TG Mohandas Arrest: మీడియా మైకులు.. మూతి ముందుకు రాగానే..కొందరు సొంత పైత్యం ప్రదర్శిస్తున్నారు. మైకు ఉన్నది కదా అని ఇష్టమొచ్చిన స్టేట్‌మెంట్లు ఇస్తే.. చట్టం తనపని తాను చేసుకుంటూ వెళ్తుంది. మైండ్‌లో చిప్ లేనట్టు మాట్లాడితే.. జైల్లో చిప్పకూడు రెడీగా ఉంటుందని కేరళ పోలీసులు ప్రూ చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని అవమానిస్తూ రైట్‌వింగ్ పొలిటికల్ అనలిస్ట్ టీజీ మోహన్‌దాస్ చేసిన కామెంట్స్ సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి.
సైబర్ పోలీసులు కేసు నమోదు
ఇటీవల ఢిల్లీలో నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, మహిళల గురించి తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడారు టీజీ మోహన్‌దాస్. నిరసనల్లో పాల్గొనే మహిళలకు రేప్ అంటే ఇష్టమని, దానిని ఎంజాయ్ చేసేవారు ఉన్నారంటూ అత్యంత అసభ్యకరమైన రీతిలో మాట్లాడారు. అంతటితో ఆగకుండా ఒకవేళ తనకు అధికారాలు ఉంటే ఆందోళనకారులపై కాల్పులు జరిపించేవాడినన్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రజల్లో భయాందోళనలు సృష్టించేలా ఉన్నాయని కేరళలోని తిరువనంతపురం సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో విచక్షణ కోల్పోయే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్.