E-Paper
Advertisement

హైదరాబాద్‌వాసులూ జాగ్రత్త.. రోడ్డుపై చెత్త వేస్తే కెమెరా కన్ను మీపైనే!

హైదరాబాద్‌వాసులూ జాగ్రత్త.. రోడ్డుపై చెత్త వేస్తే కెమెరా కన్ను మీపైనే!
Advertisement

GHMC Sanitation: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని అత్యధిక మంది జనాభాకు పౌర, అత్యవసర సేవలందిస్తున్న జీహెచ్ఎంసీ హైదరాబాద్ మహానగరాన్ని బిన్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితాలివ్వటం లేదు. దీంతో సిటీలో ఎక్కడబడితే అక్కడ చెత్త వేస్తున్న వారిని గుర్తించి, వారి నుంచి భారీగా జరిమానాలు వసూలు చేసే దిశగా శానిటేషన్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటి వరకు అవగాహన పేరిట చేసిన ప్రయత్నాలన్ని విఫలం కావటంతో ఇపుడు ఆధునికతను వినియోగించుకుని శానిటేషన్ ను గాడీన పెట్టేందుకు సిద్దమైంది.

జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ..

Advertisement

జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం స్వచ్ఛ ఆటో టిప్పర్ ద్వారా కార్మికులు ఇంటింటి నుంచి చెత్తను సేకరిస్తున్నారు. ఈ సేకరణకు గాను కార్మికులకు నెలకు ఛార్జీలను చెల్లించాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేయటంతో చాలా మంది కుటుంబ యజమానులు ఇప్పటికే ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్న తాము గ్యార్బేజీ కలెక్షన్ ఛార్జీలు ఎందుకు చెల్లించాలని కార్మికులకు విభేధిస్తూ ఇంట్లో పోగైన చెత్తను రోడ్లపై ఎక్కడబడితే అక్కడ వేసేస్తున్నారు. మరి కొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికులు నెలసరి ఛార్జీలు స్వీకరిస్తూ చెత్తను సేకరించకపోయే సరికి అలవాటులో పొరపాటుగా పాత కాలంలో చెత్త కుండీలను ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో ప్రజలు చెత్త పారవేస్తున్నారు. ఇలా చాలా సార్లు చెత్త వేసిన వారిని గుర్తించి శానిటేషన్ సిబ్బంది అవగాహన కల్పించినా చెత్త ఎక్కవగా పేరుకుపోయే గ్యార్బేజీ వర్నరబుల్ పాయింట్లు (జీవీపీ) తగ్గటం లేదు.

రూ. 7 కోట్ల వ్యయంతో 2500 సీసీ కెమెరాలు

Advertisement

పైగా రోజురోజుకి ప్రతి సర్కిల్ లో ఈ గ్యార్బేజీ వర్నరబుల్ పాయింట్ల పెరుగుతూ వస్తున్నాయి. చెత్తను ఇంటింటి నుంచి సేకరించి, వీలైనంత త్వరగా ట్రాన్స్ ఫర్ స్టేషన్ కు, అక్కడి నుంచి డంపింగ్ యార్డుకు తరలించేందుకు జీహెచ్ఎంసీ రౌండ్ ది క్లాక్ పని చేస్తున్నా, గ్యార్బేజీ వర్నరబుల్ పాయింటలో పేరుకుపోతున్న చెత్తను మాత్రం అదుపు చేయలేకపోతున్నందు, జీహెచ్ఎంసీకి తలభారంగా మారిన ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని సమకూర్చేందుకు ఈ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు తొలి విడతగా రూ. 7 కోట్ల వ్యయంతో 2500 సీసీ కెమెరాలను సమకూర్చుకునేందుకు సిద్దమైంది. ఇందుకు ఇప్పటికే జీహెచ్ఎంసీ అర్హత కల్గిన ఏజెన్సీల నుంచి రిక్వెస్ట్ ఫర్ ప్రపొజల్ (ఆర్ఎఫ్ పీ)ను ఆహ్వానిస్తూ ఉత్తర్వులను కూడా జారీ చేసింది.

పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ తో లింకు

గ్యార్బేజీ వర్నరబుల్ పాయింట్లలో చెత్త వేయటాన్ని అదుపు చేసేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాటు చేయనున్న సీసీ కెమెరాలను పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ను లింకు చేసి ఏర్పాటు చేయనున్నారు. ఈ వర్నరబుల్ పాయింట్ల వద్ద జీహెచ్ఎంసీ నిర్ణయించే పరిమిత ఏరియాలో ఎలాంటి చెత్త, వ్యర్థాలు పడేసిన వెంటనే పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఇక్కడ చెత్త వయవద్దు, చెత్త వేస్తే కఠిన చర్యలు తప్పవని అనౌన్స్ చేసేలా ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. కేవలం సీసీ కెమెరాలను సమకూర్చటమే గాక, వాటిని ఏర్పాటు చేయటంతో పాటు టెస్టింగ్, ఆపరేషన్, మెయింటనెన్స్ బాధ్యతలు స్వీకరించేలా ప్రతిపాదనలను సమర్పించాలని జీహెచ్ఎంసీ అర్హత కల్గిన ఏజెన్సీలను ఆదేశించింది. నిర్లక్ష్యంగా చెత్త వేస్తున్న వీడియోను సీసీ కెమెరా క్యాచ్ చేయటంతో పాటు చెత్త వేసే వారిని స్థానికులు ఆపేలా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ తో అనౌన్స్ మెంట్ ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ భావిస్తుంది. ఈ వీడియో, అనౌన్స్ మెంట్లు చెత్త వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సాక్ష్యాలుగా వినియోగించుకునే అవకాశమున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

సీసీ నిఘాను ఏర్పాటు చేసిన తర్వాత

జీహెచ్ఎంసీ పరిధిలో గ్యార్బేజీ వర్నరబుల్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన తర్వాత వాటిని జీహెచ్ఎంసీలోని కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయనున్నారు. పాయింట్లలో ఇష్టారాజ్యంగా చెత్త ను వేసిన వారు వచ్చిన వారిని గుర్తించి వారికి నేరుగా జరిమానాలు విధించే యోచనలో జీహెచ్ఎంసీ అధికారులున్నారు. మొదటి సారిగా చెత్త వేసిన వారికి నామమాత్రంగా జరిమానాలు విధించటం, రెండో సారి వేసిన వారికి పెద్ద మొత్తంలో జరిమానాలు విధించాలని జీహెచ్ఎంసీ భావిస్తుంది. ఈ చెత్త వేసిన వారు స్థానికంగా వ్యాపారులేతే వారికి జరిమానా విధించటంతో పాటు వారు వ్యాపార సంస్థకు జీహెచ్ఎంసీ జారీ చేసిన ట్రేడ్ లైసెన్స్ ను రద్దు చేయాలని కూడా జీహెచ్ఎంసీ భావిస్తున్నట్లు సమాచారం. వరుసగా పలు సార్లు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తూ చెత్త వేసే వారిని గుర్తించి, వారిలో మార్పు రాకపోతే క్రిమినల్ కేసులను కూడా నమోదు చేసేలా కఠినంగా వ్యవహారించాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. జరిమానాలను తొలుత కనిష్టంగా రూ. వెయ్యి, గరిష్టంగా రూ. లక్ష వరకు విధించాలని కూడా యోచిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, ఈ గ్యార్బేజీ వర్నరబుల్ పాయింట్లలో ఏర్పాటు చేయనున్న పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ తో కూడిన సీసీ కెమెరాలను వర్షాకాలం వర్షాలు కురిసినపుడు వర్నరబుల్ పాయింట్ల పరిసరాల్లో పరిస్థితిని నేరుగా జీహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ రూమ్ ను పర్యవేక్షించే వెసులుబాటు కూడా కల్గుతుందని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు.

Also Read: రోడ్ డస్ట్‌పై సర్కార్ మాస్టర్ ప్లాన్.. వాయు కాలుష్యానికి చెక్ పెట్టేలా బిగ్ స్టెప్!

Tags

Related News

ఏపీ, తెలంగాణలో దసరా సెలవుల షెడ్యూల్ విడుదల!

రోడ్ డస్ట్‌పై సర్కార్ మాస్టర్ ప్లాన్.. వాయు కాలుష్యానికి చెక్ పెట్టేలా బిగ్ స్టెప్!

రైతులకోసం తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. కొత్త సేవలు ప్రారంభం!

ఆపరేషన్ క్రాక్ డౌన్.. 101 మంది సైబర్ కేటుగాళ్ల అరెస్ట్!

మూసీ పునరుజ్జీవంలో మరో కీలక అడుగు.. ఓంకారేశ్వర ఆలయాభివృద్ధికి రూ.1,108 కోట్లు మంజూరు

పటేల్‌కు ఓట్లు పడితే నెహ్రూను ప్రధాని చేశారు.. ఓటు చోరీ కాంగ్రెస్‌దే: బండి సంజయ్

నా రూటే సెపరేటు.. ఆశ-ఆసక్తి లేదన్న బండ్ల గణేష్, తెర వెనుక అసలు ఏం జరిగింది?

Big Stories

Advertisement
×