E-Paper
Advertisement

ఉదయం పూట మీ కీళ్లు బిగుసుకుపోతున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్..?

ఉదయం పూట మీ కీళ్లు బిగుసుకుపోతున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్..?
Advertisement

World Arthritis: కదలికల్లో ఇబ్బందులు.. ఇవి చాలామందిని వేధించే ఆరోగ్య సమస్యలు. జీవనశైలిలో మార్పులు, పెరుగుతున్న ఆరోగ్య సమస్యల దృష్ట్యా కీళ్ల ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండటం ఇప్పుడు మరింత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఇయర్ అక్టోబర్ 12న వరల్డ్ ఆర్థరైటిస్ డేగా నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడం.. వ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తించేలా ప్రోత్సహించడం సరైన సమయంలో వైద్య సహాయం పొందేలా చైతన్యపరచడం ఇవాళ్టి ప్రధాన ఉద్దేశం.

మోకాళ్లలో నొప్పి..

కీళ్లను ప్రభావితం చేసే వ్యాధుల సమూహాన్ని ఆర్థరైటిస్‌గా పిలుస్తారు. కీళ్లలో నొప్పి, వాపు, బిగుతు, కదలికల్లో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొన్ని రకాల ఆర్థరైటిస్ వయసు పైబడిన వారిలో ఎక్కువగా కనిపించినప్పటికీ మరికొన్ని రకాలు చిన్న వయసులోనూ రావచ్చు. అందుకే కీళ్ల నొప్పులను కేవలం వయసుతో ముడిపెట్టి చూడటం సరికాదు. ఉదయం నిద్రలేచినప్పుడు కీళ్లు బిగుసుకుపోవడం నడిచేటప్పుడు మోకాళ్లలో నొప్పి రావడం చేతి వేళ్ల కదలికల్లో ఇబ్బంది ఎదురవడం కీళ్ల చుట్టూ వాపు కనిపించడం వంటి లక్షణాలు నిరంతరంగా ఉంటే అప్రమత్తం కావాలి. అయితే ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన ఆర్థరైటిస్ అని నిర్ధారించలేం. సరైన వైద్య పరీక్షలతోనే అసలు సమస్యను గుర్తించాలి.

నిర్లక్ష్యం చేయొద్దు..

Advertisement

శారీరక చురుకుదనాన్ని కొనసాగించడం.. వైద్యుల సూచనల మేరకు తగిన వ్యాయామాలు చేయడం శరీర బరువును అదుపులో ఉంచుకోవడం.. సమతుల్య ఆహారం తీసుకోవడం వంటి అలవాట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు సొంత వైద్యం చేసుకోవడం, నచ్చిన పెయిన్‌కిల్లర్స్ వాడటం ప్రమాదకరం కావచ్చు. సమస్యను గుర్తించి, తగిన చికిత్స తీసుకోవడమే సరైన మార్గం. నొప్పిని లైట్ తీసుకోవద్దు.. లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు.. ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడంలో వెనుకడుగు వేయొద్దు. ఎందుకంటే.. కీళ్లు ఆరోగ్యంగా ఉంటేనే కదలికలు సాఫీగా ఉంటాయి. కదలికలు బాగుంటేనే జీవితం మరింత యాక్టివ్‌గా సాగుతుంది. అక్టోబర్ 12 వరల్డ్ ఆర్థరైటిస్ డే పురస్కరించుకుని ఇక మీదట అవగాహన పెంచుకుందాం.. కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.

Also read: రీస్టార్ట్ చేస్తే ఫోన్ స్పీడ్ పెరుగుతుందా? ఇది తెలిస్తే మళ్లీ ఆ పని చేయరు!

Tags

Related News

పక్కా తెలంగాణ స్టైల్ సర్వపిండి..ఒక్క సారి టేస్ట్ చేేస్తే అస్సలు వదలరు!

పర్ఫెక్ట్ కొలతలతో గుమగుమలాడే సెమియా కేసరి..క్షణాల్లోనే రెడీ అవుతుంది

పర్ఫెక్ట్ కొలతలతో..నోరూరించే బ్రెడ్ హల్వా రెసిపీ

పప్పుచారులో నంజుకోవడానికి బాప్‌లాంటి ‘కరివేపాకు రొయ్యల వేపుడు’.. తింటే ఫిదా అయిపోతారు!

రాయలసీమ స్టైల్ నాటుకోడి వెల్లుల్లి కారం.. ఇంట్లోనే ఈజీగా చేసేయండి ఇలా!

బోటీ కూర అంటే ఇష్టముండదా? చింతచిగురుతో ఇలా చేస్తే ప్లేట్లు నాకేస్తారు!

రైస్ వాటర్‌తో మెరిసే జుట్టు, గ్లాస్ స్కిన్ సాధ్యమేనా? సోషల్ మీడియాలో చెప్పేదంతా నిజమేనా?

Big Stories

Advertisement
×