E-Paper
Advertisement

మహబూబాబాద్ జిల్లాలో విచిత్ర రైల్వే స్టేషన్.. అయోమయంలో ప్రయాణికులు!

మహబూబాబాద్ జిల్లాలో విచిత్ర రైల్వే స్టేషన్.. అయోమయంలో ప్రయాణికులు!
Advertisement

Railway Station: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం. ఇక్కడి రైల్వే స్టేషన్ బోర్డు మీద ఉండేది ఒక్కటే పేరు తాడ్లపూసపల్లి. టికెట్ తీసుకునేటప్పుడు తాడ్లపూసపల్లి. రైలులో ప్రయాణం చేసేటప్పుడు తాడ్లపూసపల్లి. స్టేషన్ బోర్డు మీదా అదే పేరు. కానీ, రైలు దిగాక మాత్రం మీరు ఉండేది అన్నారం గ్రామంలో!

తాడ్లపూసపల్లి పేరు..

ఈ తిరకాసు మొదలైంది సుమారు 50 ఏళ్ల క్రితం. అప్పటి పరిస్థితిని బట్టి రైల్వే అధికారులు అన్నారం గ్రామం దగ్గర రైల్వే స్టేషన్ ఏర్పాటు చేశారు. కానీ, దానికి పక్కనున్న తాడ్లపూసపల్లి పేరు పెట్టారు. అప్పటి నుంచి ఇదే పేరు కొనసాగుతోంది. అధికారులు మార్చలేదు. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా.. మొదటిసారి ఈ ఊరికి వచ్చేవాళ్లు.. స్టేషన్‌లో తాడ్లపూసపల్లి బోర్డు చూసి, వచ్చేశాం అనుకుని హాయిగా దిగుతారు. కానీ బయటికి వచ్చాక అది అన్నారం అని తెలిసి షాక్‌కు గురవుతారు. స్థానికులను అడిగితే చెప్పే సమాధానం.. తాడ్లపూసపల్లి ఇంకా నాలుగు కిలోమీటర్లు దూరంలో ఉంది అని! అంటే, టికెట్ మీద ఊరు వేరు.. దిగిన ఊరు వేరు.

Advertisement

Also read: సింగరేణి కార్మికులకు భారీ గుడ్ న్యూస్.. బోనస్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం!

ఫుల్‌స్టాప్ పెడుతుందా?

ఈ స్టేషన్ కోడ్ కూడా టీఏఏ అని ఉంటుంది. అంటే తాడ్లపూసపల్లి పేరుతోనే నడుస్తోంది. అర్ధ శతాబ్దం దాటినా.. ఈ తప్పు అలానే ఉండిపోయింది. బోర్డు మార్చి, ఉన్నదున్నట్టు అన్నారం అని పెట్టాలని స్థానికులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. తమ గ్రామం పేరు తమ స్టేషన్‌కు పెట్టాలని వారి ఆవేదన. కానీ, ఇప్పటివరకు రైల్వే అధికారుల నుంచి స్పందన కరువైంది. టికెట్ ఒక ఊరు.. దిగేది ఇంకో ఊరు. 50 ఏళ్లుగా ప్రయాణికులను వేధిస్తున్న ఈ ప్రశ్నకు రైల్వే శాఖ ఫుల్‌స్టాప్ పెడుతుందా? అన్నారం గ్రామస్తుల డిమాండ్ నెరవేరుతుందా?

Advertisement

Also read: మీ పిల్లలతో వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా.. చరిత్ర కలిగిన ఈ పార్క్ చూసేయండి!

Tags

Related News

సెప్టెంబర్ 30న ఆల్ టైమ్ రికార్డ్.. విద్యుత్ వాడకంలో తెలంగాణ సరికొత్త చరిత్ర!

తమిళ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు.. శివకార్తికేయన్ సమావేశం వెనుక వ్యూహం ఇదేనా?

మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఆ భూముల కేసులో జోక్యానికి నో!

విమాన ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. పెరగనున్న చార్జీలు!

సిమ్ లేదు.. టవర్ అక్కర్లేదు.. భద్రతా బలగాలకు చుక్కలు చూపిస్తున్న ‘లోరా’ ఆయుధం!

పండుగ సీజన్‌లో గోల్డ్ షాపింగ్ చేస్తున్నారా.. భారీగా పెరిగిన ధరలు, GST లెక్కలివే!

మీ పిల్లలతో వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా.. చరిత్ర కలిగిన ఈ పార్క్ చూసేయండి!

Big Stories

Advertisement
×