Congress Nominated: అధికార కాంగ్రెస్ నామినేటెడ్ పదవుల భర్తీపై ఫోకస్ పెట్టింది. ఢిల్లీ పర్యటనలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. హైమాండ్ తో చర్చించి లిస్ట్ ఫైనల్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యి తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే, కొత్తవారికి అవకాశం ఇస్తారా? పాతవారినే రెన్యూవల్ చేస్తారా? అనే ఉత్కంఠ క్యాడర్‌లో కనిపిస్తోంది.
అధిష్టానం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహించినట్టు చర్చ నడుస్తోంది. ప్రజలను పార్టీకి కనెక్ట్ చేసేలా సేవలందించిన వారికి రెన్యూవల్ చేయడానికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. మిగిలిన పదవుల కోసం కొత్తవారిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. సర్ ప్రక్రియలో ఎవరు యాక్టివ్ రోల్ ప్లే చేశారనేది కూడా కీలకంగా చూశారని గాంధీ భవన్ సమాచారం. కొత్త, పాత కలిపి 50 మందిని కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించే అవకాశం ఉంది. వారితో పాటు డైరెక్టర్లను కూడా ఎంపిక చేయనున్నారు.
సీఎం, పీసీసీ చీఫ్ భేటీ అయ్యి లిస్ట్ ఫైనల్ చేసి జీవోలను రిలీజ్ చేస్తారు. కొత్తగా పదవులు పొందేవారిని గ్రౌండ్‌లోకి దించాలని భావిస్తోంది పార్టీ. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు.. ప్రతిపక్షాల విమర్శలను కూడా తిప్పికొట్టే బాధ్యత వారికే అప్పగించనుంది. మొత్తానికి దసరా కంటే ముందే కాంగ్రెస్‌లో పదవుల జాతర మొదలు కానుంది.
Also read: విశ్రాంతి కోసం స్పాకు వెళ్లిన నలుగురు ఫ్రెండ్స్… కట్ చేస్తే ఫుల్ కామెడీ