E-Paper
Advertisement

రెండు ఎకరాలంటూ పృథ్వీరాజ్ సెటైర్లు.. కాస్ట్ ఈవెంట్‌లో నవ్వులే నవ్వులు!

రెండు ఎకరాలంటూ పృథ్వీరాజ్ సెటైర్లు.. కాస్ట్ ఈవెంట్‌లో నవ్వులే నవ్వులు!
Advertisement

Prudhvi Raj:పృథ్వీరాజ్.. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ వెండితెరపై ఈయన చేసే హంగామా అంతా ఇంతా కాదు.అలాంటి పృధ్వీ తాజాగా ‘కాస్ట్’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొని మరోసారి తనదైన శైలిలో కామెడీ పండించారు. ఈ క్రమంలోనే నిర్మాత లక్ష్మీ కోటేశ్వరరావు తనకు రెండు ఎకరాల భూమి ఇస్తానని చెప్పిన మాటల్ని గుర్తు చేస్తూ చేసిన కామెంట్స్ వేదికపై నవ్వులు పూయించాయి.

ఈ సందర్భంగా పృధ్వీ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో మీడియా చాలా ముఖ్యమని, ముఖ్యంగా ఏ సినిమా అయినా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలంటే మీడియానే కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.ఇక ఇదే ఈవెంట్ లో పాల్గొన్న దర్శకుడు శివ నిర్వాణ గురించి మాట్లాడుతూ అతని దర్శకత్వంలో వచ్చిన నిన్ను కోరి అనే సినిమా కెరీర్ లో ఎప్పటికి గుర్తు ఉండిపోయే సినిమా అని ,ముఖ్యంగా అమెరికాలో మురళి శర్మతో కలిసి నటించడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని తెలిపాడు.

Advertisement

ఇక కాస్ట్ సినిమానిర్మాత లక్ష్మీ కోటేశ్వరరావు గురించి పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ ఈవెంట్ లో హైలెట్ అయ్యాయి. సినిమాలో సర్దార్జీ పాత్రకు సంబంధించిన రెమ్యునరేషన్ విషయం మాట్లాడుతున్నప్పుడు నిర్మాత తనకు రెండు ఎకరాల భూమి ఇస్తానని చెప్పడంతో అది విన్న వెంటనే తాను ఆశ్చర్యపోయానని పృథ్వీరాజ్ నవ్వుతూ గుర్తుచేసుకున్నారు. నిర్మాతలను ఇబ్బంది పెట్టే నటుడిగా తనపై సోషల్ మీడియాలో ప్రచారం జరిగే అవకాశం ఉందని సరదాగా అనుకున్నానని చెప్పారు. అయితే ఆ తర్వాత నిర్మాత భోజన ఏర్పాట్లు చూసి ఆయన మనసు ఎంత పెద్దదో అర్థమైందని చెప్పుకొచ్చారు.

భోజనం విషయంలోనూ లక్ష్మీ కోటేశ్వరరావు ఎంతో ఆప్యాయత చూపించారని, తనకు కావాల్సినవి అడగమనిచెప్పిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు.ఇక సినిమా విడుదలైన తర్వాత రెండు ఎకరాల భూమి ఇస్తానని నిర్మాత చెప్పిన విషయాన్ని చెబుతూ ఈ మాటలకు మీడియా ఒక ఎవిడెన్స్ గా నిలవాలని వేదికపై నవ్వులు పూయించారు.

Advertisement

ఇక హీరో గగన్ విహార్ గురించి మాట్లాడుతూ షూటింగ్ సమయంలో భోజన ఏర్పాట్ల విషయంలో ఆయన చూపించిన చొరవకి పృథ్వీరాజ్ ప్రశంసలు కురిపించారు.. సినిమా విజయం సాధించాలంటే తెరపై కనిపించే హీరో, దర్శకుడు మాత్రమే కాకుండా తెరవెనుక పనిచేసే ప్రతి ఒక్కరి కృషి అవసరమని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

ఇక ‘పొలిమేర’ సినిమాలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సత్యం రాజేష్ గురించి కూడా పృథ్వీరాజ్ ఆసక్తికరంగా మాట్లాడారు. ఒకప్పుడు సత్యం రాజేష్‌ను కామెడీ పాత్రలతో గుర్తుపట్టే ప్రేక్షకులు, ఇప్పుడు ‘పొలిమేర’ పేరు చెప్పగానే ఆయనను గుర్తుచేసుకునే స్థాయికి వచ్చారని సరదాగా అన్నారు.

ఇక ఈ సినిమాలో నటించిన రవి, వరుణ్ సందేశ్, విట్టల్ మహేష్ తదితరుల గురించి మాట్లాడుతూ అందరికీ తనతో మంచి కెమిస్ట్రీ కుదిరందని చెప్పుకొచ్చారు. ఇక దర్శకుడు తనని ముక్కు పిండి మరీ నటింప చేయించాడని,అదొక దాసరికే సొంతం అని తన అనుభవాన్ని తెలిపాడు.

చివరగా ‘కాస్ట్’ సినిమా సక్సెస్ అవ్వాలని అందుకు లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని, నిర్మాతకు మంచి లాభాలు రావాలని, దర్శకుడికి మరిన్ని అవకాశాలు దక్కాలని కోరుకున్నారు. చూడాలి మరి రెండెకరాలు అంటూ సరదాగా చేసిన కామెంట్స్ ని నిర్మాత నిజం చేస్తాడేమో !

ALSO READ :జిమ్ జిమ్ తార ఫీవర్.. చిన్న పాటతో ఇంత పెద్ద సంచలనమా?

Tags

Related News

హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న శ్రీకాంత్ కుమార్తె మేధా… పూర్తి డీటెయిల్స్ ఇవే!

లోకేష్ కనగరాజ్ అల్లు అర్జున్ సినిమాపై బిగ్ అప్డేట్.. ఆ వార్తలకు చెక్ పెట్టారుగా!

స్నిగ్ధ లెస్బియనా కాదా? చివరకు అసలు విషయం చెప్పేసిందిగా!

బాలయ్య ఇల్లు కూల్చివేత.. ఎన్టీఆర్ జ్ఞాపకాలు కనుమరుగు

నేను బ్రతికున్నంత వరకు నీ ఆత్మ నరకం అనుభవించాలి – తనుశ్రీ

పెళ్లి వద్దు.. పిల్లలు ముద్దు.. నరేష్ ఊహించని కామెంట్!

చిరంజీవి మూవీని వదులుకున్న బాలయ్య కూతురు!

Big Stories

Advertisement
×