Big Stories

Guntur Assembly Constituency: గుంటూరు లో ఆధిక్యం ఎవరికి..? ట్రెండ్స్ ఎలా ఉన్నాయి..?

Guntur Assembly Election 2024: అమరావతి రాజధాని విస్తరించి ఉన్న గుంటూరు జిల్లా రాజకీయం రసవత్తరంగా తయారైంది. పోటీలో ఉన్న అభ్యర్ధులు తమదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎత్తులపై ఎత్తులతో అక్కడి పాలిటిక్స్ ఉత్కంఠభరితంగా మారాయి. తమకు అనుకూలమైన వర్గాలను మరింత ఆకట్టుకోవడానికి కేండెట్లు తెగ ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో వృత్తిపరంగా ఒక వర్గీయులు మాత్రం అభ్యర్థులంతా తమవారే ఎవరి పక్షాన నిలవాలి అని ఆలోచనలో పడ్డారంట. అసలు ఎవరా వర్గం..? అక్కడ నడుస్తున్న రాజకీయం ఏంటి..?

- Advertisement -

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. మొత్తం 17 నియోజకవర్గాల్లో అభ్యర్థులు తమ గెలుపు కోసం అహార్నిశలు కృషి చేస్తున్నారు. ప్రజలను ఆకట్టుకోవటానికి తమ పార్టీ మేనిఫెస్టోతో పాటు అనేక అంశాలు ప్రస్తావిస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అందులో భాగంగా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి తాము గెలిస్తే ఒనగూరే ప్రయోజనాలపై వివరిస్తున్నారు. జిల్లాలో మెడికల్ ఫీల్డ్‌కి చెందిన అభ్యర్ధులు పలువురు పోటీ పడుతున్నారు. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్ఆర్ఐ డాక్టర్ గుంటూరు వెస్ట్ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి వికాస్ హాస్పటల్స్ డైరెక్టర్.. గుంటూరు వెస్ట్ వైసీపీ కేండెట్ విడుదల రజినీ ప్రస్తుతం ఏపీ హెల్త్ మినిస్టర్ ..

- Advertisement -

చిలకలూరిపేట నుంచి షిఫ్ట్ అయి వచ్చిన మంత్రి రజనీ గుంటూరు వెస్ట్ అభ్యర్ధినిగా పోటీలో ఉండటంతో ఆ సెగ్మెంట్ అందరి ద‌ృష్టినీ ఆకర్షిస్తుంది.. వైద్య సేవలకు పెట్టింది పేరైన అక్కడ పోటీలో ఉన్న అభ్యర్ధులు ముగ్గురూ మెడికల్ ఫీల్డ్ కు సంబంధించిన వారు అవ్వడంతో ఆ రంగం వారు ఎవరివైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది.. ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులు ప్రకటించి యావత్తు దేశం దృష్టి తనవైపు తిప్పుకున్న పెమ్మసాని చంద్రశేఖర్ ప్రచారంలో స్పీడ్ పెంచుతున్నారు. డాక్టర్లతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రజల్లో ప్రచారం చేస్తున్న సమయంలో కూడా వైసీపీ ప్రభుత్వ విధానాలపై ఆయన అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు.

Also Read: పవన్ పదవిపై జోగయ్య జోస్యం..

తాను గుంటూరు ఎంపీగా గెలిస్తే తప్పకుండా డాక్టర్స్‌కు సంబంధించి సమస్యల పరిష్కారానికి పెమ్మసాని హామీ ఇచ్చారు. వికాస్ హాస్పిటల్ డైరెక్టర్ అయిన గల్లా మాధవికి కూడా మెడికల్ ఫీల్డ్‌లో విస్తృత పరిచయాలున్నాయి. ఆమె కూడా వైద్యులతో ప్రత్యేకంగా భేటీ అవుతూ టీడీపీకి అనుకూలంగా పనిచేయమని కోరుతున్నారు. ప్రస్తుతం ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న విడుదల రజనీ మెడికల్ ఫీల్డ్‌లో తనకున్న పరిచయాలను ఉపయోగించుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. వారందరితో రజనీ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి తనకు సహకరించాలని కోరుతున్నారు.

ఆ ముగ్గూరు తమ రంగానికి సంబంధించిన వారే కావడంతో ఎవరి వైపు నిలబడాలో తెలియక  వైద్యరంగ ప్రముఖులు ఆలోచనలో పడుతున్నారంట. ఇక జిల్లాలోని నరసరావుపేటు అసెంబ్లీ సెగ్మెంట్ బరిలో పోటీ పడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్ధులిద్దరూ డాక్టర్లే .. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రముఖ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరో సారి పోటీలో ఉన్నారు. అదేవిధంగా టిడిపి నుంచి బరిలో ఉన్న చదలవాడ అరవింద్‌బాబుకు వైద్యుడిగా నరసరావుపేటలో మంచి పేరుంది.

Also Read: YS Sharmila Vs YS Avinash: కడప కోటలో గెలిచేదెవరు.. అవినాష్ కు ఓటమి తప్పదా?

2019 ఎన్నికల్లో తొలిసారి ఎన్నికల బరిలో దిగిన డాక్టర్ చదలవాడ. వైసీపీ నుంచి పోటీ చేసిన సహచర డాక్టర్ గోపిరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన గోపిరెడ్డి శ్రీనివాస్ వైద్యుడిగా తనకున్న పరిచయాలతో ప్రచారం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో పరాజయం పాలైన చదలవాడకు ఈ సారి ఆ సానుభూతి పనిచేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి ఈ వైద్యరంగ ప్రముఖుల్లో ఎవరు ఓటరు నాడిని ఒడిసి పట్టుకుంటారో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News