Shopping Mall Fire: ఇరాక్‌లోని అల్ కుత్ సిటీలో హైపర్ షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 50 మంది మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. రాత్రి వేళ ఐదు అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత బిల్డింగ్ ను చుట్టుముట్టాయి.
ఇరాక్‌లోని అల్ కుత్ సిటీలోని ఓ షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఘటన సమయంలో షాపింగ్‌కు ఎక్కువ మంది వచ్చారు. ఈ ఘటనలో 50 మందికి పైగానే మృత్యువాత పడ్డారని, గాయపడిన బాధితులు ఎక్కువగా ఉంటారని అంచనా వేస్తున్నారు. బాగ్దాద్‌కు ఆగ్నేయానికి 160 కిలోమీటర్ల దూరంలో కుట్ సిటీలో ఉంది.
బుధవారం రాత్రి షాపింగ్ మాల్‌లో మంటలు మొదటి అంతస్తులో మొదలయ్యాయి. ఆ తర్వాత భవనాన్ని మంటలు చుట్టేశాయి. గురువారం తెల్లవారుజాము వరకు క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఆ మాల్ తెరిచి ఐదు రోజులు మాత్రమే అయిందని తెలుస్తోంది.
సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. దాదాపు ఆరుగంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి వచ్చాయి. మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ తప్పిపోయిన వ్యక్తుల కోసం సిబ్బంది వెతుకులాట మొదలుపెట్టారు. ఆసుపత్రి వెలుపల డజన్ల కొద్దీ కుటుంబాలు ఉన్నాయి.
ALSO READ: రష్యాతో దోస్తానా వద్దు.. ఇండియాకు నాటో వార్నింగ్
ఈ ఘటనలో తమవారు ఎవరైనా ఉన్నారా? అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కుత్ ప్రాంతంలో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉండడంతో చాలా కుటుంబాలు షాపింగ్‌కి వెళ్లాయి. ఈ క్రమంలో ఘటన జరిగిందని బాధితుల మాట. ఈ ఘటనలో ఐదుగురు కుటుంబ సభ్యులను కోల్పోయామని వారి బంధువులు చెబుతున్నారు.
రెండో అంతస్తులో ఎయిర్ కండిషనర్ పేలిందని, ఆ తర్వాత మంటలు చెలరేగాయని అంటున్నారు. దాని నుండి తప్పించు కోలేకపోయామన్నది కొందరి బాధితుల మాట. ఆ ప్రాంత గవర్నర్ మియాహి మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు. మాల్ యజమాని, కాంట్రాక్టర్‌పై చట్టపరమైన చర్యలు ప్రకటించారు.
ఆ దేశవ్యాప్తంగా షాపింగ్ మాల్స్‌లో భద్రతా ప్రమాణాలను అత్యవసరంగా సమీక్షించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రమాదానికి సంబంధించి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Read more: https://t.co/VcAgIAqPpX #AletihadNewsCenter #Iraq #fire #Kut #AlKut pic.twitter.com/2oTnP1gOsP
— Aletihad English (@AletihadEn) July 17, 2025