BigTV English

Dal Lake: పహెల్గామ్‌ ఎఫెక్ట్‌.. వెలవెలబోతున్న దాల్‌ సరస్సు

Dal Lake: పహెల్గామ్‌ ఎఫెక్ట్‌.. వెలవెలబోతున్న దాల్‌ సరస్సు

Dal Lake: ఒకప్పుడు పర్యాటకులతో సందడి చేసిన దాల్ సరస్సు. ప్రస్తుతం.. వెల వెల పోతోంది. ప్రస్తుతం అక్కడి పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. బాధితులు.. కేవలం పర్యాటకులు మాత్రమే కాదు మేము కూడా అంటూ వీరు అత్యంత దీనంగా రోదిస్తున్నారు. ఇంతకీ ఏమిటా దాల్ లేక్ ప్రత్యేకత. ప్రస్తుతం అక్కడ నెలకొని ఉన్న దయనీయత ఎలాంటిది? హ్యావే లుక్..


అమర్నాథ్ యాత్రికులకు సేవలందించి ఉపాధిభారత్ శిఖరాయమానం కశ్మీరం అయితే.. అందులో శోభాయమానం దాల్ సరస్సు. కశ్మీర్ ని భూతల స్వర్గం అని ఎందుకంటారో దాల్ లేక్ ని చూస్తే తెలుస్తుంది. ఇది జమ్మూ కశ్మీర్ లోనే రెండవ అతి పెద్ద సరస్సు కాగా.. దీన్ని ఫ్లవర్స్ లేక్, శ్రీనగర్ జ్యువెల్ అని కూడా పిలుస్తారు.

సుమారు పది మైళ్ల మేర విస్తరించిన ఈ సరస్సు శీతాకాలంలో మైనస్ 11 సెల్సియస్ కి టెంపరేచర్ పడిపోతుంది. అంతే కాదు ఈ సమయంలో దాల్ లేక్ గడ్డకట్టి పోతుంది కూడా. దాల్ సరస్సు తూర్పున ఉన్న ఇసాబర్ అనే గ్రామంలో దుర్గాదేవి నివాసంగా భావిస్తారు. అంతే కాదు దాల్ సరస్సు మొఘలుల కాలంలో వేసవి విడిదిగా భావించబడేది. దీంతో మొఘలులు ఈ ప్రాంతాన్ని మొఘలాయీ ప్రత్యేక తోటలు, మంటపాల నిర్మాణంతో అత్యంత ఆహ్లాదకరంగా మార్చారు.. అందుకే దాల్ సరసుకు వేసవి కాలంలో పర్యాటకులు పోటెత్తుంటారు.


దాల్ సరస్సు వార్షిక టర్నోవర్ సుమారు 171 కోట్లు. కొన్ని వందల మంది ఇక్కడకి వచ్చే పర్యాటకుల ద్వారా తమ తమ జీవనోపాధిని పొందుతుంటారు స్థానిక కాశ్మీరీలు. ఈ సరస్సు ప్రత్యేకతను ఉపాధి అవకాశాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1100 కోట్ల రూపాయలతో పునర్నిర్మాణ చర్యలు చేపట్టింది.

ఇది కేవలం భూతల స్వర్గం మాత్రమే కాదు ఎందరో కశ్మీరీలకు బువ్వ పెట్టే ప్రాంతం కూడా. అంతటి పర్యాటక స్వర్గధామం నేడు బోసి పోయి కనిపిస్తోంది. ఇక్కడి బోటు నిర్వాహకులు.. యునైటెడ్ అగైనెస్ట్ టెర్రర్ అనే నినాదంతో మౌనంగానే తమ నిరసన ప్రదర్శిస్తూ కనిపించారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు వీరి పట్ల తమ సానుభూతి తెలియ చేస్తున్నారు.

కేవలం వీరు మాత్రమే కాదు కశ్మీర్ వ్యాప్తంగా ఎందరో వ్యాపారుల ప్రధాన ఆదాయ వనరు.. పర్యాటకమే. పర్యాటం లేకుంటే వారి జీవితాల్లో దరిద్రం విలయ తాండవం చేస్తుంది. ఇప్పుడే కాదు ఎప్పుడూ వీరు పర్యాటకులను తమ ప్రత్యక్ష దైవాలుగా భావిస్తుంటారు. ఎన్నేసి మతాల గోడలు అడ్డున్నా సరే వీరు అమర్నాథ్ యాత్రికులను తమ అతిథులుగా భావించి వారికి సేవలందిస్తూ ఉపాధి పొందుతుంటారు. ఒకే ఒక్క దుర్ఘటన ద్వారా ప్రస్తుతం కశ్మీర్ వ్యాప్తంగా ఇలాంటి వాతావరణమే నెలకొని కనిపిస్తోంది.

Also Read: పాకిస్థాన్ మిస్సైల్ టెస్ట్.. భారత్ అలర్ట్.. ఏ క్షణంలోనైనా..

ఇదిలా ఉంటే..  పహల్గాం ఉగ్రదాడితో గతంలో ఎన్నడూ లేని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది భారత్. ఓ వైపు పాకిస్థాన్‌ను అష్టదిగ్భందనం చేస్తూనే మరోవైపు దాయాదిని ప్రపంచం ముందు ఒంటిరిని చేస్తే ప్రయత్నం చేస్తోంది. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాటు బుధవారం పలు ఆంక్షలను విధించింది. అయితే.. అక్కడితో ఆగకుండా నిన్న కూడా పాక్ ను ఆంక్షల వలయంలోని నెట్టేసింది కేంద్రం ప్రభుత్వం. ఉగ్రమూకలకు ఆశ్రయమిస్తున్న పాకిస్థాన్‌కు అందిస్తున్న అన్ని రకాల వీసా సేవలను నిలిపేసింది. ఆ దేశ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. పాకిస్థాన్‌కు చెందిన ఎక్స్‌ ఖాతాలను నిలిపేసింది. పలు కారణాలతో పాక్ వెళ్లిన భారతీయులు వెంటనే తిరిగిరావాలని ఆదేశించింది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×