E-Paper
Advertisement

తెలంగాణ బీజేపీ త్రిముఖ వ్యూహం.. 3 జోన్లు.. 3 విభిన్న ప్లాన్లు!

తెలంగాణ బీజేపీ త్రిముఖ వ్యూహం.. 3 జోన్లు.. 3 విభిన్న ప్లాన్లు!
Advertisement

BJP Three-Zone: తెలంగాణ బీజేపీని ఒకే లెక్కతో నడపడం కాకుండా.. రాష్ట్రాన్ని మూడు రాజకీయ జోన్లుగా చూసే వ్యూహానికి పార్టీ నాయకత్వం పదును పెడుతోంది. ఒక్కో ప్రాంతం.. ఒక్కో సమస్య.. అందుకు తగ్గట్టే ఒక్కో వ్యూహం. ZONE-1 వరంగల్ – నల్గొండ – ఖమ్మం, ZONE-2 హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్, ZONE-3 ఆదిలాబాద్ – కరీంనగర్ – నిజామాబాద్ – మెదక్ గా విభజించారు.

ZONE-1

Advertisement

ZONE 1లో లీడర్లు ఉన్నారు.. కేడర్ కావాలి. వరంగల్, నల్గొండ, ఖమ్మం ప్రాంతాల్లో పార్టీకి పలువురు రాజకీయ నాయకులు ఉన్నా.. వారికి అనుగుణంగా బలమైన కేడర్‌ను విస్తరించాల్సిన అవసరం ఉందన్నది బీజేపీ నాయకత్వం లెక్కగా కనిపిస్తోంది. అందుకే ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి. వరంగల్‌ను కేంద్రంగా చేసుకుని పనిచేసే బాధ్యత దశరథ్‌కు రావడం.. ఈ జోన్‌కు సంస్థాగత ప్రాధాన్యత పెరిగినట్టుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దశరథ్‌ను తెలంగాణ జాయింట్ జనరల్ సెక్రటరీగా నియమించి.. వరంగల్‌ను ఆయన కేంద్రంగా పార్టీ నిర్ణయించింది. దశరథ్‌కు సంస్థాగత బాధ్యతలు అప్పగించడం వెనుక.. ఈ ప్రాంతంలో నాయకులను సమన్వయం చేయడం.. కొత్త కేడర్‌ను తయారు చేయడం.. బూత్ స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యాలుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దశరథ్‌.. బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు సన్నిహితుడిగా పార్టీ వర్గాల్లో గుర్తింపు పొందారు. ఇప్పుడు వరంగల్ కేంద్రంగా బాధ్యతలు చేపట్టడంతో.. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం ప్రాంతాల్లో సంస్థాగత వ్యవహారాలపై ఆయన ఫోకస్ పెరగనుంది. అయితే.. ఇక్కడ అసలు టార్గెట్ నాయకులు కాదు.. నాయకులతో పాటు కేడర్‌ను నిర్మించడం.

ZONE-2

Advertisement

ZONE 2లో కేడర్ ఉంది.. లీడర్ కావాలి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో బీజేపీ లెక్క మరోలా ఉంది. ఇక్కడ పార్టీకి కేడర్ బేస్ ఉందని నాయకత్వం భావిస్తోంది. కానీ.. ఆ కేడర్‌ను నడిపించే బలమైన స్థానిక నాయకత్వాన్ని మరింతగా గుర్తించాల్సిన అవసరం ఉందన్నది పార్టీ వ్యూహం. ఇదే సమయంలో ఈ ప్రాంతాల్లో RSS సంస్థాగతంగా బలంగా ఉండటంతో.. బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్‌కు ఈ జోన్ కీలకంగా మారనుంది. మధుకర్‌ను AP, తెలంగాణ రాష్ట్రాలకు సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా నియమించి.. హైదరాబాద్‌ను ఆయన కేంద్రంగా పార్టీ కేటాయించింది. ఈ ప్రాంతంలో.. ఎవరికి ఏ బాధ్యత? ఎక్కడ ఎవరు బలంగా ఉన్నారు? కొత్త నాయకత్వాన్ని ఎక్కడ తయారు చేయాలి? అనే అంశాలపై దృష్టి పెట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంటే.. కేడర్‌ను ఓటు బ్యాంక్‌గా మార్చే ముందు.. కేడర్‌కు రాజకీయ నాయకత్వాన్ని తయారు చేయడమే లక్ష్యం. ఇదే ఈ జోన్‌లో బీజేపీ సంస్థాగత వ్యూహానికి కీలకమైన అంశంగా కనిపిస్తోంది.

ZONE-3

ZONE 3 అయిన ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ప్రాంతాలపై బీజేపీ లెక్క మరోలా ఉంది. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే పార్టీకి బలమైన నాయకులు.. వారితో పాటు కేడర్ బేస్ కూడా ఉందని బీజేపీ అంచనా వేస్తోంది. అందుకే ఇక్కడ కొత్తగా సంస్థాగత నిర్మాణం చేయడం కంటే.. ఇప్పటికే ఉన్న నాయకత్వాన్ని ఉపయోగించుకోవడమే ప్రధాన వ్యూహం. ఈ ప్రాంతాల్లో బీజేపీకి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉండటంతో.. నాయకత్వం.. నియోజకవర్గం.. కేడర్.. బూత్ అనే మోడల్‌లో బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ కొత్తగా లీడర్లను వెతకడం కంటే.. ఉన్న నాయకులనే సంస్థాగతంగా యాక్టివ్ చేయడం బీజేపీ ముందున్న మరో టాస్క్.

బీజేపీ త్రిముఖ వ్యూహం..

ఇదే తెలంగాణలో బీజేపీ త్రిముఖ సంస్థాగత వ్యూహంగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే వ్యూహం ప్రకటించడం ఒక ఎత్తయితే.. దాన్ని గ్రౌండ్‌లో అమలు చేయడం మరో ఎత్తు. ఇప్పటికే అక్టోబర్ 6న జరిగిన రాష్ట్ర కార్యవర్గ స్థాయి చర్చల్లో.. పదవులు తీసుకుని క్షేత్రస్థాయిలో పని చేయకపోవడంపై నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు రిపోర్టులు వచ్చాయి.

 Also Read: ఏపీ పింఛనుదారులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 1 నుంచి మారిపోతున్న రూల్స్ ఇవే!

Tags

Related News

శంషాబాద్‌లో భారీ చోరీ.. ఏటీఎం బద్దలుకొట్టి రూ.32 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు!

దాండియా ఈవెంట్లపై వివాదం.. ఓవైసీకి గట్టి కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే రాజా సింగ్!

అక్టోబర్‌లోగా కరువు నివేదిక సిద్ధం చేయండి.. అధికారులకు సీఎస్ ఆదేశం!

కల్వకుంట్ల శకం ముగిసింది.. 14 ఏళ్ల వనవాసం తప్పదు! BRS నేతలపై సాయికుమార్ ఫైర్

బీజేపీలో మహిళలకు రక్షణ లేదా.. మాజీ బీజేవైఎం జాతీయ కోశాధికారిపై కేసు నమోదు!

రేవంత్, కేసీఆర్ ఆస్తుల వివాదం.. హైకోర్టులో ఫిర్యాదు చేసిన రఘునందన్ రావు!

లక్ష రూపాయల లంచం.. ACB వలలో DMHO స్వర్ణకుమారి!

Big Stories

Advertisement
×