E-Paper
Advertisement

రాబోయే ఎన్నికలపై.. సీఎం రేవంత్ వేసిన బిగ్ పొలిటికల్ ప్లాన్ ఇదే!

రాబోయే ఎన్నికలపై.. సీఎం రేవంత్ వేసిన బిగ్ పొలిటికల్ ప్లాన్ ఇదే!
Advertisement

Telangana Elections: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో త్వరలో జరగబోయే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఒక ఎమ్మెల్యే స్థానానికి జరగబోయే బై ఎలక్షన్ సర్కార్ గ్రాఫ్​ కు టెస్ట్ గా మారనున్నాయి. ఈ మూడు స్థానాల్లో జరగబోయే ఎన్నికలు ప్రభుత్వ ప్రజాదరణకు పరీక్షగా నిలవనున్నాయి. అంతేగాక రాబోయే సార్వత్రిక ఎన్నికల మైలేజ్ కు కూడా ఈ ఎలక్షన్ కీలకంగా పనిచేయనున్నాయి. ఈ మూడు స్థానాల్లో వచ్చే తీర్పే…రాబోయే రోజుల్లో జరగనున్న సార్వత్రిక, స్థానిక సంస్థల పోరుకు ప్రధాన దిక్సూచిగా ప్రభావం చూపనున్నాయి.

సీఎం స్ట్రాటజీ..

ఈ నేపథ్యంలోనే గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ, ప్రభుత్వం సకల శక్తులూ ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్టీల దృష్టి ఈ మూడు స్థానాలపై ఉండటంతో ఓటర్ల తీర్పు ఏవిధంగా ఉండబోతోందనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనిలో భాగంగానే సీఎం తన స్ట్రాటజీలను నేరుగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇన్ చార్జ్ మంత్రులతో పాటు స్థానిక మంత్రులు కూడా ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకొని కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించేందుకు టార్గెట్ పెట్టుకున్నట్లు టీ పీసీసీ వర్గాలు తెలిపాయి.

రెండూ కీలక ఎమ్మెల్సీ స్థానాలే..

Advertisement

దక్షిణ తెలంగాణ రాజకీయ స్థానాలపై ప్రభావం చూపే ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ సీటును ఎలాగైనా సొంత చేసుకోవాలని హస్తం పార్టీ అన్ని విధాలుగా శ్రమిస్తుంది. 34 నియోజకవర్గాలను అనుసంధానం చేస్తూ నిలిచే ఈ గ్రాడ్యుయేట్ స్థానంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగ యువత ఓట్లు చాలా ఎక్కువ. రాష్​ట్ర వ్యాప్తంగా అత్యధిక గ్రాడ్యుయేట్ కలిగిన ఓటర్లు కూడా ఈ స్థానంలో ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్,పారదర్శక నియామకాలతో పాటు కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ఈ స్థానంలో కాంగ్రెస్ ఓట్లు పడనున్నాయి.

కాంగ్రెస్‌కు అతి ముఖ్యం..

ఇక రాష్ట్ర రాజధానిని అనుసంధానం చేస్తూ గ్రాడ్యుయేట్ స్థానంగా ఉన్న మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎన్నికల సీటును సాధించడం కూడా కాంగ్రెస్ కు అతి ముఖ్యం. సిటీతో పాటు ప్రధాన ఐటీ కారిడార్లు కవర్ అయ్యే ఈ స్థానంలో కార్పొరేట్ ఉద్యోగులు, మేధావులు, మధ్యతరగతి పట్టభద్రులు ఎక్కువగా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రభుత్వ పాలన ఆధారంగా పట్టభద్రులు తమ అభిప్రాయాన్ని ఓట్ల రూపంలో ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలోనే సర్కార్ కు ఈ రెండు స్థానాల తీర్పు బెంచ్ మార్క్ గా నిలవనున్నాయి.

Advertisement

Also read: అర్ధరాత్రి వేళ రోడ్లపైకి వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు, ఈ ఘటనే ఎగ్జాంపుల్-సీపీ సజ్జనార్

బై ఎలక్షన్ హాట్ సీటే..

దానం నాగేందర్ నిర్ణయంతో ఏర్పడిన ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో గెలవడం కూడా కాంగ్రెస్ కు ఇంపార్టెంట్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో హస్తం విజయం సాధించినప్పటికీ, ఈ ఎన్నికల్లో విజయం సాధించడం అతి కీలకం అంటూ సీఎం కూడా ఇప్పటికే తన టీమ్ కు ఇంటర్నల్ ఆదేశాలిచ్చారు. రెండున్నర ఏళ్ల తర్వాత అర్బన్ ఓటర్ల నాడీ ఏ విధంగా ఉన్నదనేది ఈ స్థానంలో విజయం ద్వారా తేలిపోనున్నది. మరోవైపు ఈ సీటు విజయం సాధించడం ద్వారా నెక్ట్స్ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లోని ఇతర సెగ్మెంట్లపై కూడా కాంగ్రెస్ తన ప్రభావాన్ని కొనసాగించవచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టిక్కెట్ పంపిణీపై హైకమాండ్ కూడా ఆచీతూచీగా వ్యవహరిస్తున్నది.

సీఎం రేవంత్ డైలీ సర్వేలు.. పక్కా స్ట్రాటజీ..

ఈ ఎన్నికల్లో విజయం ప్రాముఖ్యతను ముందే గ్రహించిన సీఎం…ఇప్పటికే మైక్రో లెవెల్ లో స్ట్రాటజీలను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. గత కొన్ని రోజుల నుంచి వివిధ సర్వే ఏజెన్సీలతో పాటు ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా క్షేత్రస్థాయిలో ఓటర్ల మూడ్‌ను రోజువారీగా సీఎం ట్రాక్ చేస్తున్నారు. ప్రతిపక్షాల ఎత్తుగడలకు అనుగుణంగా వ్యూహాలను ఎప్పటికప్పుడు మారుస్తున్నారు. కొత్త ఓటర్ల నమోదు ప్రాసెస్ ఫర్ పెక్ట్ గా జరిగేలా ముందే క్షేత్రస్థాయి లీడర్లను ఆదేశించడంతో పాటు, పాత ఓట్లు తొలగిపోకుండా బూత్ స్థాయి టీమ్ లను సీఎం అలర్ట్ చేశారు.

మైలేజ్ వచ్చేలా..

ప్రతి ఎమ్మెల్సీ స్థానానికి , ఖైరతాబాద్ నియోజకవర్గానికి సీనియర్ మంత్రులను ఇన్-ఛార్జులుగా నియమించనున్నారు. ఉచిత బస్సు ప్రయాణం, రూ.2 లక్షల రుణ మాఫీ, ఉద్యోగులకు డీఏ, ఉచిత విద్యుత్, సన్న బియ్యం, నిరుద్యోగులకు భారీగా ఉద్యోగాలు కల్పన వంటి తదితర అంశాలపై పుల్ పబ్లిసిటీ కల్పించి ఓటర్లను ఆకట్టుకునేలా సీఎం తన స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పటికే అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఈ ప్రభుత్వ హయంలో జరిగిన లబ్ధి, తీసుకున్న మంచి నిర్ణయాలు, ఉద్యోగాలు కల్పన, తదితర అంశాలపై టీవీల్లో డిస్ ప్లే చేస్తున్నారు. త్వరలో మరిన్ని పబ్లిక్ ప్లేసెస్, లైబ్రేరీలు, కాలేజీలు, ఇతర సామూహిక ప్రదేశాల్లో సర్కార్ కు మైలేజ్ వచ్చేలా పబ్లిసిటీ కల్పించనున్నారు.

Also read: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి చేస్తున్న పసిబిడ్డ.. ప్రపంచంలోనే అతిపిన్న వయసు ఇన్వెస్టర్

Tags

Related News

కేసీఆర్‌ ఉన్నప్పుడే గౌరమ్మా..! బతుకంతా పచ్చగ ఉండే గౌరమ్మా..! రెండు పాటలను విడుదల చేసిన బీఆరెస్‌ పార్టీ..!

చంద్రుడిపై ఐదు మెరుపులు.. ఆర్టెమిస్-2 వ్యోమగాములు గుర్తించిన వింత ఏంటి?

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేది ఆ నలుగురే.. ఢిల్లీ వేదికగా రాహుల్ గాంధీ కొత్త నినాదం!

విశాఖ నావికాదళంపై పాక్ కన్ను.. 13 మంది నేవీ సిబ్బందిపై అనుమానాలు!

జంతర్ మంతర్ వద్ద ప్రకాష్ రాజ్ నిరసన.. కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు!

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. ఈ అంశాలపై ప్రత్యేక చర్చ!

ఉత్తరాంధ్రపై బొత్స మాస్టర్ ప్లాన్.. 2029 టార్గెట్‌గా రంగంలోకి రెండో తరం

Big Stories

Advertisement
×