Comedy Movie: సీరియస్‌నెస్ లేని ఒక అవుట్ అండ్ అవుట్ అడల్ట్ కామెడీ, పోలీస్ సటైర్ సినిమా Super Troopers 3. బాధ్యతాయుతంగా ఉండాల్సిన పోలీస్ అధికారులు ఎంత గందరగోళంగా, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ డ్యూటీలు చేస్తారనే కోణాన్ని, డబుల్ మీనింగ్ డైలాగులు, క్రూడ్ హ్యూమర్‌తో ఇందులో చూపించారు. ఎటువంటి ముందస్తు అంచనాలు లేకుండా, కేవలం కాసేపు నవ్వుకోవడానికి మాత్రమే సరిపోయే ఒక టైమ్‌పాస్ స్టోనర్ కామెడీ చిత్రమిది. ఆగస్టు 7న థియేటర్లలో విడుదలైన ఈ మూడో భాగం సెప్టెంబర్ 22 నుంచి డిజిటల్ రెంట్‌లోకి వచ్చింది.
ఫర్వా, థోర్నీ సోదరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడటంతో కథలో అసలు రచ్చ మొదలవుతుంది. ఫర్వా వ్యవహారశైలితో ఇప్పటికే విసిగిపోయిన థోర్నీ ఈ పెళ్లిని ఆపడానికి తనదైన ప్లాన్‌లు వేస్తుంటాడు. పెళ్లి సాఫీగా జరగాల్సింది పోయి పోలీస్ టీమ్‌లోనే గొడవలు, తిక్క పనులు మొదలవుతాయి. ఇదే సమయంలో వెర్మాంట్ హైవే పెట్రోల్ టీమ్‌కు కొత్త డ్రగ్ రింగ్ గురించి సమాచారం వస్తుంది. పెళ్లి వ్యవహారాన్ని పక్కనపెట్టి ఈ కేసును ఛేదించాల్సిన పరిస్థితి రావడంతో ట్రూపర్స్ రంగంలోకి దిగుతారు. అయితే వీళ్లు కేసును సీరియస్‌గా దర్యాప్తు చేయడం కంటే చేసే ప్రతి పనిలోనూ తమదైన కామెడీని చూపిస్తారు. ఒకవైపు డ్రగ్ రింగ్ వెనుక ఉన్నవాళ్లను పట్టుకోవాలి, మరోవైపు ఫర్వా పెళ్లిని అడ్డుకోవాలనుకునే థోర్నీ ప్లాన్‌లు అమలు చేయాలి. దీంతో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కాస్తా పెళ్లి రచ్చతో కలిసిపోయి ఫుల్ గందరగోళంగా మారుతుంది.
ఎక్కడ చూడచ్చు అంటే ?
జే చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జే చంద్రశేఖర్, కెవిన్ హెఫెర్నన్, స్టీవ్ లెమ్మీ, పాల్ సోటర్, ఎరిక్ స్టోల్‌హాన్స్కీ, బ్రియాన్ కాక్స్, మారిసా కాఫ్లాన్, నాట్ ఫాక్సన్, చేజ్ క్రాఫర్డ్, హన్నా సిమోన్ తదితరులు నటించారు. సినిమా నిడివి 1 గంట 44 నిమిషాల ఈ మూవీ Prime Video లో రెంట్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంది. పోలీస్ కామెడీ, పిచ్చి క్యారెక్టర్లు, డ్రగ్ కేసు, ఫుల్ సిల్లీ ఎంటర్‌టైన్మెంట్ ఇష్టపడేవారికి ‘Super Troopers 3’ ఓ సరదా వీకెండ్ వాచ్.
Read Also: వైరస్ తో దేశాన్నే తుడిచిపెట్టే డేంజరస్ ప్లాన్… హై వోల్టేజ్ మైండ్ బ్లోయింగ్ మిషన్