Temple : గుడికి వెళ్లిన వారంతా దేవుడిని ప్రార్థించే సమయంలో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. కొంతమంది దేవుడి, దేవతల విగ్రహాలను తాకుతూ తమ మనసులో కోరికలు తీరాలని కోరుకుంటూ ఉంటారు.ఇలా ప్రదక్షిణలు చేసే సమయంలో గుడి వెనుక భాగాన్ని కూడా తాకి నమస్కరించుకుంటారు. కానీ శాస్త్రం ప్రకారం దేవాలయం వెనుక భాగాన్ని తాకరాదు అని చెబుతోంది.
దేవుడి విగ్రహం నుంచి భక్తి కిరణాలు నాలుగు దిక్కులా వ్యాప్తి చెందుతుంటాయి. అయితే గర్భ గుడి లో దగ్గర గా ఉండే వెనుక గోడకే మంత్ర శక్తి ఎక్కువగా వెళ్తుంది. అందుకే వెనకాల గోడ కు ఒక శిల్పాన్ని చెక్కుతారు. అందుకే కొంతమంది భక్తులు వెనక భాగం కూడా మొక్కుతారు. ఇలా మొక్కడం వల్ల మూల విరాట్టును తో పాటు దేవుడి విగ్రహాం నుంచి వచ్చే మంత్ర శక్తి కి కూడా పూజించినట్టు అవుతుందని అనుకుంటారు.దేవాలయం వెనుక భాగంలో రాక్షసులు కొలువై ఉంటారు. కాబట్టి ఆ భాగంలో మనం తాకితే రాక్షసులను నిద్రలేపినట్టు అవుతుంది. రాక్షసుల నెగిటివ్ వైబ్రేషన్స్ మనపై ఉండి గుడికి వెళ్ళిన పుణ్యం కన్నాసత్ఫలితాలను పొందలేక అనేక ఇబ్బందులు ఎదురవుతాయి.
మనలో చాలా మంది గుడికి వెళ్తుంటారు. అయితే తెలిసో తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అయితే గుడికి వెళ్లినప్పుడు కొన్ని నియమాలను తప్పక పాటించాలి. అలా చేస్తే దేవుని అనుగ్రహం మనపై ఉంటుంది. ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని చాలా మంది నమ్ముతారు. భగవంతుడిని తలచుకుంటే మనకు అపజయం అనేదే కలగదని చాలా మంది నమ్ముతారు.
గుడికి వెళ్ళిన పుణ్యఫలం దక్కుతుంది. అలాగే శివాలయంలో నందీశ్వరునికి స్వామివారికి మధ్యలో నిల్చొని చాలామంది నమస్కరించుకుంటారు. అయితే ఈ విధానం శాస్త్రం ప్రకారం సరైనది కాదు. భగవంతుడిలో కొన్ని వేల రెట్ల శక్తి తరంగాలు ఇమిడి ఉంటాయి. వీటిని భరించగల శక్తి మనలో ఉండదు.
దేవుడికి ఎదురుగా నిలబడకుండా పక్కకు నిలబడి నమస్కరించి, స్వామివారిని చూసి మనసులో నిలుపుకోవాలి. భగవంతున్ని నియమనిష్టలతో స్మరించుకోవాలి. అప్పుడే స్వామివారి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. భగవంతుని దర్శన భాగ్యం అయినందుకు సంతోషించి మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటే మనలోని సంకల్పాలు నెరవేరుతాయి.