E-Paper
Advertisement

ధోని పీకిందేమీ లేదు..గంగూలీ వ‌ల్లే టీమిండియాకు 2007, 2011 ట్రోఫీలు

ధోని పీకిందేమీ లేదు..గంగూలీ వ‌ల్లే టీమిండియాకు 2007, 2011 ట్రోఫీలు
Advertisement

Mohammad Kaif On Dhoni-Ganguly:  టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ( Mahendra Singh Dhoni) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 2007 సమయంలో టీమిండియా కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న మహేంద్ర సింగ్ ధోని, టీమిండియాకు ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. 2007 టీ20 ప్రపంచ కప్ గెలిపించిన మహేందర్ సింగ్ ధోని… ఆ తర్వాత మూడు ఫార్మాట్లకు కెప్టెన్ అయిపోయాడు. ఈ క్రమంలోనే 2011 వన్డే వరల్డ్ కప్ తో పాటు 2013 ఛాంపియన్స్ ట్రోఫీ కూడా టీమిండియా కు అందించాడు. చాలా సార్లు నెంబర్ వన్ జట్టుగా కూడా టీమ్ ఇండియాను నిలిపాడు.

ధోని పీకిందేమీ లేదు.. గంగూలీ వ‌ల్లే టీమిండియాకు ట్రోఫీలు

మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన మహేంద్రసింగ్ ధోని గురించి తాజాగా మహమ్మద్ కైఫ్ ( Mohammad Kaif) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చెట్లు పెంచింది సౌర‌వ్ గంగూలీ ( Sourav Ganguly) అయితే.. ఆ ఫలాలు మహేంద్ర సింగ్ ధోనీకి దక్కాయని బాంబు పేల్చారు. అప్పటి కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ కారణంగా చాలా మంది కుర్ర క్రికెటర్లు టీమిండియాలోకి వచ్చారని గుర్తు చేశారు. అతని కెప్టెన్సీలో వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ హర్భజన్ సింగ్ జహీర్ ఖాన్ లాంటివాళ్ళు టీమిండియాలో ఎదిగారని వివరించారు.

Advertisement

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

బీసీసీఐని ఎదురించి మరీ, ఈ కుర్ర క్రికెటర్లకు అప్పట్లో అవకాశాలు సౌర‌వ్ గంగూలీ ఇప్పించాడని గుర్తు చేశారు మహమ్మద్ కైఫ్ ( Mohammad Kaif). అయితే ఈ క్రికెటర్లే ధోని కెప్టెన్సీలో కూడా ఆడినట్లు చెప్పుకొచ్చారు. 2007, 2011 వరల్డ్ కప్లలో కూడా ఇదే క్రికెటర్లు ఆడి… ధోని సారథ్యంలోని టీమిండియా గెలవడానికి కృషి చేశారన్నారు. అంతేకానీ ధోని పీకిందేమీ లేదని పరువు తీశారు. సౌర‌వ్ గంగూలీ కెప్టెన్సీలో వచ్చిన కుర్ర క్రికెటర్లు ధోని కెప్టెన్సీలో సీనియర్లుగా మారి జట్టును గెలిపించాలని వివరించారు. సౌర‌వ్ గంగూలీ సిద్ధం చేసిన క్రికెట‌ర్ల‌ను బాగా వాడుకున్నాడు కాబ‌ట్టే, ధోని గొప్ప కెప్టెన్ గా ఎదిగార‌ని వివ‌రించారు మహమ్మద్ కైఫ్ ( Mohammad Kaif).

ధోని టీమిండియాలోకి రావడం వెనుక కూడా గంగూలీ హస్తం?

Advertisement

మహమ్మద్ కైఫ్ చెప్పినట్లుగానే సౌర‌వ్ గంగూలీ అందించిన క్రికెటర్లు ధోని కెప్టెన్సీ లో ఆడి ఎన్నో ట్రోఫీలు అందించారు. అయితే మహేంద్ర సింగ్ ధోని కూడా టీమిండియాలోకి రావడం వెనుక గంగూలీ ఉన్నాడని ఇప్పటికీ చాలా మంది చెబుతూ ఉంటారు. జార్ఖండ్ నుంచి ఇప్పటివరకు ఏ ఒక్క క్రికెటర్ ఇంత స్థాయిలో ఎదగలేదు. కింది స్థాయిలోనే తొక్కేశారు. కానీ గంగూలీ మాత్రం… ధోనిని టీమిండియాలోకి తీసుకోవాలని బీసీసీఐకి సూచనలు చేశారట. ఈ క్రమంలోనే టీమ్ ఇండియాలోకి వచ్చిన ధోని.. తన సత్తా చాటాడు. ఇప్పుడు ఉన్నత స్థాయికి ఎదిగాడు.

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

 

Related News

ఇంగ్లాండ్ గ‌డ్డ‌పై టీమిండియానే గెలువ‌లేదు..పాకిస్తాన్ ఎలా గెలుస్తుంది

వివాదంలో రాజీవ్ శుక్లా…న‌ఖ్వీ ప‌క్క‌నే కూర్చోని ఇక ఇకలు, పక పకలు

‘నో-బాల్’ ఇచ్చాన‌ని పాకిస్తాన్ ప్లేయ‌ర్లు అవ‌మానించారు..అంపైర్ సంచ‌ల‌నం!

అదృష్టం కొద్ది తొలి టెస్ట్ లో బంగ్లా గెలిచింది..అంతే త‌ప్ప వాళ్లు పీకిందేమీ లేదు

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పిచ్ ల‌లో చిప్స్..టీమిండియా కోసం జై షా కుట్ర‌లు !

కెప్టెన్ కూల్ కాదు…నరరూప రాక్షసుడు, ధోనిపై చాహ‌ల్ సంచ‌ల‌నం !

నా జోలికి వ‌స్తే, ప‌ళ్లు రాల‌గొడ‌తా…హర్ష భోగ్లేకు జైస్వాల్ వార్నింగ్ !

Big Stories

Advertisement
×