BigTV English

Sajjala VS Vijay Sai Reddy: కేసుల్లో సజ్జల.. సంతోషంలో విజయసాయి రెడ్డి

Sajjala VS Vijay Sai Reddy: కేసుల్లో సజ్జల.. సంతోషంలో విజయసాయి రెడ్డి

అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు. ఎంతటివారికైనా ఇది వర్తిస్తుంది. వైసీపీ హయాంలో అన్నీ తానై వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి.. ప్రస్తుతం వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. గత ప్రభుత్వంలో సకలశాఖా మంత్రిగా వ్యవహరించిన సజ్జల.. పార్టీలో కొందరని ఎదగకుండా తొక్కేశారట. అదీ.. సొంత పార్టీలో చెందిన నేతను. దీంతో సదరు వ్యక్తి నాడు ఇబ్బంది పడినా.. ప్రస్తుతం వివాదాల్లో ఉన్న సజ్జలను చూసి.. ఆ వర్గం నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారట. ఇంతకీ ఎవరా నేత అనే కదా మీ క్వశ్చన్‌. అదేనండీ.. విజయసాయిరెడ్డి అట. జగన్ తర్వాత రెండో స్థానంలో ఉండి.. ఒకప్పుడు చక్రం తిప్పున సాయిరెడ్డి.. తర్వాత కాలంలో కాస్త ఇబ్బందిపడ్డారట. ప్రస్తుతం సీన్‌ రివర్స్‌ కావటంతో.. సాయిరెడ్డి వర్గీయలు హ్యాపీ మూడ్‌లో ఉన్నారనే వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి.

వైసీపీ హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి.. అన్ని కార్యక్రమాలనూ చక్కబెట్టారు. ఓ రకంగా చెప్పాలంటే నాటి సీఎం జగన్‌ తర్వాత అన్నీ ఆయనే అన్నట్లుగా పాలన సాగింది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దీంతో.. సజ్జల వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. నిజం చెప్పాలంటూ ప్రతి వివాదంలోనూ సజ్జల పేరు మార్మోగుతోంది. చివరికి…హీరోయిన్ జెట్వానీ కేసులలోనూ సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఆయనే వెనకుండి అన్నీ నడిపించారట. మరోవైపు తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి ఘటనలోనూ సజ్జల పేరు రావటంతో నాడు చక్రం తిప్పిన నేత కాస్తా.. చక్రవ్యూహంలో చిక్కుకున్నారనేది పొలిటికల్‌ టాక్‌.


Also Read:  అమ్మో దువ్వాడ.. మాధురి.. ఇంత స్కెచ్ వేశారా.. అంతా ప్లాన్ ప్రకారమేనా?

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వంలో జరిగిన స్కాములపై విచారణ చేస్తుంటే.. అన్నింటిలోనూ సజ్జల పాత్ర కనిపిస్తోందట. ఏ వివాదాన్ని వెతికినా ఆయన పేరే రావటంతో వైసీపీ శ్రేణులే ముక్కున వేలేసుకుంటున్నారట. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్ని స్కాముల్లోనూ.. వైసీపీ అధినేత జగన్‌తో పాటు సజ్జల పేరు తెరపైకి రావటంతో ఓహో ఇంత జరిగిందా అని జనాలు చర్చించుకుంటున్నారు. అధికారంలో ఉండగా సజ్జల రామకృష్ణారెడ్డి.. అన్నీ తానై వ్యవహరించారు. ఓ రకంగా చెప్పాలంటే పెత్తనం చెలాయించారు. జగన్ చుట్టూ కోటరీని ఏర్పాటు చేసి.. అంతకు ముందు జగన్‌కు సన్నిహితంగా ఉన్న వారిని కూడా దూరం చేసేశారట. పార్టీ స్థాపించక ముందు నుంచి జగన్‌ వెంట ఉన్న విజయసాయిరెడ్డిని కూడా తొక్కేసి అధికారమంతా తన చేతుల మీదుగా నడిపించారని సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారట. ఓ రకంగా సజ్జల తీరు వల్లే పార్టీ ఓటమి చెందిందనే వార్తలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.

మొదట్నుంచీ విజయసాయిరెడ్డి.. YS కుటుంబానికి విధేయుడిగా ఉండేవారట. గతంలో జగన్ తోపాటు కేసులు ఎధుర్కుని జైలుకు కూడా వెళ్లారు. నాడు జగన్ తర్వాత స్థానం ఎవరు అంటే.. విజయసాయిరెడ్డి పేరే వినిపించేదట. తర్వాతకాలంలో సజ్జల ఎంట్రీతో సీన్‌ పూర్తిగా మారిపోయిందని రాజకీయవర్గాలే చెబుతున్నాయి. నంబర్‌ టూ స్థానం కోసం అప్పటివరకూ ఉన్న విజయసాయిరెడ్డిని.. జగన్‌కు దూరం చేశారని.. ఇందులో సజ్జల రామకృష్ణారెడ్డిదే కీలకపాత్రనే వార్తలు వినిపిస్తున్నాయి. విజయసాయిరెడ్డిపై వచ్చిన అనేక ఆరోపణలకు సజ్జలే కారణమని ఆయన ప్రోద్భలంతోనే అన్నీ క్రియేట్ అయ్యాయని చర్చ కూడా సాగిందట. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి.. కొంతకాలంగా పార్టీలో క్రియాశీలకంగా లేకుండా పోయారనే వార్తలు వినిపించాయి. ముఖ్యంగా సాయిరెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జ్‌గా తప్పించడంలో సజ్జల పాత్ర ఉందని సొంత పార్టీలోనే చర్చించుకున్నారట.

ఒకప్పుడు ఉత్తరాంధ్రకు చెందిన పార్టీ వ్యవహారాలను దగ్గరుండి చూసుకునే విజయసాయిరెడ్డిని.. తొలుత అమరావతికి రప్పించటం సహా గత ఎన్నికల్లో నెల్లూరు నుంచి పోటీ చేయించటంతోనూ సజ్జల పాత్ర ఉందట. దీంతో ఆనాడు తమ నేతను తొక్కేసిన సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇప్పుడు.. వరుస వివాదాల్లో చిక్కుకోవటంతో సాయిరెడ్డి వర్గీయలు పండుగ చేసుకుంటున్నారని టాక్ నడుస్తోంది. ఓ రకంగా చెప్పాలంటూ సజ్జలకు తిక్కకుదిరందని.. సాయిరెడ్డి అనుచరులు చెప్పుకుంటున్నారట.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×