Warangal Congress Party Issue: వరంగల్ జిల్లాకు ఇప్పట్లో ఏ పదవులు లేనట్లేనా? … స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే ఆ జిల్లాకు పదవులు కేటాయిస్తారు? రాష్ట్రమంతా లోకల్ బాడీ ఎన్నికల లోపు పదవులు భర్తి చేసి.. అర్హులకు పదవులు కేటాయించాలని డిమాండ్ చేస్తుంటే ఆ జిల్లాకు మాత్రం ఎందుకు ఎన్నికల తర్వాత అంటున్నారు?.. అసలు ఓరుగల్లు కాంగ్రెస్‌లో ఈ పరిస్థితి ఎందుకు తలెత్తింది? జిల్లా నేతలే పదవుల పంపకాన్ని పెండింగ్లో పెట్టమని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు?
లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపు పదవులు భర్తీకి డిమాండ్
లోకల్ బాడీ ఎన్నికల లోపు రాష్ట్రంలో ఉన్న పెండింగ్ పదవులు, నామినేటెడ్ పోస్టులన్నీభర్తీ చేయాలని, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రాష్ట్రంలో అన్ని జిల్లాల కాంగ్రెస్ నేతలు హై కమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు మాత్రం పదవులు భర్తీ చేస్తేనే నష్టం అని హై కమాండ్‌కు స్పష్టం చేస్తున్నారంట. నిన్న గాంధీ భవన్ లో జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా సన్నాహక సమావేశం ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధ్యక్షత న జరిగింది..ఆ సమావేశంలో నేతలు ఇన్ఛార్జ్ ముందు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారంట.
పెండింగ్ పదవులు భర్తీ చేయాలని భావిస్తున్న టీ పీసీసీ
ఇప్పటికే అన్ని జిల్లాల్లో పదవుల భర్తీ ప్రక్రియను తెలంగాణ కాంగ్రెస్ వేగవంతం చేసింది. లోకల్ బాడీ ఎన్నికల్లోపే పెండింగ్ లో ఉన్న పదవులను భర్తీ చేయాలని టీ పీసీసీ భావిస్తోంది. ఈనేపధ్యంలో పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లు, నియోజకవర్గ అబర్జర్వర్ల తో పాటు వరంగల్ జిల్లాలోని ఉమ్మడి పది నియోజకవర్గాలకు సీనియర్లను ఇన్చార్జ్‌లుగా నియమించింది,
లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తే నష్టమంటున్న వరంగల్ నేతలు
ఇప్పటికే వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో గ్రూప్ తగాదాల రచ్చ పీక్స్ చేరిన నేపధ్యంలో ఆ జిల్లాలో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ కు డామేజ్ అవ్వడం ఖాయం అని నేతలు అంటున్నారు. దాంతో పాటు పీసీసీ కమిటీలు ప్రధాన కార్యదర్శులు, వైస్ ప్రెసిడెంట్ల పదవులలో వరంగల్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందన్న అభిప్రాయం ఉంది. పార్టీ పదవుల్లో సరైన ప్రాధాన్యత లేదని జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ అడ్లూరి లక్ష్మణ్ ముందు ఆవేదన వ్యక్తం చేశారంట. ఈ నేపధ్యంలో పదవుల భర్తీ ప్రక్రియకు సంబంధించి అభ్యర్ధుల లిస్ట్ పెండింగ్లో ఉంచాలని సూచించారట.
Also Read: అడ్డొస్తున్నాడని భర్తను లేపేసిన భార్య.. లవర్, కొడుకుతో కలిసి..
గ్రూప్ తగాదాలతో తలలు పట్టుకుంటున్న కాంగ్రెస్ హై కమాండ్
ఒక వైపు వరంగల్ జిల్లా లో జరుగుతున్న గ్రూప్ తగాదాలతో కాంగ్రెస్ హై కమాండ్ తల పట్టుకుంటుంది.. జిల్లా కాంగ్రెస్‌లో పరిస్థితి కొండా దంపతులు వర్సెస్ మిగిలిన మిగిలిన ఎమ్మెల్యేలు అన్నట్లు తయారైంది. ఆ క్రమంలో ఏ వర్గానికి పదవులు దక్కితే ఏమవుతుందో అని లోకల్ బాడీ ఎన్నికల తర్వాతనే జిల్లాలో పార్టీ పదవుల భర్తీ చేపట్టాలని నేతలు ట్విస్ట్ ఇస్తుండటంతో హై కమాండ్ నిర్ణయం ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది.
Story By Rami Reddy, Bigtv