E-Paper
Advertisement

పుష్కరకాలంలో యువత యూటర్న్‌..! మోడీ అప్పుడు కొత్త ఓటర్ల పాలిట హీరో..! అందుకే నెత్తినెత్తుకున్నారు.. ఇప్పుడెందుకు వైఖరి మారింది? సీఎస్‌డీఎస్‌ ఆసక్తికర విశ్లేషణ..!

పుష్కరకాలంలో యువత యూటర్న్‌..! మోడీ అప్పుడు కొత్త ఓటర్ల పాలిట హీరో..! అందుకే నెత్తినెత్తుకున్నారు.. ఇప్పుడెందుకు వైఖరి మారింది? సీఎస్‌డీఎస్‌ ఆసక్తికర విశ్లేషణ..!
Advertisement

పన్నెండేళ్ల కిందట కొత్త తరానికి మోడీ ఓ హీరో. యువతకు రోల్ మోడల్‌. బీజేపీని అక్కున చేర్చుకోవాలి.. మోడీ ప్రధాని కావాలి..! ఇదే వారికి బలమైన సంకల్పంగా ఉండేది. అందుకే రెండు టర్ములు కొత్తగా వచ్చిన తమ ఓటు హక్కును బీజేపీకి వేసి.. తమ ఆకాంక్షలను నెరవేర్చుకున్నారు. మోడీని ప్రధానిగా తమ సంకల్పబలం గట్టిదని నిరూపించుకున్నారు. ఇది పన్నెండ్ల కిందటి ముచ్చట. మరి ఇప్పుడేమైంది…? మోడీ అంటే మొహం మొత్తిందా? ఆయన హీరో నుంచి విలన్‌గా మారిపోయాడా? ఎందుకు? ఇప్పుడొచ్చే తరం అసలు ఆయనకు ఓటేయడానికి ఇష్టపడటం లేదా? యువతను ఆకట్టుకోవడం ఇప్పుడు మోడీ, బీజేపీ ముందున్న ఓ అగ్ని పరీక్షేనా? అవుననే అంటున్నాయి పలు ప్రముఖ పరిశోధనా సంస్థలు.

CSDS అంటే సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్. ఇది భారతదేశంలోని ప్రఖ్యాత సామాజిక, రాజకీయ పరిశోధనా సంస్థ. ముఖ్యంగా ఎన్నికల విశ్లేషణలు, ప్రజల అభిప్రాయాలు, ‘లోక్‌నీతి’ సర్వేల ద్వారా దేశవ్యాప్తంగా ఓటర్ల నాడిని శాస్త్రీయంగా అంచనా వేయడంలో దీనికి గొప్ప గుర్తింపు ఉంది. ప్రస్తుతం జరుగుతున్న జెన్‌జీ ఆందోళన, తాజాగా కాక్రోచులు తీసుకున్న సీఈసీ రాజీనామా అంశం పై సీఎస్డీఎస్ ప్రొఫెసర్, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు సంజయ్ కుమార్ వ్యక్తంచేసిన విశ్లేషణ ఆసక్తిరేకెత్తిస్తున్నది.

Advertisement

ఒకప్పుడు యువత ఆందోళన చేస్తుదంటే అది కేవలం ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు, పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణ.. ఇవే అంశాలు ప్రధానంగా ఉండేవి. కానీ ఇప్పుడు యువత ఆలోచన మారింది. కేవలం ఉద్యోగాలే కాదు.. ఓటర్ల జాబితా రూపకల్పన, ఎన్నికల సంఘం పనితీరు, ప్రజాస్వామ్య వ్యవస్థల పారదర్శకతపై కూడా నిలదీసేందుకు ముందుకు వస్తున్నారని సంజయ్‌ కుమార్‌ విశ్లేషించారు.

దీన్నేదో రాజకీయ డ్రామాగానో.. ఇతర ప్రతిపక్షాల ప్రేరేపిత చర్యగానో చూసి లైట్‌ తీసుకుంటే మొదటికే మోసం వస్తుందంటున్నారాయన. నిజంగా ఇది వారిలో వచ్చిన చైతన్యంతో పాటు.. పాలకుల మీద పేరుకుపోయిన ఓ అసంతృప్తికి చిహ్నంగా కూడా చూడాల్సి ఉంటుందంటున్నారు. యువత చేసే ప్రతి నిరసన వెనుక ఓ రాజకీయ పార్టీ ఉందని .. కొట్టిపారేసే రాజకీయాలు నేల విడిచి సాము చేస్తున్నట్టేననే విశ్లేషణ చేస్తున్నారాయన.

Advertisement

ఫీల్డు లెవల్లో పెరుగుతున్న నిరుద్యోగం, భవిష్యత్తుపై ఉన్న ఆందోళన వల్ల .. అప్పటికే పెరిగిపోతున్న అసంతృప్తి మరింతగా రాజుకుని ఆందోళనల రూపం దాల్చుతున్నదనేదే వాస్తవమన్నారు ఆయన. దీన్ని రాజకీయ కోణంలో కాకుండా వ్యవస్థాగత లోపంగా గుర్తించడమే సరైన విధానమంటున్నారు. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ గెలుపులో యువ ఓటర్లు అత్యంత కీలక పాత్ర పోషించారు. తమకు వచ్చిన మొదటి సారి ఓటు హక్కును బీజేపీకి వేయడం ద్వారా తమ సంకల్పం నెరవేరుతుందనే భావోద్వేగం ఆ రోజుల్లో ఉండేదనే అభిప్రాయాలున్నాయి.

అయితే అవే భావోద్వేగ అంశాలు వారిని ఎల్లకాలం కట్టేయలేవని, బీజేపీ, మోడీ సైతం ఇదే విధానంతో వారిని ఇంకా ఇంకా ఆకట్టుకునేందుకు చేసే ప్రయత్నాలు కూడా చెల్లుబాటు కావని క్లియర్‌గా తేలిపోయిందంటున్నారు. నిరసనలు తెలపడం ద్వారా, దీనికి నైతిక బలం చేకూరి, సోషల్ మీడియా తమకు అండగా ఉన్నదనే మనోధైర్యం కూడా తోడై.. భవిష్యత్‌ను తీర్చి దిద్దుకునే వ్యూహంలో యువత తలమునకలై ఉన్నదని తేటతెల్లమవుతోంది.

రానున్న రోజుల్లో తిరిగి ఇదే యువతను తమ వైపు తిప్పుకోవడం ప్రధాని మోడీకి పెద్ద పరీక్షేనని, బీజేపీ వ్యూహాలు ఇందులో ఎంత మేర సక్సెస్ అవుతాయో చెప్పలేమనే నెగిటివ్‌ భావనలే వ్యక్తమవుతున్నాయంటున్నాయి ఈ విశ్లేషణలు. ఓటు హక్కు కోల్పోవడం వల్ల తమకు రావాల్సిన ప్రభుత్వ పథకాలు, సంక్షేమం దూరమవుతున్నదనే భావన కూడా ప్రజల్లో బలంగా వెళ్లిపోవడం ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పట్ల పూర్తి నెగెటివ్‌ దోరణి వచ్చి పడిందంటున్నారు.

Tags

Related News

బీజేపీలో బతుకమ్మ రాజకీయ మంటలు.. మరోసారి భగ్గుమన్న నేతల ఆధిపత్య పోరు!

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోరుకు సీపీఎం పార్టీ సై.. ఈ జిల్లాలపై స్పెషల్ ఫోకస్!

నంబర్ ప్లేట్లు లేని కార్లతో ఆర్టీఓ అధికారుల తనిఖీలు.. దీనికి మతలబేంటో..?

ఉద్యమాల ఆయువుపట్టు మీద పాలకుడి దాడి! ప్రశ్నించే గొంతులకు వేదిక లేకుండా చేసే కుయుక్తులు..! ధర్నాచౌక్‌లకు తాళాలేయడం.. రోగానికి మందు కాదు..!

మీ ఉరిలో భూమి రీ-సర్వే ఎప్పుడు జరుగుతుందో తెలుసా.. పూర్తి షెడ్యుల్ ఇదే?

హస్తిన పోరులో తెలంగాణ కీ రోల్‌! రేవంత్‌పై భారీ నమ్మకం పెట్టుకున్న ఏఐసీసీ! ఢిల్లీ పోరులో టీ కాంగ్రెస్‌ హవా!

తమిళనాడు టూర్‌లో మోడీ, విజయ్‌ల ఎడముఖం పెడముఖం! పరువు పోకుండా మోడీ తండ్లాట..! మౌనంగా ఉంటూ ఇమేజీని డ్యామేజీ చేసేలా విజయ్‌..!

Big Stories

Advertisement
×