BigTV English

Nutrition For Mental Health : మానసిక ఆరోగ్యం బాగుండాలంటే.. ఇవి తప్పకుండా తినాల్సిందే..!

Nutrition For Mental Health : మానసిక ఆరోగ్యం బాగుండాలంటే.. ఇవి తప్పకుండా తినాల్సిందే..!

Nutrition For Mental Health : సరైన పోషాకాహార లేకపోవడం వల్ల మానసిక ఒత్తిడి, నిద్రలేమి, మానసిక సమస్యలు పెరుగుతున్నట్లు అధ్యయనంలో తేలింది. వేపుళ్లు, తీపి పదార్ధాలు, మాంసం ఉత్పత్తులు ఎక్కువగా తీసుకుంటే వాటి వల్ల ఇన్‌ఫ్లమేష్ పెరిగి మానసికి ఒత్తిడికి దారితీస్తోందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.


కొందరు ఉదయం ఆహారం తినకుండానే ఆఫీసులకు, వారివారి పనుల్లోకి వెళ్లిపోతుంటారు. మధ్యహ్నం వరకు అలాగే ఉంటారు. ఉదయం శరీరానికి అవసరమైన గ్లూకోజ్ అందదు. దీనివల్ల మానసిక స్థితిపై ప్రభావం పడుతుంది.కాబట్టి ఖచ్చితంగా ఉదయం కొంత ఆహారం తీసుకోవాల్సిందే. తినే ఆహారంలో ఐరన్, జింక్, ఆమ్లాలు ఉండేలా చూసుకోవాలి. లేదంటే ఆలోచనా శక్తి తగ్గే ప్రమాదం ఉంది.

పనుల్లో బిజీగా ఉండడం వల్ల కొందరు రోజు మొత్తం రెండు సార్లు లేదంటే ఒకసారే ఎక్కువగా తినేస్తారు. అలా కాకుండా కొద్దికొద్దిగా ఎక్కువ సార్లు తింటే శరీరంలో నిరంతరం అవసరమైన గ్లూకోజ్ అందుతుంది. మీరు అలసిపోయే అవకాశం కూడా ఉండదు. కెఫిన్ కొంత ఆరోగ్యానికి మంచిదే. అలసటగా ఉన్నప్పుడు బూస్ట్ ఇస్తుంది. కానీ అదే కెఫిన్‌ను ఎక్కువగా తీసుకుంటే నిద్రలేమి సమస్యలకు దారితీస్తుంది. మంచి కొవ్వు పదార్ధాలు తీసుకుంటే మానసికంగా మరింత ఆరోగ్యంగా ఉంటారు. పాలు, పెరుగు, చీజ్, ఆమ్లా, అవకాడో, ఆలివ్ నూనె లాంటివి మీ ఆహారంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి.


Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×