BigTV English

Opposition MLAs Skip Oath: ఎన్నికల్లో అంతా మోసం.. ప్రమాణ స్వీకారం చేయడానికి మహారాష్ట్ర ప్రతిపక్ష ఎమ్మెల్యేల నిరాకరణ

Opposition MLAs Skip Oath: ఎన్నికల్లో అంతా మోసం.. ప్రమాణ స్వీకారం చేయడానికి మహారాష్ట్ర ప్రతిపక్ష ఎమ్మెల్యేల నిరాకరణ

Opposition MLAs Skip Oath| మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేల ఈ రోజు (శనివారం డిసెంబర్ 7, 2024) ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరుగనుంది. కానీ ప్రమాణ స్వీకారం చేయడానికి ప్రతిపక్ష మహావికాస్ అఘాడి కూటమికి చెందిన ఎమ్మెల్యేలు నిరాకరించారు.
ఎన్నికల్లో మోసం జరిగిందని.. ఈవిఎం ఓటింగ్ మెషీన్లు టాంపిరింగ్ చేసి మహాయుతి పార్టీలు మోసపూరితంగా విజయం సాధించారని ఆరోపణలు చేస్తూ.. తాము ఎన్నికల్లో నిరసనగా ప్రమాణా స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామని ఉద్ధవ్ శివసేన పార్టీకి చెందిన ఆదిత్య ఠాక్రే తెలిపారు.


“ఈ రోజు మా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయరు. మాకు ఈవిఎంలపై అనుమానాలున్నాయి. ఎన్నికల్లో జరిగిన మోసానికి నిరసనగా మేము ఈ రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థ హత్య చేస్తున్నారు.” అని ఆదిత్య ఠాక్రే అన్నారు.

మహారాష్ట్రలో శనివారం నుంచి మూడు రోజుల పాటు కొత్తగా ఏర్పడిన అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశంలో మొత్తం 288 మంది ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఇప్పటికే ప్రొటమ్ స్పీకర్ గా ఎమ్మెల్యే కాళిదాస్ కొలంబకర్ ని నియమించారు. మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ శుక్రవారం డిసెంబర్ 6, 2024న బిజేపీ సీనియర్ ఎమ్మెల్యే కొలంబకాని ప్రొటెమ్ స్పీకర్ నియమించారు. శనివారం ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ రాధాకృష్ణన్ ప్రసంగంతో ప్రారంభమవుతాయి. అసెంబ్లీ కొత్త స్పీకర్, కొత్త ప్రభుత్వం మెజారిటీ విశ్వాస పరీక్ష కూడా జరుగుతుంది. కొత్త స్పీకర్ చేత ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా జరుగుతుంది.


Also Read: హోమ్ మంత్రి పదవి కోసం షిండే డిమాండ్.. మహారాష్ట్ర రాజకీయాలలో మళ్లీ పేచీ

అయితే ఈ సమావేశాలను ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమిలోని కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్ధవ్ శివసేన పార్టీలక చెందిన ఎమ్మెల్యేలందరూ బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. “ఈ ఎన్నికల ఫలితాలు అనుమాస్పదంగా ఉన్నాయి. అసలు ఈ ఎన్నికల ప్రక్రియపైనే చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ప్రజలు సంతోషంగా లేదరు. ఏదో తప్పు జరిగింది.” అని కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ్ వాడెట్టివార్ ఆగ్రహంగా అన్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అనూహ్య విజయం సాధించింది. కూటమిలోని బిజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ.. ఈ మూడు పార్టీలు కూడా భారీ మెజారిటీతో గెలుపొందాయి. నవంబర్ 20న జరిగిన ఎన్నికల్లో మొత్తం 288 అసెంబ్లీ సీట్లకు గాను మహాయుతి కూటమి 230 సీట్లపై విజయం సాధించింది. ఇటీవలే మహాయుతి కూటమి తరపున బిజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

అయితే ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా రావడంపై మహావికాస్ అఘాడీ కూటమి నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల తరువాత కూడా నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ ఏర్పాటు కోసం మెజారిటీ ఎమ్మెల్యేల జాబితా ప్రకటించకుండానే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయడాన్ని ఆదిత్య ఠాక్రే తప్పుబట్టారు. నియమ నిబంధనలన్నీ ప్రతిపక్షాలకే వర్తిస్తాయా? అని నిలదీశారు.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×