E-Paper
Advertisement

విశ్రాంతి కోసం స్పాకు వెళ్లిన నలుగురు ఫ్రెండ్స్… కట్ చేస్తే ఫుల్ కామెడీ

విశ్రాంతి కోసం స్పాకు వెళ్లిన నలుగురు ఫ్రెండ్స్… కట్ చేస్తే ఫుల్ కామెడీ
Advertisement

Comedy movie: కామెడీ జానర్ కి ఫ్యాన్స్ ఎక్కువే. అయితే కొన్ని సినిమాలు తెగ నవ్వించేస్తాయి. అలాంటి సినిమాలలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా ఒకటి. కథలో రోజువారీ పనులు, కుటుంబ బాధ్యతలతో బిజీగా ఉండే నలుగురు స్నేహితులు కాస్త రిలాక్స్ అవుదామని లగ్జరీ స్పాకు వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తారు. అక్కడ ప్రశాంతంగా టైమ్ స్పెండ్ చేసి ఫ్రెష్‌గా తిరిగి రావాలనుకుంటారు. కానీ వాళ్లతో పాటు ఓ ఫ్రెండ్ రావడంతో మొత్తం ప్లాన్ తలకిందులవుతుంది. రిలాక్సింగ్ వీకెండ్ కాస్తా నవ్వులు, గొడవలు, ఊహించని గందరగోళంతో ఫుల్ రచ్చగా మారుతుంది. ఈ కాన్సెప్ట్‌తో వచ్చిన కామెడీ మూవీ ‘Spa Weekend’. ‘The Hangover’, ‘Bad Moms’ ఫేమ్ జోన్ లూకస్, స్కాట్ మూర్ కలిసి ఈ సినిమాను తెరకెక్కించారు. లెస్లీ మాన్, ఇస్లా ఫిషర్, మిషెల్ బుటో, అన్నా ఫారిస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సెప్టెంబర్ 22 నుంచి డిజిటల్‌లోకి వచ్చింది. మరి ఈ నలుగురు ఫ్రెండ్స్ అసలు ఎందుకు స్పాకు వెళ్లారు? వాళ్ల వీకెండ్‌ను గందరగోళంగా మార్చిన ఆ ఫ్రెండ్ ఎవరు? చివరికి ఈ ట్రిప్ ఎలాంటి పరిస్థితులకు దారితీసింది? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

జేన్, కోకో, సోఫీ ముగ్గురూ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కెరీర్, రిలేషన్‌షిప్స్, కుటుంబ బాధ్యతల మధ్య తమ కోసం సమయం కేటాయించలేకపోతున్నామని భావించి ఓ లగ్జరీ స్పాలో వీకెండ్ గడపాలని నిర్ణయించుకుంటారు. ఈ ట్రిప్ ద్వారా కాస్త రిలాక్స్ అవ్వడంతో పాటు పాత రోజులను గుర్తు చేసుకోవాలని అనుకుంటారు. కానీ వీరి ప్లాన్‌కు మెల్ ఎంట్రీతో అసలు కథ మొదలవుతుంది. మెల్ వచ్చిన తర్వాత ప్రశాంతంగా సాగాల్సిన వీకెండ్ కాస్తా ఊహించని సంఘటనలతో గందరగోళంగా మారుతుంది. స్పాలో రిలాక్సేషన్ కంటే నవ్వులు, గొడవలు, ఇబ్బందులు ఎక్కువైపోతాయి. ఓ నిర్ణయం తర్వాత మరో నిర్ణయం తీసుకుంటూ వెళ్లే కొద్దీ పరిస్థితులు మరింత విచిత్రంగా మారతాయి. స్నేహితుల మధ్య ఉన్న పాత బంధాలు, వ్యక్తిగత సమస్యలు కూడా బయటకు రావడంతో ఈ వీకెండ్ వాళ్ల జీవితాల్లో మర్చిపోలేని మలుపులు తిరుగతాయి. క్లైమాక్స్ వరకు గజిబిజి గందరగోళంగా సాగే ఈ మూవీని కామెడీ జానర్ ఆడియన్స్ ఏంచెక్కా ఎంజాయ్ చెయ్యచ్చు.

తెలుగులో అందుబాటులో ఉందా?

Advertisement

జోన్ లూకస్, స్కాట్ మూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లెస్లీ మాన్, ఇస్లా ఫిషర్, మిషెల్ బుటో, అన్నా ఫారిస్, ఆడమ్ డెమోస్ తదితరులు నటించారు. సినిమా నిడివి 1 గంట 37 నిమిషాల ఈ మూవీ Prime Videoలో సెప్టెంబర్ 22 నుంచి రెంట్‌కు అందుబాటులో ఉంది.  ఫ్రెండ్స్‌తో కలిసి చేసే ట్రిప్‌లో వచ్చే కామెడీ, గందరగోళం, ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ ఇష్టపడేవారికి ‘Spa Weekend’ ఓ లైట్‌హార్టెడ్ కామెడీ రైడ్.

Read Also: అటకలో పాటలు పాడే మొసలి… ఓటీటీలో సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

Related News

మాజీ నేవీ సీల్‌కు మళ్లీ డేంజరస్ మిషన్… న్యూక్లియర్ కోడ్స్ కోసం ప్రాణాలకు తెగించి పోరాటం… హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్

కొండల్లోని అద్భుతమైన మాయా చెట్టు… కలల ప్రపంచంలోకి తీసుకెళ్లే విజువల్ ఫ్యాంటసీ అడ్వెంచర్

నగరాన్ని కాపాడిన సూపర్‌ హీరోనే నిందితుడు… మూడేళ్ల తర్వాత సరదా తీర్చేసిన యాక్షన్ థ్రిల్లర్

రిహాబ్‌కు తీసుకెళ్లాల్సిన కుర్రాడితో చిక్కుల్లో… ఇద్దరు డ్రైవర్ల జర్నీ ఫుల్ రచ్చ… కామెడీ ఎంటర్‌టైనర్

సేఫ్‌ లు ఇలా కూడా తెరుస్తారా ? పియానో ట్యూనర్‌ టాలెంట్ కు పిచ్చెక్కాల్సిందే… మైండ్ బ్లాకింగ్ థ్రిల్లర్

200 ఏళ్ల వెనక్కి వెళ్లే ప్రేమికులు… అడుగడుగునా డేంజరస్ ట్విస్టులు… టైమ్-ట్రావెల్ విజువల్ వండర్

చీకట్లో విరుచుకుపడ్డ వింత రాక్షసులు… 500 ఏళ్ల నాటి నిజం బట్టబయలు… అర్ధరాత్రి ఆ అడవిలో ఏం జరిగింది ?

Big Stories

Advertisement
×