Rashmika Mandanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరు తెలియని వాళ్లు ఉండరు. పుష్ప మూవీతో నేషనల్ క్రష్ అయ్యింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుసగా చేతి నిండా ఆఫర్స్ దూసుకుపోతుంది. గత ఏడాది పుష్ప 2 మూవీతో ప్రేక్షకులను పలకరించిన ఈమె ఆ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి. గతంలో రణబీర్ కపూర్ సరసన యానిమల్ మూవీలో నటించింది.. ఆ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో రీసేంట్ గా ఛావా మూవీలో నటించి మరో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈమె క్రష్ గురించి మరో పేరు సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అందులో నిజమేంత ఉందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
రష్మిక మందన్న సినిమాలు..
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా రష్మిక మందన్న వరస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుంది. రష్మిక త్వరలో ‘సికందర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ప్రతి అప్డేట్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. హై ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య ఈ మూవీ ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా ప్రమోషన్స్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హీరో హీరోయిన్లు చాలా కష్టపడుతున్నారు.. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో ఈనెల 30న చూడాల్సిందే..
Also Read : బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో నటుడు ఆలీ భార్య పేరు..?
కెమెరా మెన్ పై రష్మిక ప్రశంసలు..
రష్మిక మందన్న నిజానికి ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ట్రిప్పులకు వెళ్తూ బిజీగా ఉంటుంది. తాజాగా ఈమె ఎయిర్పోర్ట్ లో దర్శనమిచ్చింది. అక్కడికి కొంతమంది మీడియా వాళ్లు వెళ్లగా.. అందులో ఓ కెమెరా మ్యాన్ రష్మికకు స్పెషల్‌గా డ్యాన్స్‌తో తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఆ డ్యాన్స్‌కు ఫిదా అయ్యింది రష్మిక మందన్న.. లవ్ సింబల్ పెడుతూ మీరు నా హార్ట్ గెలుచుకున్నారు అని ఆమె అన్నారు. మీ ప్రేమకు నేను పడిపోయాను అని రష్మీక అంటుంది. దాంతో ఆమె అతనికి ఫిదా అయ్యింది అంటూ సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. రష్మిక మందనకు ఇలాంటివి కొత్తవి కాదు గతంలో చాలానే ఇలాంటి వాటిని ఎదుర్కొంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవడంతో ఏంటి రష్మిక విజయ్ దేవరకొండ నన్ను వదిలేసావా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక రష్మిక మందన్న సినిమాల విషయానికొస్తే.. బాలీవుడ్ లో ఈమె నటిస్తున్న సికిందర్ సినిమా ఈ నెలలో రిలీజ్ అవుతుంది. అలాగే తెలుగులో పుష్ప 3 సినిమాలో నటిస్తుంది. వీటితోపాటు తమిళ్లో మరో రెండు ప్రాజెక్టులకు సైన్ చేసిందని సమాచారం..