E-Paper
Advertisement

ఆర్మీ ఆయుధాల కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్.. ఎలా దొంగతనం చేశాడంటే..

ఆర్మీ ఆయుధాల కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్.. ఎలా దొంగతనం చేశాడంటే..
Advertisement

Army Weapons Theft: సికింద్రాబాద్‌ బొల్లారం ఆర్మీ బెటాలియన్‌లో కలకలం రేపిన ఆయుధాల చోరీ కేసులో విచారణ వేగవంతమైంది. కేసులో ప్రధాన నిందితుడైన మాజీ హవల్దార్‌ మల్లేష్‌ను బొల్లారం పోలీసులు క్రైమ్‌ సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం సంఘటనా స్థలానికి తరలించనున్నారు. కోర్టు అనుమతితో మల్లేష్‌కు 10 రోజుల పోలీస్‌ కస్టడీ లభించగా, అక్టోబర్‌ 1 వరకు ఈ విచారణ కొనసాగనుంది. ప్రస్తుతం 6వ రోజు విచారణ జరుగుతుండగా, పోలీసుల ప్రశ్నలకు మల్లేష్‌ ఎక్కువగా మౌనంగానే ఉంటున్నట్లు తెలిసింది.

ఆర్మీ అధికారిపై కక్షతోనే ఆయుధాల చోరీ

Advertisement

ఒక ఆర్మీ ఉన్నతాధికారిపై పగ పెంచుకున్న మల్లేష్, గత ఆరు నెలలుగా పక్కా ప్రణాళిక రచించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇందులో భాగంగానే ఆగస్టు 27, 28, 29 తేదీల్లో రెజిమెంట్‌ వద్ద రెక్కీ నిర్వహించాడు. ఆగస్టు 30 రాత్రి నేరుగా రెజిమెంట్‌లోకి ప్రవేశించి, ఇనుపరాడ్డుతో రూమ్‌ తాళాలు పగులగొట్టాడు. అక్కడ ఉన్న ఏకే-203 రైఫిళ్లు, తుపాకులు, భారీగా మందుగుండు సామాగ్రిని చోరీ చేశాడు. ఈ క్రమంలో సెక్యూరిటీ గార్డు ప్రశ్నించగా.. తాను 20 మద్రాస్‌ రెజిమెంట్‌ కు చెందిన వాడినని నమ్మబలికి తప్పించుకున్నాడు.

అచ్చంపేటకు ఆయుధాల తరలింపు

Advertisement

చోరీ చేసిన ఆయుధాలను రెండు మూటలుగా కట్టి, తన స్కూటీపై సమీపంలోని గుడి వద్దకు తీసుకెళ్లి దాచాడు. ఆ తర్వాత అక్కడి నుంచి కారులో నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, ఆర్మీలో చేరడానికి ముందే మల్లేష్‌పై రెండు చోరీ కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం పోలీసులు ఆయుధాల రికవరీతో పాటు, అతడికి మరెవరైనా సహకరించారా అనే కోణంలో లోతుగా విచారిస్తున్నారు.

Also Read: తెలంగాణ జనసేనలో బిగ్ చేంజ్.. కొత్తగా చేరేవారికి పవన్ కళ్యాణ్ మాస్ కండిషన్స్!

Tags

Related News

తెలంగాణ జనసేనలో బిగ్ చేంజ్.. కొత్తగా చేరేవారికి పవన్ కళ్యాణ్ మాస్ కండిషన్స్!

చిక్కడపల్లిలో దారుణం.. భార్యను రోకలిబండతో బాది చంపిన భర్త!

నార్సింగిలో పట్టభద్రుల శంఖారావం.. ఓటరు నమోదు ప్రారంభించిన పొన్నం ప్రభాకర్!

హైదరాబాద్‌లో భారీ చీటీల మోసం.. రూ. 16 కోట్లతో కుటుంబం పరారీ!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. ఇకపై బదిలీల్లో కొత్త రూల్స్?

ఇంకో 20 ఏళ్లయినా బీఆర్ఎస్ అధికారంలోకి రాదు.. రాసి పెట్టుకో కేటీఆర్: అద్దంకి దయాకర్

మోదీ చేసే పనిలో 10% చేసినా కాంగ్రెస్ బతుకుతుంది- కిషన్ రెడ్డి

Big Stories

Advertisement
×