E-Paper
Advertisement

రోడ్డుపైకి బండి తీస్తున్నారా.. ఇక నుంచి బీకేర్ ఫుల్.. ఈ కొత్త కెమెరాలు చూస్తే చలాన్ పక్కా పడాల్సిందే!

రోడ్డుపైకి బండి తీస్తున్నారా.. ఇక నుంచి బీకేర్ ఫుల్.. ఈ కొత్త కెమెరాలు చూస్తే చలాన్ పక్కా పడాల్సిందే!
Advertisement

ANPR Cameras: రోడ్డుపై బండి తీస్తున్నారా? అయితే మీ వాహనానికి సంబంధించి పన్నులు సరిగ్గా ఉన్నాయో లేదో ఒక్కసారి సరిచూసుకోండి! ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కాలం చెల్లిపోయినా, పన్నులు ఎగవేసి రోడ్లపై తిరుగుతున్నా ఇకపై రవాణాశాఖ అధికారుల చేతికి దొరక్కపోయినా సాంకేతికతకు ఖచ్చితంగా చిక్కాల్సిందే. రవాణా నిబంధనల ఉల్లంఘనలకు చెక్ పెట్టేందుకు రవాణాశాఖ సంచలన నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం అత్యంత ఆధునికమైన ‘ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రెకగ్నిషన్’ టెక్నాలజీ ఆధారిత సిస్టమ్‌ను ప్రవేశపెట్టేందుకు ముమ్మర సన్నాహాలు చేస్తోంది.

 రవాణాశాఖ షాక్..

రాష్ట్రంలో చాలా వాహనదారులు ఏదో ఒక సమయంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఢిస్తూనే ఉన్నారు. వారికి జరిమానాలు సైతం ట్రాఫిక్ నిబంధనల మేరకు పడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ వాహనదారులు వాటిని చెల్లించకుండా తిరుగుతున్నారు. దీనికి తోడు వాహనాలకు సమయానికి చెల్లించాల్సిన పన్నులు, వాహన ఫిట్‌నెస్ పునరుద్ధరించకుండా రోడ్డెక్కే వాహనాలతో పాటు కమర్షియల్ వాహనాలకు రవాణాశాఖ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు మాన్యువల్‌గా లేదా కేవలం వేగం పరిమితి ఆధారంగా చలానాలు విధించే విధానానికి స్వస్తి చెప్పబోతుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రెకగ్నిషన్ (ఏఎన్పీఆర్) కెమెరాల వ్యవస్థను రంగంలోకి దించేందుకు ప్రణాళికలు వేస్తోంది. త్వరలోనే అమలు చేస్తే ప్రభుత్వానికి ఆదాయం సైతం సమకూరనుంది.

నంబర్ ప్లేట్ కనపడితే స్కాన్..

Advertisement

వాహనాలకు ఫిట్ నెస్, పన్నులు ఏది పెండింగ్ లో ఉన్నదని తెలుసుకునేందుకు అధికారులకు సైతం ఇబ్బందులు పడాల్సిన వస్తుంది. కొన్ని సమయాల్లో వాహనదారులు అతివేగతంతో అధికారులను, సిబ్బందిని ఢీకొట్టిన సందర్భాలు సైతం ఉన్నాయి. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు రవాణాశాఖ హైవేలు, టోల్‌ప్లాజాలు, చెక్‌పోస్టులు, నగరాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద అధునాతన ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రెకగ్నిషన్ (ఏఎన్పీఆర్) టెక్నాలజీని వాడబోతున్నట్లు సమాచారం. ఈ టెక్నాలజీతో వేగంగా వెళ్లే వాహనాల నంబర్ ప్లేట్లను కూడా ఈ కెమెరాలు మైక్రో సెకన్లలో క్యాప్చర్ చేస్తాయి. క్యాప్చర్ చేసిన నంబర్‌ను వెంటనే ‘వాహన్’పోర్టల్‌లోని రికార్డులతో సరిపోలుస్తాయి. ఆ సదరు వాహనానికి టాక్స్ చెల్లించకపోయినా, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ గడువు ముగిసినా, ఇన్సూరెన్స్ లేకపోయినా లేదా పాత చలానాలు పెండింగ్‌లో ఉన్నా సిస్టమ్ వెంటనే అధికారులకు సమాచారం అందిస్తుంది.అంతేకాదు సదరు వాహన యజమాని ఫోన్‌కు నేరుగా డిజిటల్ చలాన్ లేదా డిఫాల్ట్ నోటీసు వెళ్తుందని సమాచారం.

Also Read: రవితేజ ‘ఇరుముడి’ రివ్యూ.. అయ్యప్పమాల కలిసొచ్చిందా?

తొలుత కమర్షియల్ వాహనాలపైనే దృష్టి

Advertisement

ఈ నూతన టెక్నాలజీని దశలవారీగా అమలు చేయాలని రవాణాశాఖ భావిస్తోంది.తొలి విడుతగా లారీలు, బస్సులు, క్యాబ్‌లు, గూడ్స్ క్యారియర్లు వంటి కమర్షియల్ (వాణిజ్య) వాహనాలపై ప్రధానంగా నిఘా ఉంచనున్నారు. ఇవి తరచూ ఫిట్‌నెస్, త్రైమాసిక పన్నులు ఎగవేస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. అందుకే  ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రెకగ్నిషన్ (ఏఎన్పీఆర్) టెక్నాలజీని వాడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రెండో విడుతలలో సొంత వాహనాలు (ప్రైవేట్ కార్లు, ద్విచక్ర వాహనాలు)ఇతర నిబంధనల ఉల్లంఘనలపై.. హెల్మెట్, రాంగ్ రూట్ మొదలైనవి దృష్టి సారించనున్నట్లు సమాచారం.

 ట్రయల్ రన్?

ఈ సిస్టమ్ అమలుకు సంబంధించి రవాణాశాఖ అధికారులు ఇప్పటికే కొన్ని రద్దీ మార్గాల్లో  ట్రయల్ రన్ (ప్రయోగాత్మక తనిఖీలు) చేపట్టినట్లు సమాచారం. ఈ ట్రయల్స్‌లో వందలాది వాహనాలు ఫిట్‌నెస్, టాక్స్ లేకుండా తిరుగుతున్నట్లు సాంకేతిక ఆధారాలతో సహా నిరూపితమైనట్లు సమాచారం. దీంతో లోపాలు లేని ఆటోమేటిక్ చలాన్ , నోటీసుల జారీ వ్యవస్థను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ఇప్పటిక కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. త్వరలోనే  ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రెకగ్నిషన్ (ఏఎన్పీఆర్) టెక్నాలజీపై రవాణాశాఖ నుంచి అధికారిక ప్రణాళిక వెలువడనున్నట్లు సమాచారం. వాహనదారులు, ముఖ్యంగా రవాణా రంగ యజమానులు తమ వాహనాల పత్రాలను తక్షణమే పునరుద్ధరించుకోవాలని, లేనిపక్షంలో భారీ జరిమానాలు తప్పవని రవాణా అధికారులు హెచ్చరిస్తున్నారు.

Also Read: ఇంగ్లండ్ గ‌డ్డ‌పై పాకిస్తాన్ ను దెబ్బ‌కొట్టిన కోహ్లీ…RCB ప్లేయ‌ర్ వాడుకుని మ‌రీ

Tags

Related News

2022 ఆగస్టులో కొత్త పింఛన్లు పెంచిన కేసీఆర్.. సుధీర్ఘ కాలం తరువాత ఈ దసరాకు రేవంత్‌ సర్కార్‌..! 2.50లక్షల కొత్త ఫించన్లు..

తెలంగాణ కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవుల రచ్చ.. 15 నుండి 18 మందికి మళ్లీ ఛాన్స్?

వికారాబాద్ జిల్లాలో గుప్తనిధుల వేట.. మట్టి తవ్వుతుండగా ఊహించని ట్విస్ట్!

తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్.. నవంబర్ నుంచి పెరగనున్న కరెంట్ బిల్లులు!

ఏడాది సస్పెన్షన్‌ వేటు పడనుందా? ఎథిక్స్‌ కమిటీ నివేదిక ఏం కోరనుంది..? పాడికి వివరణ ఇచ్చేందుకు రేపే చివరి చాన్స్‌….!

ధర్మేంద్ర రాజీనామా విషయంలో ఒత్తిడి పెంచిన ఆర్ఎస్ఎస్ చీఫ్‌..! సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా అంశంలో వెనక్కి తగ్గొద్దనే కేంద్రానికి సూచన..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి.. ఈ నెలలోనే నోటిఫికేషన్ రానుందా.?

సెప్టెంబర్ 30న ఆల్ టైమ్ రికార్డ్.. విద్యుత్ వాడకంలో తెలంగాణ సరికొత్త చరిత్ర!

Big Stories

Advertisement
×