Telangana Congress: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తోంది. సాధారణంగా మూడేళ్ల పాలనపై విపక్షాలన్నీ అధికార పార్టీని టార్గెట్ చేసి మరీ విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తాయ్. కానీ, తెలంగాణలో మాత్రం.. అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి ఇంకా రాజకీయంగా కలిసొస్తూనే ఉందనే చర్చ జరుగుతోంది. ప్రతిపక్షాలు చేస్తున్న చిన్న పొరపాటును కూడా వదలకుండా.. అడ్వాంటేజ్ తీసుకుంటోంది. అన్ని అంశాలను, పరిణామాలను తమకు అనుకూలంగా మలచుకొని.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌ని డిఫెన్స్‌లో పడేస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
వర్షాకాల అసెంబ్లీ సమావేశాల తొలిరోజే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై.. అధికారపక్షం బీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. సభ కూడా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. ప్రతిపక్ష గులాబీ పార్టీ సభ్యులు సభలో వ్యవహరించిన తీరుతో.. అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు. అంతేకాదు, బీఆర్ఎస్ అగ్రనేతల ఆస్తుల చిట్టాను ప్రజలకు తెలియజేయడంలోనూ సక్సెస్ అయ్యారనే చర్చ ఉంది. పదేళ్లలో బీఆర్ఎస్ నేతలు సంపాదించుకున్న ఆస్తులు, ఫామ్ హౌస్ వ్యవహారాలను ప్రజల దృష్టికి తీసుకుపోవడంలో.. కాంగ్రెస్ షెడ్యూల్ వేసుకొని మరీ ఒక్కొక్కటి బయటపెడుతూ వస్తోంది. అంతేకాదు, ఎంపీలు, ఎమ్మెల్సీలు.. ఫామ్ హౌజ్‌లు సందర్శించడం, ఇన్ని ఎకరాల భూములు ఎలా వచ్చాయని ప్రశ్నించడం చేశారు. 2014 కంటే ముందు ఉన్న ఆస్తులు, ఇప్పుడు ఉన్న ఆస్తుల వివరాలు బయటపెట్టారు. ఇవన్నీ.. ఇంతలా ఎలా పెరిగాయని, ఫామ్‌హౌస్‌లు ఎలా సంపాదించగలిగారని పదే పదే ఎత్తి చూపి.. జనంలో చర్చ జరిగేలా చేశారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడి కూడా పెద్ద చర్చకే దారితీసింది. గులాబీ పార్టీ నేతలు పసుపు నీళ్లతో శుద్ధి చేయడంపైనా కాంగ్రెస్ సీరియస్ అయింది. బీఆర్ఎస్ దళిత వ్యతిరేకి అని ముద్ర వేసింది.
Also read: ‘ఏందయ్యా సామి’ తర్వాత ‘కోబలి’.. ఈసారి రచ్చ మామూలుగా లేదుగా !
ఇప్పుడు దేశవ్యాప్తంగా సర్ ఇష్యూపై రాజకీయ రగడ నడుస్తోంది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు విపక్షాలు పట్టుబడుతున్నాయ్. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ తమ గళం వినిపిస్తున్నాయ్. ఈ అంశంలో బీఆర్ఎస్ ఏమాత్రం మాట్లాడటం లేదని కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటేనని, అందుకే మౌనంగా ఉన్నారని ఆరోపిస్తున్నారు. సర్ విషయంలో మాట్లాడితే కాళేశ్వరం, ఫార్ములా-ఈ కార్ రేస్ కేసుల్లో జైలుకు పంపుతారనే భయంతోనే సైలెంట్‌గా ఉన్నారనే విమర్శలు చేస్తున్నారు. ఆ రెండు పార్టీలకు లోపాయికారి ఒప్పందం ఉందని వాదిస్తున్నారు. ఇలా వర్షాకాల సమావేశాల నుంచి బీఆర్ఎస్ ఏం చేసినా, ఎలాంటి కార్యక్రమం తలపెట్టినా.. కాంగ్రెస్ తిప్పికొడుతూనే ఉంది. ఆ పార్టీని డిఫెన్స్‌లో పడేస్తోంది. అధికార పార్టీ దూకుడు ఇకపైనా ఇలాగే కొనసాగుతుందా? లేదా? అనేది చూడాలి.
Also read: ఉదయం పూట మీ కీళ్లు బిగుసుకుపోతున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్..?