MacBook Air M5: సాధారణంగా యాపిల్ మ్యాక్‌బుక్ అంటేనే ప్రీమియం ధర గుర్తొస్తుంది. అందుకే ఈ ల్యాప్‌టాప్ కొనాలనుకునే చాలామంది సరైన ఆఫర్ కోసం ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు అలాంటి వారికి క్రోమా నుంచి అదిరిపోయే డీల్ అందుబాటులోకి వచ్చింది. MacBook Air M5పై ఏకంగా రూ.10,410 డిస్కౌంట్ లభిస్తోంది. కొత్త తరం M5 చిప్‌తో వచ్చిన ఈ ల్యాప్‌టాప్‌పై ఇంత భారీ ధర తగ్గింపు రావడంతో ఈ ఆఫర్‌పై ఆసక్తి పెరిగింది. ప్రీమియం డిజైన్‌తో పాటు శక్తివంతమైన పర్ఫార్మెన్స్ అందించే MacBook Air M5ను ఇప్పుడు ఎంతకు కొనుగోలు చేయవచ్చు? ఈ డిస్కౌంట్ ఎలా లభిస్తుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
యాపిల్ ఈ మ్యాక్‌బుక్ ఎం5 (16GB ర్యామ్ + 512GB స్టోరేజ్) వేరియంట్‌ను రూ.1,49,900 ధరకు మార్కెట్లోకి తీసుకొచ్చింది. కానీ ప్రస్తుతం క్రోమా ఈ సిల్వర్ కలర్ ల్యాప్‌టాప్‌ను కేవలం రూ.1,39,490 ధరకే అందిస్తోంది. అంటే.. నేరుగా రూ.10,410 తగ్గింపు లభిస్తోంది. దాదాపు 7 శాతం వరకు డిస్కౌంట్ వస్తుండటంతో, కొత్త మ్యాక్‌బుక్ తీసుకోవాలనుకునే వారికి ఇది నిజంగా బెస్ట్ టైమ్ అని చెప్పవచ్చు.
Also Read: iPhone 18 Proపై రూ.57,000 భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా?
ఒకేసారి అంత డబ్బు పెట్టలేని వారి కోసం క్రోమా ఈఎంఐ ఆప్షన్ కూడా ఇస్తోంది. నెలకు రూ.6,566 చెల్లించి ఈ ల్యాప్‌టాప్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు. అయితే మనం ఎంచుకునే బ్యాంక్, ప్రాసెసింగ్ ఫీజును బట్టి ఈ అమౌంట్ కొద్దిగా మారే అవకాశం ఉంటుంది. దీనికి తోడు ఉచితంగా హైఫన్ 4 ఇన్ 1 ఎసెన్షియల్స్ కాంబోను గిఫ్ట్‌గా ఇస్తున్నారు. అయితే ఇది స్టాక్ ఉన్నంత వరకే లభిస్తుంది.
ఈ ల్యాప్‌టాప్‌లో 13.6 ఇంచుల ఎల్‌సీడీ డిస్ప్లే ఇచ్చారు. ఇది 500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. వీడియో కాల్స్ మాట్లాడటానికి 12 మెగాపిక్సెల్ సెంటర్ స్టేజ్ కెమెరా ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ మీటింగ్స్ లేదా క్లాసెస్ జరుగుతున్నప్పుడు మనం కదిలినా కెమెరా మనల్ని ఫ్రేమ్ మధ్యలోనే ఉంచుతుంది. దీనివల్ల వీడియో కాల్ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంటుంది.
కొత్త ఎం5 చిప్‌సెట్‌తో వస్తున్న ఈ మ్యాక్‌బుక్ పెర్ఫార్మెన్స్ విషయంలో తగ్గేదే లే అంటుంది. ఇందులో వైఫై 7, బ్లూటూత్ 6, థండర్‌బోల్ట్ 4 పోర్ట్స్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. మ్యాగ్‌సేఫ్ 3 ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 18 గంటల పాటు నాన్ స్టాప్‌గా వీడియోలు చూసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ల్యాప్‌టాప్‌ను ఎప్పుడూ చేతిలో పట్టుకుని తిరిగే వారికి ఈ మ్యాక్‌బుక్ బాగా ఉపయోగపడుతుంది.
Also Read: మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన TRAI.. ఇకపై డాటా లేకుండా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు!