Abraham Accords: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లెటెస్ట్‌గా ఒక పోస్ట్ పెట్టారు. ఇది నార్మల్ పోస్ట్ కాదు.. చాలా సుదీర్ఘమైన పోస్ట్. దీని సారాంశం ఏంటంటే.. అబ్రహం అకార్డ్స్ ఒప్పందంపై పాకిస్థాన్ సహా గల్ఫ్ దేశాలన్ని సంతకం చేయాలి. ట్రంప్ పోస్ట్ చాలా సుదీర్ఘంగా ఉందనే చెప్పాలి. సౌదీ అరేబియా, UAE, ఖతార్, టర్కీ, ఈజిప్టు, బహ్రెయిన్ అధినేతలతో పాటు.. పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపానని.. మిడిల్ ఈస్ట్ సమస్యలను తీరాలంటే మస్ట్ అండ్ షుడ్‌గా అబ్రహం అకార్డ్స్‌పై ఈ దేశాలన్ని ఏకకాలంలో సంతకాలు చేయాలంటూ ట్రంప్ డిమాండ్ చేశారు. సౌదీ, ఖతార్ వెంటనే సంతకాలు చేయాలని.. ఒకవేళ దేశాలు ఈ ఒప్పందంపై సంతకం చేయకపోతే.. ఆ దేశాలకు చెడు ఉద్దేశాలు ఉన్నట్లే భావించి.. ఆ దేశాలను దూరం పెడతామంటున్నారు ట్రంప్. ఇక్కడ ట్రంప్ చేసిన మరో కీ పాయింట్ ఏంటంటే.. ఇరాన్‌తో చర్చలు ముగిసిన తర్వాత.. ఆ దేశం కూడా అబ్రహం అకార్డ్స్‌లో చేరుతుందని చెప్పారు ట్రంప్.
అమెరికా అధ్యక్షుడు చేసిన ఈ ప్రపోజల్‌లో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి.. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్‌ను కాదని.. ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునీర్ పేరును ప్రస్తావించడం.. రెండోది.. పాకిస్థాన్‌ను కూడా ఈ ఒప్పందంపై సంతకం చేయాలని ఇన్‌డైరెక్ట్ వార్నింగ్ ఇవ్వడం.. బోనస్‌గా మరో విషయం ఏంటంటే.. ఈ పోస్ట్ వచ్చిన కాసేపటికే ఇరాన్‌పై అమెరికా దాడులు చేయడం. ఇప్పుడు ఒక్కొక్క విషయం గురించి చూద్దాం. దానికంటే ముందు అసలు అబ్రహం అకార్డ్స్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. అబ్రహం అకార్డ్స్ అనేది మిడిల్ ఈస్ట్ దేశాల మధ్య జరిగిన ఒప్పందం. నిజానికి దీనిని తెరపైకి తీసుకొచ్చింది అమెరికా. ఇజ్రాయెల్‌ను అరబ్ దేశాలకు దగ్గర చేసేందుకు చేసిన ప్రయత్నం ఇది. మాములుగా ఇజ్రాయెల్‌ను అరబ్, ముస్లిం దేశాలు ఒక స్వతంత్ర దేశంగా గుర్తించడం లేదు. కానీ ఈ ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్‌తో ముస్లిం దేశాలు దౌత్యపరమైన, ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలను నెలకొల్పుకునేలా చేయడం దీని ఉద్దేశం.
డైరెక్ట్‌గా చెప్పాలంటే ఇజ్రాయెల్‌తో అన్ని దేశాలకు సత్సంబంధాలను ఏర్పాటు చేయడం ఈ ఒప్పందం ఉద్దేశం. దీనిని 2020 సెప్టెంబర్‌లో అప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డోనాల్డ్ ట్రంప్ ప్రపోజ్ చేసి.. మధ్యవర్తిత్వం చేశారు. అప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్.. బహ్రెయిన్ మొదట చేరగా.. ఆ తర్వాత మొరాకో, సూడాన్ కూడా ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం వల్ల ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న శత్రుత్వం తగ్గి, ప్రత్యక్ష విమాన సర్వీసులు, వ్యాపారాలు, టూరిజం, సాంకేతిక రంగాలలో పెంచాలనేది లక్ష్యం. అయితే ఈ ఒప్పందానికి అప్పుడు, ఇప్పుడు ఇరాన్‌ను బూచీగా చూపించింది అమెరికా. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. పాలస్తీనా సమస్య పరిష్కారం కాకుండా ఇజ్రాయెల్‌తో సంబంధాలు పెట్టుకోవడంపై కొన్ని ముస్లిం దేశాలు, ముఖ్యంగా ఇరాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.. చేస్తున్నాయి. కానీ ఇరాన్‌ను తెర మీదకు తీసుకొచ్చి.. మీరు మా మాట వినకపోతే.. ఇరాన్ చేసే పనులనే మేం అడ్డుకోం అని సంకేతమిచ్చేలా ట్రంప్ వ్యవహరిస్తున్నారు.
Also Read: గంటకు రూ.4 ఖర్చుతో కూలింగ్.. మార్కెట్లోకి సరికొత్త ఏసీ.. ధర రూ.14,499 మాత్రమే!
ఇక పాకిస్థాన్ విషయానికి వద్దాం. అసలు పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉందని అమెరికా గుర్తించడం లేదని మరోసారి రుజువైంది. ఎందుకంటే పాకిస్థాన్ ప్రధానమంత్రితో కాకుండా.. ఆ దేశ ఆర్మీ చీఫ్‌తో అమెరికా మంతనాలు జరుపుతూ వస్తోంది. సో.. అక్కడున్న సైనిక వ్యవస్థకే అమెరికా ఇంపార్టెంట్స్ ఇస్తుందని ఇక్కడ క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది. నిజానికి మన దాయాది దేశంలో పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. పాక్ విదేశాంగ విధానం, భద్రతా నిర్ణయాల్లో పాక్ సైన్యం జోక్యం ఎక్కువగా ఉంటుంది. వీటన్నింటిని గుర్తించి కావాలనే అమెరికా ఈ తీరుగా వ్యవహరిస్తుందనే చర్చ ఉంది.
నెక్ట్స్.. పాకిస్థాన్‌ను ఈ ఒప్పందంలో చేరాలని ఒత్తిడి తీసుకురావడం వెనక కూడా అమెరికా వ్యూహం ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ చర్చలకు మధ్యవర్తిత్వం వహించే బాధ్యత పాకిస్థాన్ భుజానికెత్తుకుంది. ఇప్పటికే చర్చలు జరిపేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇటు ఇరాన్, అటు అమెరికా ఒత్తిడి కారనంగా అడకత్తెరలో పొక చెక్కలా మారింది పాకిస్థాన్ పరిస్థితి. ఇలాంటి సమయంలో అండగా ఉండాల్సింది పోయి.. మరింత ఇరుకున పెట్టేలా వ్యవహరించడం చూస్తుంటే.. పాకిస్థాన్‌ను అమెరికా ఎంత లైట్ తీసుకుందనేది అర్థమవుతోంది.
అబ్రహం అకార్డ్స్‌పై సంతకం చేసేది లేదని పాకిస్థాన్ ఇప్పటికే తేల్చి చెప్పింది. తమ విదేశాంగ విధానాలను మార్చుకునేది లేదని.. ఇజ్రాయెల్‌తో అధికారికంగా సంబంధాలను పునరుద్దరించుకునేది లేదని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తేల్చి చెప్పారు. మరి ఆయన మాటకు ఎంత విలువ ఉంటుందనేది ఇప్పుడు చూడాలి. ఎందుకంటే కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా ఉంది పాక్ పరిస్థితి. అధికారికంగా నో చెబితే ట్రంప్‌కు కోపం వస్తుంది.. అలాగని ఓకే చెబితే.. పాక్‌లోని మతపరమైన సంస్థల నుంచి ఆగ్రహం చవిచూడాల్సి వస్తుంది. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఇక ఆసీమ్ మునీర్ మాత్రం తన పేరును మెన్షన్ చేసినందుకు సంతోషించాలో.. లేక తనను అబ్రహం అకార్డ్స్ పేరుతో ఇరికించినందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితి.
Also Read: PAK VS AUS: బక్రీద్ పండగ…పాకిస్తాన్ జట్టుకు PCB బంపర్ ఆఫర్
ఓ వైపు శాంతి చర్చలు జరుగుతున్నాయి.. అటు అమెరికా.. ఇటు ఇరాన్ శాంతి చర్చలు సఫలమయ్యే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ప్రకటిస్తున్నాయి.. అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ఖతార్‌లో భేటీకి రెడీ అయిపోయారు.. ఇలాంటి సమయంలో ఇరాన్‌పై దాడులు చేసింది అమెరికన్ ఆర్మీ. సౌత్ ఇరాన్‌లోని మిసైల్ సెంటర్లు, నేవీ బేస్‌ను టార్గెట్ చేసుకొని విరుచుక పడింది. ఈ దాడులను అమెరికా సెంట్రల్ కమాండ్ కన్‌ఫామ్ కూడా చేసింది. మరి శాంతి ఏమైపోయినట్టు? చర్చలు జరిపి లాభం ఏంటి? అనేది ఇప్పుడు చర్చ. దాడులు చేయడానికి అమెరికా చెప్పిన కారణాలు.. ఆ ప్రాంతంలో ఉన్న తమ రెండు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లు, 12కు పైగా యుద్ధ నౌకలపై దాడులు జరగకుండా ముందు జాగ్రత్తగా దాడులు చేశామని చెబుతోంది అమెరికా. తాము సంయమనం పాటిస్తూపే తమ బలగాలను రక్షించుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఈ దాడులు జరిపామనేది అమెరికా ఇచ్చిన స్టేట్‌మెంట్.
అమెరికా స్టేట్‌మెంట్ ఇలా ఉన్నా.. ఈ దాడుల వెనక మరో కారణం కూడా ఉందనే చర్చ జరుగుతోంది. ఒక్కసారి డాట్స్‌ను క్లియర్ కనెక్ట్ చేస్తే కొన్ని విషయాలు అర్థమై అర్థం కానట్టు అనిపిస్తుంది. ముందుగా ఇరాన్‌పై అమెరికా దాడులు చేసింది. ఆ తర్వాత కాసేపటికే ట్రంప్ నుంచి అబ్రహం అకార్డ్స్‌కు సంబంధించిన స్టేట్‌మెంట్ రిలీజైంది. ఫర్ ఎగ్జాంపుల్.. ఇప్పుడు అమెరికా రీవెంజ్ తీర్చుకోవాలన్న.. ఈ దాడులకు కౌంటర్ ఇవ్వాలన్నా.. ఎవరిపై దాడులు చేస్తుంది? ఈ క్వశ్చన్‌కు ఆన్సర్ సింపుల్.. ఏదో ఒక గల్ఫ్ దేశం. సో.. ఈ దాడులు చేసింది అమెరికా అయినా.. నష్టపోయేది అయితే అమెరికా.. లేదంటే ఏదో ఒక గల్ఫ్ దేశం.
ఇలాంటి టైమ్‌లో అబ్రహం అకార్డ్స్‌ను తెరపైకి తీసుకొచ్చి మీరు అర్జెంట్‌గా సంతకాలు చేయండి.. మిగిలిన విషయాలు మేం చూసుకుంటాం అంటున్నారు ట్రంప్. అంతేకాదు సంతకాలు చేయకపోతే మీకు చెడు ఉద్దేశాలు ఉన్నాయని భావిస్తామని కూడా చెప్పేస్తున్నారు. సో.. అమెరికా చేసే పనులకు బలయ్యేది.. బాధ్యత వహించేది గల్ఫ్ దేశాలు మాత్రమే. దీని కోసం ఇరాన్‌ను బూచీగా చూపిస్తోంది అమెరికా. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరేలోపు పనిలో పనిగా అన్ని గల్ఫ్ దేశాలతో ఇజ్రాయెల్‌కు సత్సంబంధాలు ఏర్పాటు చేయాలని చూస్తోంది అమెరికా. దీని వల్ల ఇటు అమెరికా, ఇజ్రాయెల్‌కు భారీగా లబ్ధి చేకూరుతోంది. మరి ఇప్పుడు గల్ఫ్ దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.
Also read: కర్ణాటకలో కాంగ్రెస్ కుర్చీ పంచాయితీ.. సీఎం సీటు కోసం కుమ్ములాటలు!
అంతేకాదు ఇరాన్‌ను బూచీగా చూపించి ఇప్పుడు ప్రపంచంపై కంట్రోల్ సాధించే పనిలో ఉంది అమెరికా. అటు గల్ఫ్ దేశాలపై ఒత్తిడి తీసుకొచ్చినట్టే.. ఇన్‌డైరెక్ట్‌గా చైనా, భారత్‌లపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తోంది అమెరికా. హర్మూజ్ జలసంధి మూతపడటంతో ఇప్పుడు అత్యంత ప్రభావమయ్యే దేశాల్లో మొదటి రెండు స్థానాల్లో ఉన్నవి చైనా, భారత్ మాత్రమే. ఇప్పటికే ఈ రెండు దేశాల్లో ఈ యుద్ధం తాలూకు ప్రభావం కనిపిస్తూనే ఉంది. ఇప్పుటికే చైనాలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. భారత్‌లో ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికా పెద్దలు ఈ దేశాల్లో అడుగు పెట్టి చర్చలు జరుపుతున్నారు.
అంతర్జాతీయ పరిణామాల్లో ఏదీ అనుకోకుండా జరగదు. డొనాల్డ్ ట్రంప్ చైనాలో పర్యటించడం.. ఆ వెంటనే అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో భారత్‌లో పర్యటించడాన్ని సాధారణంగా చూడకూడదు. అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని.. కీలక ఒప్పందాలను కుదుర్చుకోవాలని చూస్తోంది అమెరికా. కానీ చైనా తలొగ్గలేదు.. భారత్ ఆచితూచి స్పందిస్తోంది. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదరకపోవడానికి మరో కారణం ఇరాన్ వద్ద ఉన్న యురేనియం. ప్రస్తుతం ఇరాన్ వద్ద 60 శాతం శుద్ధి చేసిన 440 కిలోల యురేనియం ఉండటం. దీనిని బేషరతుగా తమకు అప్పగించాలని అమెరికా చెబుతోంది.. ససేమీరా అంటోంది ఇరాన్. అయినా చర్చలు జరుగుతున్నాయి.. కాల్పుల విరమణ కొనసాగుతోంది.. కానీ దీనిని డిస్ట్రబ్ చేసేలా ఇప్పుడు అమెరికా తీవ్రమైన దాడులు చేసింది. అదే సమయంలో శాంతి ఒప్పందం కుదరాలంటే పాకిస్థాన్, సౌదీ, ఖతార్, టర్కీ ఇతర దేశాలు అబ్రహం అకార్డ్స్‌పై సంతకాలు పెట్టాలంటోంది. ఇరాన్‌తో యుద్ధం ఆగాలంటే ఇజ్రాయెల్‌తో చేతులు కలపాల్సిందే అనే తీరుగా ఉంది వ్యవహారం. ఏదేమైనా ఈ ఒప్పందం ఇప్పుడప్పుడే కుదరాలని అమెరికా అనుకోవడం లేదనే చర్చ అయితే జరుగుతోంది. మరి నెక్ట్స్ ఏం జరుగుతుందనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.
Also Read: శంషాబాద్‌లో రూ.1000 కోట్ల భూ స్కామ్.. ప్రభుత్వ పెద్దలపై హరీశ్ రావు సంచలన ఆరోపణలు!