Chiranjeevi -Pawan Kalyan: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ఒకరు. సినిమా కుటుంబ నేపథ్యం లేకపోయినా నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చి తన టాలెంట్ తో అవకాశాలను అందుకుంటూ అగ్ర హీరోగా కొనసాగారు. ఇలా చిరంజీవి స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చి 48 సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే 48 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు చిరంజీవి “ప్రాణం ఖరీదు “అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకొంటూ మెగాస్టార్ చిరంజీవి నేడు ఉదయం పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ పోస్ట్ పై పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి చిరంజీవికి అభినందనలు తెలియజేస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి చిరంజీవికి అభినందనలు తెలియజేస్తూ.. ప్రాణం ఖరీదు సినిమాతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఒక దిగువ మధ్యతరగతి యువకుడిగా ఒక కలతో మొదలుపెట్టి, భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఐకాన్‌గా, మ్యాటినీ ఐడల్‌గా ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి గారి ప్రయాణానికి ఆయన ఆత్మవిశ్వాసం స్వయంకృషి కఠోర శ్రమకు నిజమైన ఉదాహరణగా నిలుస్తుంది.
చిరంజీవి ఇండస్ట్రీలో తన సొంత మార్గాన్ని సృష్టించుకుని ఈ ప్రయత్నాలలో ఉన్నత స్థాయికి ఎదిగి ఆ మార్గం లక్షలాది మందికి స్ఫూర్తిదాయకమైన ప్రయాణంగా మారిపోయింది. 150కి పైగా చిత్రాలు, పద్మవిభూషణ్, అత్యంత ప్రతిభావంతుడైన నటుడు-నృత్యకారుడిగా గిన్నిస్ ప్రపంచ రికార్డు, నంది అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వంటి ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలతో సత్కరించబడింది.తెర మీద నటుడిగా మాత్రమే కాకుండా తెర వెనుక, చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్, బ్లడ్ బ్యాంక్ వంటి సామాజిక సేవ కార్యక్రమాలు కూడా ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచాయి.జీవితంలో ఏదైనా సాధించాలని కలలు కనే ప్రతి ఒక్కరికీ, ఆత్మవిశ్వాసం, కృషి, పట్టుదలతో ఏమి సాధించవచ్చో చెప్పడానికి చిరంజీవి గారు ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తారు.
From a lower middle-class young man with a dream, who began his journey with Pranam Khareedu, to one of Indian cinema’s most celebrated icons and matinee idol , Megastar @KChiruTweets Garu’s journey stands as a true example of self-belief, hard work, and being self-made, a… https://t.co/KewQ128tkb pic.twitter.com/W1Ftxw131X
— Pawan Kalyan Creative Works (@PKCWoffl) September 22, 2026
మా మెగాస్టార్ గారు సినిమా రంగంలో మరెన్నో సంవత్సరాలు రాణించాలని, మంచి ఆరోగ్యం, ఆనందం, మరియు దీర్ఘమైన, సంతృప్తికరమైన జీవితం లభించాలని ఆకాంక్షిస్తున్నాము అంటూ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి చిరంజీవి తన 48 సంవత్సరాల కెరియర్ ను పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ఇక నేడు మెగాస్టార్ చిరంజీవి కాకా సినిమా ఈవెంట్ లో కూడా 48 సంవత్సరాల ఇండస్ట్రీ సెలబ్రేషన్స్ ఎంతో ఘనంగా నిర్వహించారు.
Also Read: బిగ్ బాస్ 10 పై నటుడు ప్రభాకర్ కామెంట్స్..ఆ కంటెస్టెంట్ కు ఫుల్ సపోర్ట్!