E-Paper
Advertisement

2 సీట్లు.. 3 పార్టీలు.. పట్టుభద్రుల ఓటు ఎవరివైపు..?

2 సీట్లు.. 3 పార్టీలు.. పట్టుభద్రుల ఓటు ఎవరివైపు..?
Advertisement

Graduate MLC Elections: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పరీక్ష కోసం ప్రధాన పార్టీలు  సీరియస్‌ ప్రిపరేషన్‌లో పడ్డాయి.  కాంగ్రెస్‌  హైకమాండ్‌ సీఎం రేవంత్‌ రెడ్డి MLC ఎన్నికలను ప్రెస్టేజీయస్‌గా తీసుకున్నారు. ఆ   రెండు స్థానాలు చేజక్కించుకోవాల్సిందేనని ఏడుగురు మంత్రులకు  బాధ్యతలను అప్పగించారు.మరోవైపు పట్టు బిగించేందుకు  BRS గట్టిగా ప్రయత్నిస్తోంది.  టార్గెట్‌ తెలంగాణ అంటోన్న  BJP ,ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ఛాలెంజింగ్‌గా  తీసుకుంటోంది. ఇక పెద్దల సభలో కర్చీప్ వేసేందుకు కవిత TRS సిద్ధమైంది.

Advertisement

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పార్టీ వ్యూహాలు..

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పార్టీలు వ్యూహాలు పదనుపెడుతున్నాయి. వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ.. స్థానానికి BRS  నుంచి గతంలో పోటీ చేసిన ఏనుగుల రాకేష్‌ రెడ్డితో  పాటు  KU స్టూడెంట్‌ లీడర్‌ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి పేరు కూడా బలంగా విన్పిస్తోంది. కాంగ్రెస్‌ నుంచి పటేల్‌ రమేష్‌ రెడ్డి, గుత్తా అమిత్‌ రెడ్డి, ఇందిర, లోకేష్‌ యాదవ్‌ రేసులో ఉన్నారు. ఇక బీజేపీ నుంచి గతంలో పోటీ చేసిన ప్రేమేందర్‌ రెడ్డి నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. మరి ఇప్పుడు ఎవరికి   అవకాశం  ఇస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. కవిత TRS నుంచి డాక్టర్‌ నలమాస శ్రీకాంత్‌ గౌడ్‌  ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.. మరోవైపు హైదరాబాద్‌- రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌  స్థానానికి  BRS టికెట్‌  రేసులో IRS ఆఫీసర్‌ తో పాటు  వెంకటేశ్వర్‌ రెడ్డి, నాగేందర్‌ గౌడ్‌,ఆంజనేయ గౌడ్‌ పేర్లు విన్పిస్తున్నాయి. కాంగ్రెస్‌ నుంచి సామా రామ్మోహన్ రెడ్డి, PRTU నేత హర్షవర్ధన్‌ రెడి టికెట్‌ పోటీలో వున్నారు. బీజేపీ  నుంచి మాజీ ప్రధాని పీవీ మనవడు సుభాష్‌  సహా అమర్‌నాథ్, కాసం వెంకటేశ్వర్లు రెడ్డి పేర్లు తెరపైకి  వచ్చాయి.  ఇక కవిత టీఆర్‌ఎస్‌ నుంచి అభ్యర్థులెవరో ఇంకా  క్లారిటీ లేదు.  ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీలకు  మాములు పరీక్ష కాదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్‌. ఇంకా చెప్పాలంటే ఓ రెఫరెండం లెక్క.ఎందుకంటే  6 ఉమ్మడి జిల్లాలు..77 నియోజకవర్గాల తీర్పు..అసెంబ్లీ ఎన్నికల్లో రిఫ్లెక్ట వుతుంది. పట్టునిలుపుకోవడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఈ ఎమ్మెల్సీలను  మెట్టుగా చేసుకోవాలని  అన్ని పార్టీలు వ్యూహాలకు పదను పెడుతున్నాయి.మరి పట్టభద్రుల తీర్పు ఎటువైపు?

Tags

Related News

క్షుద్ర రాజకీయాలిక్కడ.. చేతబడుల దాడులు అక్కడ..! రాజకీయాల కోసం నేతలే మూఢనమ్మకాలను పట్టుకు వేలాడుతుంటే..

రాముడి యుగం నాటి దివ్య వృక్షం.. విజయవాడలో ప్రత్యక్షం!

ఎమ్మెల్యేలను నెత్తినపెట్టుకుని పెద్ద తప్పు చేశాం..! కేసీఆర్ చేసిన పెద్ద పొరపాటిదే..! కేటీఆర్‌ కామెంట్స్‌ వెనుక మర్మమేమిటీ? పాతకాపులకిక చెక్?

ఆయన వేలు పెడితే నాకు టికెట్ ఖాయం.. కిషన్ రెడ్డి మద్దతు ఎవరికో తెలుసా?

ఆ శాఖలోకి మీడియాకు నో ఎంట్రీ.. తెరవెనుక ఏం జరుగుతోంది?

పెట్టుబడులను ఆకర్షించేందుకు లోకేశ్‌ డోలో గోలీ మంత్రం..! పప్పు అనే విమర్శల నుంచి చమత్కార ఛలోక్తులు విసిరే స్థాయికి..!

మెట్రో పిల్లర్ల కేసులో అసలు కథ ఇదేనా? బెయిల్ కోసం సెక్షన్లు తగ్గించేశారా?

కేంద్రం నిర్ణయాలతో ధరల సూచి హైక్.. ధరల మంటతో సామాన్యుడి విల విల!

Big Stories

Advertisement
×