Pavani – Amir:బిగ్ బాస్ (Bigg Boss) రియాల్టీ షో ద్వారా ప్రేమించుకొని, ఇటీవల ఏడడుగులు వేసిన జంట అమీర్ (Amir ) – పావని రెడ్డి (Pavani Reddy). బిగ్ బాస్ ద్వారా ప్రేమలో పడిన వీరు ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కారు. అయితే ఇలా బిగ్ బాస్ ద్వారా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వారిలో ఈ జంట మొదటిది. కానీ ఈ బిగ్ బాస్ ద్వారా ఇప్పటికే ఆరవ్ – ఓవియా, కవిన్ – లాస్లియా, శివాని – బాలాజీ మురగదాస్, మహత్ – యాషికా ఇలా పలువురు బిగ్ బాస్ ప్రేమికులు చాలామంది ఉన్నప్పటికీ.. వారిలో ప్రేమ విజయవంతమై వివాహం చేసుకున్న జంట అమీర్ – పావని అనే చెప్పాలి. వీరిద్దరూ బిగ్ బాస్ తమిళ్ సీజన్ 5 లో పాల్గొన్నప్పుడే ప్రేమలో పడ్డారు. ఇకపోతే గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న వీరు ఏప్రిల్ 20న చెన్నైలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి బిగ్ బాస్ ప్రముఖులు రాజు, సిబి, ప్రియాంక దేశ్ పాండే, మధుమితతో పాటు పలువురు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అమీర్ – పావని పెళ్లి చెల్లదంటూ కామెంట్లు చేసిన సినీ జర్నలిస్ట్..
ఇకపోతే పావని రెడ్డి మొదటి భర్త పెళ్లి అయిన కొన్ని నెలల్లోనే ఆత్మహత్య చేసుకోవడంతో ఒంటరి అయిన ఆమె కొన్నాళ్లు అలాగే జీవితాన్ని కొనసాగించింది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత అమీర్ తో ప్రేమలో పడి ఇప్పుడు ఆ ప్రేమను పెళ్లిగా మార్చుకుంది. ఇకపోతే అమీర్ ముస్లిం వర్గానికి చెందినవారు కాగా, పావని హిందువు. వీరిద్దరూ ఇప్పుడు మతాంతర వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహం చెల్లదని ప్రముఖ సినీ జర్నలిస్టు బైల్వాన్ రంగనాథన్ ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ముఖ్యంగా వీరిద్దరూ మతాంతర వివాహం చేసుకున్నారని, కాబట్టి వీరి వివాహాన్ని రిజిస్టర్ చేయించుకోలేరని, దాంతో వీరి వివాహం చెల్లదు అంటూ ఆయన ఆసక్తికర కామెంట్లు చేశారు. ఇక ఆయన మాట్లాడిన ఇంటర్వ్యూ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఇది ప్రభుత్వం వరకు చేరింది. ఎట్టకేలకు స్పందించిన తమిళనాడు ప్రభుత్వం దీనిపై వివరణ కూడా ఇచ్చింది.
క్లారిటీ ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వం..
ఇకపోతే సినీ జర్నలిస్టు ఇచ్చిన స్టేట్మెంట్ వీడియో వైరల్ అవ్వడంతో దీనిపై తమిళనాడు ప్రభుత్వ వాస్తవ తనిఖీ బృందం వివరణ ఇచ్చింది. రెండు వేరువేరు మతాలవారు వివాహం చేసుకోవడానికి ప్రత్యేక వివాహ చట్టం కింద అనుమతి ఉంది. దానిలోని నిబంధనల ప్రకారం రెండు వేరువేరు మతాలవారైనా చట్టపరంగా వివాహాన్ని రిజిస్టర్ చేయించుకోవచ్చు అని స్పష్టం చేసింది. అసలే మతాంతర గొడవలు జరుగుతున్న వేళ ఇప్పుడు ఇలాంటి వాగ్వాదానికి దారితీసింది అమీర్ , పావని రెడ్డిల పెళ్లి. ఇక దీంతో ఈ వివాదం మరింత ముదిరే లోపే ప్రభుత్వమే స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. ఏది ఏమైనా వీరి పెళ్లి చెల్లదు అంటూ వస్తున్న వార్తలకు ప్రభుత్వం చెక్ పెట్టింది అని చెప్పవచ్చు.పావని విషయానికి వస్తే 2021 బిగ్బాస్ తమిళ్ సీజన్ 5 లో పాల్గొని రెండవ రన్నరప్ గా నిలిచింది. 2001లో హిందీ సినిమా ‘లాగిన్’ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆమె వజ్రం, 465 ,సేనాపతి, మళ్ళీ మొదలైంది లాంటి చిత్రాలలో నటించి ఆకట్టుకుంది.
ALSO READ:Balakrishna Akanda 2: ఖండాలు దాటుతున్న అఖండ 2.. శివతాండవమేనా..?