుకు కార్ల కంపెనీలు కెమెరాలు, బ్లైండ్ స్పాట్ మానిటర్లు, ADAS వంటి టెక్నాలజీలను అందిస్తున్నాయి. హోండా నుంచి టాటా, మహీంద్రా, కియా వరకు పలు మోడళ్లలో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

హోండా అమేజ్.. ఎడమ వైపు ప్రత్యేక కెమెరా!

హోండా అమేజ్‌లో VX వేరియంట్ నుంచి లేన్‌వాచ్ సిస్టమ్ లభిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.8.65 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. సాధారణ 360 డిగ్రీ కెమెరాకు బదులుగా హోండా ప్రత్యేకమైన విధానాన్ని ఉపయోగించింది. ప్రయాణికుల వైపు ఉన్న ORVM సమీపంలో కెమెరాను అమర్చి, కారు ఎడమ వైపు సాధారణ అద్దంతో కనిపించని ప్రాంతాన్ని స్క్రీన్‌పై చూపిస్తుంది. లేన్ మార్చేటప్పుడు ఈ అదనపు విజిబిలిటీ ఉపయోగపడుతుంది. అమేజ్‌ లో ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు, మల్టీ యాంగిల్ రియర్ కెమెరా లాంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.

టాటా నెక్సాన్.. 360 డిగ్రీల విజిబిలిటీ!

Advertisement

టాటా నెక్సాన్‌లో క్రియేటివ్+ వేరియంట్ నుంచి 360-డిగ్రీ HD సరౌండ్ వ్యూ సిస్టమ్, బ్లైండ్ వ్యూ మానిటర్ అందుబాటులో ఉంటాయి. ఈ వేరియంట్ ధర సుమారు రూ.10 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. కారు చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కెమెరాల ద్వారా చూపించడం దీని ప్రత్యేకత. పార్కింగ్ సమయంలో మాత్రమే కాకుండా ఇరుకైన ప్రదేశాల్లో కారు నడిపేటప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది. బ్లైండ్ వ్యూ మానిటర్ పక్క ప్రాంతంపై అదనపు సమాచారం ఇస్తుంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు కూడా నెక్సాన్‌ లో ఉన్నాయి.

XUV 3XO.. బ్లైండ్ స్పాట్‌తో పాటు ADAS

మహీంద్రా XUV 3XOలో ఈ టెక్నాలజీ AX5 L వేరియంట్ నుంచి లభిస్తుంది. దీని ధర సుమారు రూ.13.27 లక్షల నుంచి ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకత కేవలం కెమెరా విజిబిలిటీ కాదు. బ్లైండ్ స్పాట్ మానిటర్, లేన్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ లాంటి ఫీచర్లు లెవెల్-2 ADAS ప్యాకేజీలో భాగంగా ఉంటాయి. కొన్ని వేరియంట్లలో 360 డిగ్రీ కెమెరా కూడా లభిస్తుంది. అంటే బ్లైండ్ స్పాట్ సహాయం ఒక ప్రత్యేక ఫీచర్‌గా కాకుండా, డ్రైవర్‌ కు మరింత సాయపడే భద్రతా వ్యవస్థలో భాగంగా పనిచేస్తుంది.

కియా సోనెట్.. టెక్నాలజీ ప్యాకేజీతో

Advertisement

కియా సోనెట్‌లో GTX+ వేరియంట్ నుంచి బ్లైండ్ వ్యూ మానిటర్ అందుబాటులో ఉంటుంది. ఈ వేరియంట్ ధర సుమారు రూ.13.66 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. కెమెరా ద్వారా కారు పక్క భాగాన్ని స్క్రీన్‌పై చూపించే ఈ వ్యవస్థ లేన్ మారేటప్పుడు ఉపయోగపడుతుంది. దీనికి తోడు 360-డిగ్రీ కెమెరా, లెవెల్-1 ADAS వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. సోనెట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటి భద్రతా సదుపాయాలు కూడా ఉన్నాయి.

హోండా ఎలివేట్.. SUVలో లేన్‌వాచ్

హోండా ఎలివేట్‌ లో కూడా అమేజ్ తరహాలో లేన్‌వాచ్ కెమెరా ఉంది. ఇది VX వేరియంట్ నుంచి లభిస్తుంది. ఈ వేరియంట్ ధర సుమారు రూ.13.92 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 360-డిగ్రీ కెమెరా మాదిరిగా మొత్తం వాహనం చుట్టూ వ్యూ ఇవ్వడమే కాకుండా, లేన్‌వాచ్ ప్రధానంగా ఎడమ వైపు బ్లైండ్ స్పాట్‌ను చూపించడంపై దృష్టి పెడుతుంది. సాధారణ ORVMతో పూర్తిగా కనిపించని ప్రాంతాన్ని అదనంగా పరిశీలించేందుకు ఇది ఉపయోగపడుతుంది.

Read Also: టాటా నంబర్ వన్.. మహీంద్రా నెక్స్ట్.. విన్‌ఫాస్ట్ స్పీడ్ చూస్తే షాక్!

Tags

Related News

కొత్త టయోటా ల్యాండ్ క్రూయిజర్ వచ్చేస్తోంది.. లుక్ చూస్తే మతిపోవాల్సిందే!

టాటా నంబర్ వన్.. మహీంద్రా నెక్స్ట్.. విన్‌ఫాస్ట్ స్పీడ్ చూస్తే షాక్!

రిలీజ్ కు ముందే టాటా ఏరిస్ వీడియో లీక్.. CNG మోడల్‌ లో ఇవే హైలైట్స్!

బజాజ్ పల్సర్ లో అదిరిపోయే అప్‌డేట్.. TFT స్క్రీన్‌తో కొత్త లుక్!

హ్యుందాయ్ బేయాన్ బుకింగ్స్ ఓపెన్.. క్రెటా కంటే తక్కువ ధరలో కొత్త SUV!

ఈ కారు తనంతట తానే రివర్స్ వెళ్తుంది.. టక్సన్ టెక్నాలజీ చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా థార్ OG వచ్చేసింది.. కొత్త మోడల్ లో ఏం మారిందంటే?

Big Stories

Advertisement
×