ఉమ్మడి అనంతపురం జిల్లాలో సింగనమల నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. ఇక్కడ ఎవరు గెలిస్తే ఆ పార్టీని పైన అధికారంలోకి వస్తుందని సెంటిమెంట్ ఉండేది. గత 30 ఏళ్లుగా అదే సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతూ వస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉండగా శైలజనాథ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత టిడిపి నుంచి శమంతకమణి, ఆమె కుమార్తె యామిని బాల మంత్రులుగా , ఎంఎల్ఏ లుగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2019 లో వైసీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా గెలిచారు. 2
టిడిపి నుంచి అప్పటికే ఒకసారి ఓడిపోయిన బండారు శ్రావణి 2024 ఎన్నికల్లో మంచి మెజార్టీతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నికల ముందు వరకు ఆమెకు అన్ని కలిసి వచ్చాయి. 2019 ఎన్నికల్లో ఓడిపోవడం ఆ తర్వాత నారా లోకేష్ సమక్షంలో ఇచ్చిన హామీ మేరకు కీలక నాయకులు అంతా కలిసి పని చేయడం ఆమెకు ప్లస్ అయ్యాయి. అయితే నియోజకవర్గాన్ని పట్టించుకోవడం మానేసిన శ్రావణి వివాదాల్లో మాత్రం ముందుంటున్నారు. గెలిచినప్పటి నుంచి పట్టుమని నెల రోజులు కూడా నియోజకవర్గంలో లేరని హైదదాబాద్‌కు పరిమితం అయ్యారని సింగనమల టీడీపీ వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి.
ఆమె నియోజకవర్గానికి దూరమవ్వడంతో పెత్తనమంతా బండార శ్రావణి కుటుంబ సభ్యులు చేస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇక టూ మెన్ కమిటీతో విభేదాలు కూడా ఆమెకు నెగిటివ్‌గా మారుతున్నాయి. రేషన్ షాపుల కేటాయింపు, ఫీల్డ్ అసిస్టెంట్, యానిమేటర్లు పదవుల కోసం టూ మెన్ కమిటీ వర్సెస్ శ్రావణి గా రచ్చ సాగుతుందట. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తున్నా ఇంకా ఇప్పటివరకు కూడా ఆ పోస్టులనియామకం జరగలేదని టాక్ వినిపిస్తోంది. ఆ క్రమంలో ఇటీవల జరిగిన సమన్వయ కమిటీ సమావేశానికి ఎమ్మెల్యే శ్రావణి కాకుండా కాకుండా ఆమె తల్లి లీలావతి హాజరవ్వడం పెద్ద దుమారం రేపింది.
Also Read: బిఆర్ నాయుడు కండిషన్.. రోజా సైలెంట్
నియోజకవర్గాన్ని పూర్తిగా గాలికి వదిలేసిన ఎమ్మెల్యే హైదరాబాద్‌లో ఉంటుండటం తీవ్ర విమర్శల పాలవుతుంది. ఎవరైనా మొదటిసారి ఎమ్మెల్యే అయితే నియోజకవర్గం లో ఉండి పూర్తిగా పట్టు సాధించుకోవాలని చూస్తారు. కానీ శ్రావణి మాత్రం నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వస్తుందని ఇక్కడ క్షేత్రస్థాయిలోని పదవులు పంపకాన్ని కూడా పట్టించుకోకపోవడంపై టిడిపి కార్యకర్తలు అసహనంతో ఉన్నారు. ఎమ్మెల్యే మాత్రం తనకు ఆరోగ్యం బాలేక పోవడం వల్ల హైదరాబాదులో ఉండవలసి వస్తుందని ఇన్ఫెక్షన్ ఎక్కువైన కారణంగా నగరంలో రెస్ట్ తీసుకుంటున్నానని సన్నిహితులతో చెప్పిస్తున్నారు.
ఇక ఇటీవల జరిగిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో సింగనమల ఎమ్మెల్యే, ఆమె కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్న తీరు పైనే ఎక్కువ ఫిర్యాదులు అందాయట. 30ఏలుగా పార్టీకి కష్టపడి పని చేస్తే ఇప్పుడు కనీసం మమ్మల్ని పట్టించుకోవడం లేదని నియోజకవర్గంలోని కీలక నేతలంతా ఇన్చార్జి మినిస్టర్ టీజీ భరత్ కు , జిల్లా మంత్రి పయ్యావుల కేశవ్ కు కంప్లయింట్ చేశారట. ముఖ్యంగా టూ మెన్ కమిటీ సభ్యులైన మంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరాసనాయుడు ఎమ్మెల్యే బండారు శ్రావణి తీరుపై మండిపడ్డారట.
శ్రావణిపై అధిష్టానానికి సైతం ఫిర్యాదు చేయడానికి స్థానిక నేతలు సిద్దమవుతున్నారు. 2019 లో ఓడిపోయిన తర్వాత శ్రావణి పార్టీ సభ్యత్వాల గురించి కూడా పట్టించుకోలేదని. అలాంటి సమయంలో తాము సొంత డబ్బులతో సభ్యత్వాలు చేయించామని స్థానిక నేతలు సమన్వయ కమిటీ సమావేశంలో వాపోయారు… తీరా ఇప్పుడు కనీసం తమకు గౌరవం దక్కడం లేదని ఇదంత బండారు శ్రావణి కావాలని చేయిస్తున్నారని వారు విమర్శలు చేశారట. కనీసం కష్టపడ్డ వారికి క్షేత్రస్థాయిలో డీలర్, ఫీల్డ్ అసిస్టెంట్ లాంటి పదవులు కూడా ఇప్పించుకోలేకపోతున్నామని వాటి విషయంలో కూడా ఎమ్మెల్యే తన సొంత మనుషులకే ప్రాధాన్యత ఇస్తున్నారని వాపోయారంట.
ఇటీవల ఎమ్మెల్యే బండారు శ్రావణి పీఏసీ ఎన్నికల్లో సైతం ఓటు వేయకుండా ఎక్కడికో వెళ్లి అధిష్టానానికి కోపం తెప్పించారట. అంతేకాదు శాసనసభ చివరి రోజు టిడిపి మహిళా ఎమ్మెల్యేలంతా కలిసి గ్రూప్ ఫోటో దిగితే అందులో శ్రావణి కనిపించలేదు. మరలాంటావిడకు రాజకీయాలు ఎందుకని టీడీపీ కేడర్ మండి పడుతుంది.