Intinti Ramayanam Today Episode April 9th : నిన్నటి ఎపిసోడ్ లో.. ఉదయం పల్లవి కిందకి వస్తుంది. ప్రణతి బయట రావడం చూసి ఇది కచ్చితంగా అవని తప్పేమీ లేదని చెప్పడానికి వచ్చినట్టుంది అని పార్వతీ దగ్గరికి వెళ్లి ప్రణతి వచ్చిందని చెప్తుంది. ప్రణతి తన తప్పేమీ లేదు వదిన తప్ప ఏమీ లేదు తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి భరత్ తండ్రి కాదని చెప్తుంది అత్తయ్య అని ముందుగానే పార్వతికి అన్ని విషయాలు చెప్తుంది. మొత్తానికి ప్రణతి ఇంట్లోకి రాగానే అందరూ సంతోషంగా కొత్తదాని లాగా ఇంట్లోకి వస్తావేంటి ఇది నీన్లే కదా నీ ఇంట్లోకి నువ్వు రావడానికి ఎంత భయపడుతున్నావు ఏంటి అని అంటారు. శ్రీకర్, అక్షయ్ ప్రణతి దగ్గరికి వెళ్లి నువ్వు ఇంటికి రావడం మాకు చాలా సంతోషంగా ఉందమ్మా లోపలికి తీసుకెళ్తారు. నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలని ఇక్కడికి వచ్చాను అని ప్రణతి. ప్రణతి నిజం చెప్పినా ఎవరు నమ్మరు. తిట్టి పంపిస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఆరాధ్య పరీక్షలు అయిపోవడంతో చాలా సంతోషంగా బయలుదేరుతుంది. వాళ్ళ నాన్నతో కలిసి సంతోషంగా ఇంటికి వెళ్తూ సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. మనతో అమ్మవునింటే చాలా బాగుండేది నాన్న. నాకు ఎగ్జామ్స్ అయినప్పుడు నన్ను బాగా చదివించి పూజ చేసి, ఎగ్జామ్ బాగా రాసేలా నన్ను ఎంతో ఎంకరేజ్ చేసేది. అమ్మ మళ్లీ మన ఇంటికి తిరిగి వస్తుందా అని మాట్లాడుతుంది. అప్పుడే అటుపక్కగా వెళ్తున్న అవనీని ఆరాధ్య చూస్తుంది. ఒకసారి కార్ ఆప్ నాన్న అని కారు దిగేసి అవని దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్తుంది.
అది చూసిన అవని ఆరాధ్య కోసం వస్తుంది. అయితే అదే సమయంలో అక్కడ కారు రావడం గమనించిన అవని ఆరాధ్య కోసం పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆరాధ్య నువ్వు పెద్ద ప్రమాదం నుంచి అవని కాపాడుతుంది. తల్లి కూతుర్ల ప్రేమను చూసి అక్షయ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆరాధికేం కాలేదని అవని సంతోషపడుతుంది. ఇక ఆ విషయాన్ని తలుచుకుంటూ ఇంటికి వెళ్లిపోతుంది. స్వరాజ్యం ఎంత పలకరించినా అవని ఏం మాట్లాడుకుండా లోపలికి వెళ్ళిపోతుంది.
దయాకరు, స్వరాజ్యం ఇద్దరూ వెళ్లి ఏమైంది అవని అని అడుగుతారు. నా కూతురుకి పెద్ద ప్రమాదం తప్పింది పిన్ని కాసేపై ఉంటే ప్రాణాలు పోయేవి ఆ మాట కూడా నేను ఊహించుకోలేకపోతున్నాను అని అవని కన్నీళ్లు పెట్టుకుంటుంది. నువ్వు దూరం లేకపోవడం వల్లె నీ కూతురు నీ గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది నువ్వు నీ గురించి ఆలోచించి నీ కాపురాని సరిదిద్దుకునే పని చేయొచ్చు కదా అని స్వరాజ్యం సలహా ఇస్తుంది. ప్రణతి ప్రేమించిన అబ్బాయి మోసం చేసి విదేశాలకు వెళ్లిపోయాడు ఆ విషయం ప్రణతికి తెలిస్తే చాలా బాధపడుతుంది ముందు ప్రణతి జీవితాన్ని ఒక దారిలో పెట్టి ఆ తర్వాతే నా గురించి నేను ఆలోచిస్తాను అని అంటుంది అవని.
ప్రణతికి విషయం తెలిస్తే చాలా బాధపడుతుంది. చాలా సెన్సిటివ్ ఏం చేసుకుంటుందో అర్థం కావట్లేదు మీరు ఎవరు ఈ విషయాన్ని ప్రణతితో డిస్కస్ చేయొద్దని అవని అంటుంది. ప్రణతి బాధపడడం చూసి భరత్ ప్రణతికి జ్యూస్ తీసుకుని వచ్చి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాడు. ధైర్యంగా ఉంటేనే అక్క ధైర్యంగా ఉంటుంది.. నువ్వు బాధ పడుతూ ఉంటే అక్క కూడా బాధపడుతూ ఉంటుంది అని ప్రణతికి ధైర్యం చెప్తాడు. ఇక అవని తర్వాత రోజు ఆఫీస్ కి ఫ్లవర్ డెకరేషన్ కోసం వెళ్తుంది.
అవని రోజు ఆఫీస్ కి వస్తుంది ఫ్లవర్ డెకరేషన్ కోసం వస్తుందా లేక అక్షయ మనసులో ప్రేమను సంపాదించడం కోసం వస్తుందని అవని వెనకాలే ఫాలో అవుతూ ఆఫీస్ లోపలికి వస్తుంది. అక్కడ అవని అందరితో సరదాగా మాట్లాడి అక్షయ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అక్షయ్ రాగానే మీతో నేను కొంచెం మాట్లాడాలని అడుగుతుంది. ఏం మాట్లాడాలి అంటే అవని తన బ్యాగులోంచి ఒక పేపర్ తీయబోతుంది. అప్పుడే అక్షయ అవనీల ఫోటో బయటపడుతుంది. అది చూసిన అక్షయ్ కోపంతో ఊగిపోతాడు.
అందరూ కలిసి ఉండాలి అన్ని తప్పులు మర్చిపోయి మనిద్దరం సంతోషంగా ఉందామని నేను అనుకున్నాను మా చెల్లిని మా చెల్లి సంతోషాన్ని మాకు దూరం చేశావు. అన్ని మర్చిపోయి మళ్ళీ కలుద్దాం అంటే నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేదని సీరియస్ అవుతాడు. ఇకమీదట నువ్వు నేను కలిస్థామని అనుకోవద్దు. శాశ్వతంగా నీకు దూరం అయిపోయాను అనుకో అని అవనితో అంటాడు. కానీ అవని మాత్రం నేను చెప్పేది ఒకసారి వినండి అని ఎంత బ్రతిమలాడినా వినకుండా అక్షయ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అవనీ కూడా బయటికి వెళ్లిపోతుంది. బయట అక్కడే ఉన్న పల్లవి అక్షయ్ బావ మనసులో నువ్వు లేవని తెలిసి కూడా ఎందుకక్కా నువ్వు ఇలా వెంటపడుతున్నావ్ నెక్స్ట్ నా టార్గెట్ నువ్వే. అక్షయ్ బావతో నీకు విడాకులు ఇప్పించి వేరే పెళ్లి చేస్తానని చాలెంజ్ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో పల్లవికి దిమ్మతిరిగే కౌంటర్ ఇవ్వబోతుంది. అవని.. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..