BigTV English

Telangana BJP: ఏందయ్యా మీది.. రోజుకో లొల్లి! అధిష్టానం సీరియస్

Telangana BJP: ఏందయ్యా మీది.. రోజుకో లొల్లి! అధిష్టానం సీరియస్

Telangana BJP: తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడి ఎంపిక ఎంతకీ కొలిక్కి రావడం లేదు.. ఫలానా నాయకుడే ప్రెసిడెంట్ అని, ఇక ప్రకటనే తఱువాయని ముహూర్తాలపై లీకులు తప్ప.. రాష్ట్ర పార్టీ పగ్గాలు ఎవరి అప్పజెప్తారో ఒక పట్టాన తేలడం లేదు. ఆ ఎఫెక్ట్‌తో రాష్ట్ర కాషాయ నేతలు పార్టీ ఇమేజ్‌ కంటే.. సొంత ఇమేజ్ పై ఫోకస్‌ పెడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక పూర్తి కాకపోవడంతో ఆశావహులు తమ వ్యక్తిగత ఇమేజ్‌ పెంచుకుని ఢిల్లీ పెద్దల దృష్టిలో పడటానికి పాకులాడుతున్నారనే టాక్‌ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది


తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిపై కొనసాగుతున్న ఉత్కంఠ

తెలంగాణ బీజేపీలో సంస్థాగతంగా 2 జిల్లాలు మినహాయిస్తే అన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తయ్యింది. ఇక రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ ఎవరనేది మరో వారంలో తేలిపోనుందని అంటున్నారు. ఆ క్రమంలో రాష్ట్ర బీజేపీలో మాత్రం రోజు రోజుకు నేతల మధ్య ఆధిపత్య పోరు పెరిగిపోతోంది. తమ తమ వ్యక్తిగత ఇమేజ్‌లను పెంచుకునేందుకు మాత్రమే ఆరాట పడుతున్న నేతల తీరు ఆటు అధిష్టాన పెద్దల్లో , ఇటు పార్టీ క్యాడర్లో చర్చనీయాంశంగా మారుతోంది.


నేతల వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కాషాయ శ్రేణులు

రేవంత్‌రెడ్డి సర్కారు ఇచ్చిన హామీలు విస్మరించిందని, ప్రజలను నిలువునా మోసం చేసిందని మీడియా మైకుల ముందు స్పీచ్‌లు, సోషల్ మీడియాలో ఏఐ ప్రచారాలకే రాష్ట్ర బీజేపీ నేతలు పరిమితం అవుతుండటం విమర్శలపాలవుతోంది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటాలు, ప్రజల పక్షాల ఆందోళనలు, ఉద్యమాలు నిర్వహిచడానికి మాత్రం కాషాయ నేతలు పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు. ఎవరికి వారు వ్యక్తిగత ఎజెండాలతో వ్యవహారాలు నడిపిస్తూ.. పార్టీ జెండాలు, ఎజెండాలను పట్టించుకోకపోవడంపై కాషాయ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నాయి

రాష్ట్రా సారథి ప్రకటన కోసం జిల్లా అధ్యక్షుల ఎదురుచూపు

రాష్ట్ర బీజేపీలో ఎవరిని కదిలించినా కొత్త అధ్యక్షుడు ఎవరనే దానిపైనే చర్చ జరుగుతోంది. అంతే కాదు. ఇటీవల కొత్తగా నియామకమైన జిల్లాల అధ్యక్షులు కూడా రాష్ట్ర సారథి అనౌన్స్ మెంట్ కోసమే ఎదురుచూస్తున్నారు. అధ్యక్ష రేసులో ఉన్న నేతలంతా తలో దిక్కు అన్నట్టుగా వ్యవహరిస్తూ.. ప్రసంగాలు తప్ప, మ్యాటర్ లేదనే అపవాదును మూట కట్టుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే అధ్యక్షుడు ఎవరనేది తెలాకే పోరాటాలు మొదలు పెట్టాలనే ధోరణిలో నాయకులు ఉన్నారంట.

పోరాటాలే చేస్తే క్రెడిట్ కిషన్ రెడ్డికి దక్కుతుందంట

ప్రస్తుతం ఉన్న అధ్యక్షులు కిషన్ రెడ్డి ఎలాగో కొద్ది రోజుల్లో మారిపోతున్న నేఫధ్యంలో ఇప్పుడు గనక ప్రభుత్వంపై పోరాటాలకు దిగితే ఆ క్రెడిట్ కిషన్ రెడ్డికి వెళ్తుందంట. కాబట్టి కొత్త ప్రెసిడెంట్ వచ్చాకే పోరాటాలు మొదలు పెడితే నూతన చీఫ్ దృష్టిలో పడ్డట్టుగా ఉంటుందని కొత్తగా నియమితులైన జిల్లా పార్టీ అధ్యక్షులు అనుకుంటున్నట్టు టాక్ నడుస్తుంది. అంతేకాదు ఒకవేళ ఇప్పుడు పోరాటాలు చేసి ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ కు హైప్ ఎందుకు ఇవ్వాలనే యోచనలో పలువురు జిల్లా అధ్యక్షులు ఉన్నట్లు నేతలు చేవులు కోరుక్కుంటున్నారంట

పార్టీని నవ్వులపాలు చేసిన నేతల మూసీ నిద్ర

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ పెద్దగా ప్రజా వ్యతిరేక ఉద్యమాలు చేసిన దాఖలాలు లేవు. గ్రూప్ 1 అభ్యర్థులకు మద్దతుగా కేంద్రమంత్రి బండి సంజయ్, రైతు దీక్ష పేరిట బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన కార్యక్రమాలు మినహాయిస్తే .. చెప్పుకోదగ్గ స్థాయిలో ఒక్క ప్రోగ్రామ్ కూడా చేపట్టలేదని బీజేపీ నేతల మధ్య చర్చ నడుస్తోంది. అప్పట్లో మూసీ నిద్రల పేరుతో బీజేపీ నేతలు హడావుడి చేసినా.. అది పార్టీని నవ్వులపాలు చేసిందంటున్నారు.

రైతు సత్యాగ్రహ దీక్షకు జిల్లాల్లో స్పందన కరువు

ఇక పార్టీ జిల్లాల అధ్యక్షుల నియామకం తర్వాత ఇటీవల కాషాయ పార్టీ రాష్ట్ర నాయకత్వం, కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్లతో రైతు సత్యాగ్రహ దీక్షకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని స్పష్టంచేసింది. కానీ ఈ దీక్షలు అనుకున్నంత స్థాయిలో జరగలేదు. కొన్ని జిల్లాల్లో రైతు దీక్ష ప్రభావం పెద్దగా కనిపించలేదు. దాంతో కొత్తగా ఎన్నికైన జిల్లాల అధ్యక్షులు రాష్ట్ర నాయకత్వం పిలుపుని లైట్ తీసుకున్నారన్న టాక్ వినిపించింది.

ప్రజలను ప్రభావితం చేయలేకపోతున్న కాషాయ నేతలు

ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో ఉందో లేదో కానీ … బీజేపీ, బీఆర్ఎస్ కలిసి చేస్తున్న ఏఐ ప్రచారాలు, ఉపన్యాసాలు మాత్రం ప్రజల దృష్టిని ఆకర్షించలేకపోతున్నాయి . అసలు విపక్షాల విమర్శలను ప్రజలు పట్టించుకుంటున్నట్లే కనిపించడం లేదంటున్నారు. అటు ప్రజలను ప్రభావితం చేయలేక, ఇటు సొంత పార్టీలో నేతల మధ్య రగులుతున్న కుంపట్లను చల్లార్చుకోలేని పరిస్థితుల్లో బీజేపీ ఉండిపోవడం ఇపుడు ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. వ్యక్తి గత ఇమేజ్ ల కోసం పార్టీని డ్యామేజ్ చేసే పనిలో నేతలున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి.

Also Read: యనమలకు బాబు షాక్.. యనమల ప్రస్థానం ముగిసినట్లేనా?

కిషన్‌రెడ్డిని టార్గెట్ చేస్తున్న రాజాసింగ్

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్వయంగా కిషన్‌రెడ్డితో పాటు సొంత పార్టీ ముఖ్యులపై చేస్తున్న కామెంట్లు ఎప్పటికప్పుడు ఆ పార్టీ పరువును బజారుకు ఇడుస్తున్నాయి. శ్రీరామ నవమి రోజున రాజాసింగ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా భారీ స్థాయి శోభా యాత్ర నిర్వహిస్తారు. కానీ ఈ సారి అందుకు భిన్నంగా అంబర్‌బేట్‌లో మరొక శోభా యాత్ర నిర్వహించడం అందులో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి హదాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. కావాలనే బీజేపీ రాష్ట్ర నాయకత్వం తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తోందని.. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఏం చేయలేరని రాజాసింగ్ ఫైర్ అవ్వడం ఆ పార్టీలో రచ్చ రేపుతోంది.

రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఆశిస్తున్న కమలనాథులు

మొత్తం మీద రాష్ట్రంలో కాంగ్రెస్లప్రజా పాలన సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న నేపధ్యంలో.. బీజేపీ నేతల మధ్య ఆధిపత్య పోరు ఆ పార్టీ ప్రతిష్టను మరింత దిగజారుస్తోందంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే బీఆర్ఎస్ స్థానంలో రాష్ట్రంలో రెండో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఆశిస్తున్న కమలనాథుల కలలు కల్లలుగానే మిగిలిపోతాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి రాష్ట్ర బీజేపీకికొత్త అధ్యక్షుడు వచ్చాకైనా తీరు మారుతుందా..? లేక సేమ్ తంతు కొనసాగనుందా అనేది చూడాలి.

Related News

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

T Congress: కాంగ్రెస్‌లో టెన్షన్..? కార్యవర్గ పోస్టుల భర్తీ ఎప్పుడు..

Big Stories

×