BigTV English
Advertisement

Bigg Boss 8 Telugu : హౌస్ లోకి మరో వైల్డ్ కార్డు ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ మామా..

Bigg Boss 8 Telugu : హౌస్ లోకి మరో వైల్డ్ కార్డు ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ మామా..

Bigg Boss 8 Telugu : బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 మొదట్లో డల్ గా ఉందని రెండు వారాల క్రితం వైల్డ్ కార్డు ద్వారా ఏకంగా 8 మందిని దించారు. అయినా ఇప్పుడు మళ్లీ డల్ అయ్యిందనే టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో ఈరోజు ఎపిసోడ్ లో ఒక ఎలిమినేషన్ తో పాటుగా వైల్డ్ కార్డు ఎంట్రీ ఉందని తెలుస్తుంది. అలాగే ఆదిత్యా ఓం రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ ను వైల్డ్ కార్డు ద్వారా దింపడానికి సన్నాహాలు చేస్తున్నారు బిగ్ బాస్.. ఇప్పుడు హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరు బాగానే ఆకట్టుకుంటున్నారు. కానీ కొత్తగా మరొకరిని బిగ్ బాస్ ఎందుకు దించుతున్నాడో అర్థం కాలేదు.. ఇదంతా పక్కన పెడితే హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న ఆ మాజీ కంటెస్టెంట్ ఎవరా అనే ఆసక్తిగా మారింది. అతనేవ్వరో ఒకసారి తెలుసుకుందాం..


ఈ షో డల్‌ గా ఉన్న నేపథ్యంలో నిర్వాహకులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. షోకి హైప్‌ తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం ఎప్పుడూ లేని విధంగా ఎనిమిది మంది మాజీ కంటెస్టెంట్లని వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ చేయించారు. అయినా షోకి హైప్‌ రావడం లేదు. అనుకున్నంత టీఆర్‌పీ రేటింగ్‌ రావడం లేదు.. అనుకున్న రీచ్ అవ్వలేదని మరో స్టార్ ను దింపేందుకు రెడీ అవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఐదో వారంలో వైల్డ్ కార్డ్ ద్వారా మరో 8 మంది కంటెస్టెంట్లని తీసుకొచ్చారు. అవినాష్‌, గంగవ్వ, హరితేజ, టేస్టీ తేజ, నయని పావని, గౌతమ్‌, మెహబూబ్‌ వచ్చారు. వీళ్ల రాకతో అయినా షో క్రేజ్ పెరుగుతుందని అనుకున్నారు. మొదటి రెండు రోజులు బాగానే పోటీ ఇచ్చిన హౌస్ మేట్స్ ఇప్పుడు డల్ అయ్యారు. నామీనేషన్ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. తప్ప కంటెంట్ ఇవ్వలేదు.

ఇక టీఆర్పీ కోసం హౌస్ లోకి కొత్తగా మరో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ ను దించబోతున్నట్లు తెలుస్తుంది. ఐదో సీజన్‌ విన్నర్‌ వీజే సన్నీ రాబోతున్నారనే వార్త ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. షో ని రక్తికట్టించడం కోసం క్రేజీ కంటెస్టెంట్‌గా దించే ప్లాన్‌ జరుగుతుందనే వార్తలు వచ్చాయి. అతన్ని బిగ్ బాస్ నిర్వాహకులు కలిసి మాట్లాడారట. అందుకు సన్ని కూడా ఒప్పుకోవడంతో ఈ వీక్ లోనే సర్ ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ లో బిగ్ బాస్ ఉన్నారట. ఆ సీజన్ లో టాస్క్ ల విషయంలో, గేమ్‌ల్లో, నామినేషన్స్ లో ఆయన రెచ్చిపోయిన తీరు వేరే లెవల్‌. షోకి ఆ టైమ్‌లో హైప్‌ రావడంలో వీజే సన్నీ పాత్ర చాలా ఉందని చెప్పొచ్చు.. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాక సన్ని ఎలాంటి క్రేజ్ ను అందుకున్నాడో తెలిసిందే.. వరుస సినిమాల తో ఫుల్ బిజీగా ఉన్నాడు. అతని క్రేజ్ ను క్యాష్ చేసుకుందామని బిగ్ బాస్ ప్లాన్. మరి ఎప్పుడు ఎంట్రీనో తెలియాల్సి ఉంది..


Tags

Related News

Bigg Boss 9 Madhuri: వాళ్లు రెమ్యునరేషన్‌ ఇచ్చేదేంటి.. నాకే నెలకు కోటి వస్తుంది.. దివ్వెల మాధురి

Bigg Boss 9 Promo: కెప్టెన్సీ వార్‌.. హీటెక్కిన ఆరేంజ్‌ టీం డిస్కషన్‌, తగ్గేదే లే అంటున్న గౌరవ్!

Bigg Boss 9 Promo: సీక్రెట్ టాస్క్.. అడ్డంగా బుక్కైన ఇమ్మూ !

Bigg Boss 9 Telugu : దారుణంగా పడిపోయిన బిగ్ బాస్ ఓటింగ్ రిజల్ట్.. అతనే విన్నర్..?

Bigg Boss Telugu 9 : ఇమ్మూ బట్టతలపై బిగ్ బాస్ పంచులు… ఈ గుడ్డులో గోల ఏందయ్యా మాకు ?

Bigg Boss 9 : ఈ సీజన్ లో అలాంటి వాడు లేడు, కెప్టెన్ కి ఇచ్చి పడేసాడు 

Bigg Boss 9 Telugu Day 59 : దెయ్యాల వేట – రీతూ ఆట… హౌస్ మేట్స్ కన్నింగ్ ప్లాన్ కు డెమోన్ బలి… గౌరవ్ పై నోరు పారేసుకున్న దివ్య

Bigg Boss 9 Promo: ముద్దుబిడ్డకే చెమటలు పట్టించిన బిగ్ బాస్.. రెచ్చిపోయిన రీతూ!

Big Stories

×