BigTV English

BIG Shock To Nagababu: పిఠాపురం సభ ఎఫెక్ట్.. మంత్రి పదవి లేనట్లే!

BIG Shock To Nagababu: పిఠాపురం సభ ఎఫెక్ట్.. మంత్రి పదవి లేనట్లే!

పీఆర్పీలో పవన్ ఎక్కువ పనిచేసిన నాగబాబు

కొణిదెల నాగేంద్రబాబు అలియాస్‌ నాగబాబు గురించి తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ పరిచయం అక్కరలేదు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్‌ కల్యాణ్‌ కంటే ఎక్కువ పని చేసిన నాగబాబు.. ఆ తర్వాత చిరంజీవి కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో సైలెంట్‌ అయ్యారు..తరువాత జనసేన ఆవిర్భావం నుంచి తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ వెంట నిలిచారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున ఎక్కడా పోటీ చేయని నాగబాబు, 2019లో జనసేన నుంచి నరసాపురం లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు.


పొత్తుల లెక్కలతో నాగబాబుకి దక్కని అనకాపల్లి టికెట్

మొన్నటి ఎన్నికల్లో అనకాపల్లి నుంచి లోక్‌సభకి పోటీ చేయాలని నాగబాబు భావించినట్టు ప్రచారం జరిగింది. అయితే ఆ సీటు బీజేపీకి కేటాయించడంతో ఆయన పోటీ నుంచి విరమించుకున్నారని చెబుతుంటారు. ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం, జనసేన వందశాతం స్ట్రైక్‌ రైట్‌ సాధించడం, జనసేనాని పవన్‌కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వడంతో నాగబాబుకు కూడా పదవి ఖాయమనే ప్రచారం ఏడెనిమిది నెలలుగా సాగుతోంది. తాజాగా నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ నెలాఖరుకి మండలిలో పాత ఎమ్మెల్సీల పదవీ కాలం ముగుస్తుండటంతో ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

నాగబాబుకి మంత్రి పదవిపై చంద్రబాబు ప్రకటన

గత డిసెంబర్‌ 9వ తేదీన రాజ్యసభకు అభ్యర్ధుల పేర్లను వెల్లడించిన టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సరిగ్గా అదే సమయంలో నాగబాబును ఎమ్మెల్సీగా ఎన్నిక చేయించి రాష్ట్ర క్యాబినెట్‌లోకి తీసుకుంటామని ప్రకటన చేశారు. వాస్తవానికి అప్పటి వరకు నాగబాబును రాజ్యసభకు పంపిస్తారన్న ప్రచారం బలంగా జరిగింది. అయితే చంద్రబాబు ప్రకటనతో జనసేనకు రాజ్యసభ పోస్టు లేదనీ, దాని బదులు నాగబాబు రాష్ట్ర చట్టసభలోకి ప్రవేశిస్తారని స్పష్టమైంది.

మంత్రి అయిన ఆరు నెలలోగా ఎమ్మెల్సీ అయ్యే అవకాశం

చంద్రబాబు ప్రకటనపై పవన్‌ కల్యాణ్, నాగబాబు సహా జనసేన నేతలెవరూ స్పందించకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. చంద్రబాబు తలచుకుంటే మంత్రి చేయడానికి ఈ ఎమ్మెల్సీ తంతు ఏమీ అడ్డం కాదు. మంత్రి అయిన ఆరు నెలలలోగా ఎమ్మెల్సీ కావచ్చు. కానీ అలా చేయలేదు. కేవలం నాగబాబును చేర్చుకోవడం కోసం మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతుందా? అన్న చర్చ నడుస్తోంది. కనీసం ఏడాది నుంచి ఏడాదిన్నర అయితే తప్ప మంత్రివర్గంలో మార్పులు చేర్పులు సాధారణంగా జరగవు. పైగా చంద్రబాబు వర్కింగ్ స్టైల్ వేరు. ఏ నిర్ణయం అంత వేగంగా, అంత సులభంగా తీసుకోరు.

ఆ క్రమంలో నాగబాబును మంత్రిగా చూడడం కష్టమేనా?

ఆ క్రమంలో ఇప్పట్లో నాగబాబును మంత్రిగా చూడడం కష్టం కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడంతో టీడీపీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయి. జనసేనకు అంత ప్రాధాన్యత ఇస్తుండటంపై పిఠాపురం తెలుగు తమ్ముళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే అసంతృప్తి మరింత పెరుగుతుంది. వర్మ, కిమిడి నాగార్జున ఇంకా చాలా మంది అర్హులైన నాయకులు బ్యాక్ బెంచ్లో కూర్చొని వెయిటింగ్లో ఉండగా, నాగబాబుకు వైల్డ్ ఎంట్రీ కార్డ్ ఇస్తే ఇబ్బందని చంద్రబాబు సంశయిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. వెయిటింగ్‌లిస్ట్‌లో ఉన్న టీడీపీ నేతలకు న్యాయం జరిగాకే నాగబాబుకి అమాత్య పదవి దక్కుతుందన్న టాక్ వినిపిస్తోంది.

పిఠాపురం సభలో టీడీపీని డ్యామేజ్ చేసేలా వ్యాఖ్యలు

ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీ కాబట్టి. మంత్రి పదవి ఇవ్వాలంటే క్షణంలో ఇవ్వవచ్చు. కానీ ఈ లోగా పిఠాపురం సభలో చాలా డ్యామేజ్ చేసుకున్నారు. పవన్ కామెంట్లు కూడా టీడీపీని కొంత డ్యామేజ్ చేసేవి ఉన్నాయని తమ్ముళ్లు మండిపడుతున్నారు. ఈ డ్యామేజ్ ఎఫెక్ట్‌తో నాగబాబుకి ఇప్పట్లో మంత్రి పదవి అన్నది ఉండదనే వాదన గట్టిగా వినిపిస్తోంది. మరి చూడాలి నాగబాబు మంత్రి హోదాలో శాసనసభలో అడుగుపెట్టి.. అధ్యక్షా అని ఎప్పటికి అంటారో

Related News

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

Big Stories

×