BB 8 Telugu Promo: తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి బిగ్ బాస్ నిర్వహకులు తెగ కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు తెలుగులో ఏడు సీజన్లు పూర్తి కాగా.. ఒక ఓటీటీ వెర్షన్ కూడా పూర్తి అయింది. ఇక ఎనిమిదవ సీజన్ 10వ వారానికి చేరుకుంది. ఈ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా హరితేజ ఆదివారం ఎలిమినేట్ కాబోతోంది అని సమాచారం. ఇకపోతే తాజాగా నామినేషన్స్ లోకి వచ్చిన వారిలో శుక్రవారం తో పోలింగ్ పూర్తి కాగా.. హరితేజ లీస్టులో ఉందని, ఈసారి ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని చాలా వరకు కన్ఫర్మ్ అయ్యింది అని సమాచారం.
ఇకపోతే ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్స్ లేకపోయినా గంగవ్వ తన ఆరోగ్యం సహకరించడం లేదని నాగార్జునను వేడుకుంది. ఈ నేపథ్యంలోనే నాగార్జున నేరుగా గంగవ్వ ను ఎలిమినేట్ చేసి నిన్నటి ఎపిసోడ్లో పంపించేశారు. ఇక ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ తో మంచి ఎంటర్టైన్మెంట్ పంచడానికి బిగ్ బాస్ తెగ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే వీకెండ్స్ అంటే ఎంటర్టైన్మెంట్. శనివారం పూర్తి కావడంతో ఆదివారం ఎపిసోడ్ కు సంబంధించి తాజా ప్రోమోని విడుదల చేశారు నిర్వాహకులు. ఇక ఈ ప్రోమోలో కంటెస్టెంట్స్ అందరూ జంబలకడిపంబ లాగా మారిపోయారు.
అబ్బాయిలు అమ్మాయిల గెటప్ లో , అమ్మాయిలు అబ్బాయిల గెటప్ లో కనిపించి అందరిని ఆకట్టుకున్నారు. ఇక్కడ గౌతమ్, నబీల్ లేడీ గెటప్స్ మాత్రం అందరిని ఆకట్టుకుంటున్నాయి. వీరిద్దరి స్టైలిష్ లుక్ చూసి ఫిదా అయిపోయి.. నిజంగా అమ్మాయిలేనా అనే భ్రమ కలిగించారు. వీరందరి గెటప్స్ చూసి నాగార్జున ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ.. ” విష్ణు ప్రియ, పృథ్వీ తో ఉన్నప్పుడు ఎలా యాక్ట్ చేస్తుంది.” అనే విషయాన్ని చేసి మరీ చూపించాలని కోరాడు. విష్ణు ప్రియా గెటప్ లో ముక్కు అవినాష్.. పృథ్వీ గెటప్ లో విష్ణు ప్రియ తమ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశారు.
ఆ తర్వాత యష్మీ గెటప్ వేసుకున్న నిఖిల్.. బయట తన గర్ల్ ఫ్రెండ్ ఉందనే విషయాన్ని బయట పెట్టేశారు. ఇక యష్మి చేసే ఓవరాక్షన్ ను నిఖిల్ చాలా అద్భుతంగా చూపించాడని నాగార్జున మెచ్చుకున్నారు. ఆ తర్వాత గౌతమ్ ని చూస్తూ రోహిణి ఎలా బిహేవ్ చేస్తుంది అనే విషయాన్నీ కూడా చేసి చూపించమని అడిగారు నాగార్జున. ఇలా ఒకరికొకరు గెటప్ లు మార్చుకొని.. వారి గెటప్ లో ఉన్నప్పుడు హౌస్ లో ఎలా ప్రవర్తించారు అనే విషయాలను చూపించాలి అంటూ అడిగారు నాగార్జున. ఇక కంటెస్టెంట్స్ కూడా అటు నాగార్జునను మెప్పించడానికి.. ఇటు అభిమానులలో ఓటింగ్ పెంచుకోవడానికి బాగానే కష్టపడ్డారని చెప్పవచ్చు. మొత్తానికి అయితే కంటెస్టెంట్స్ అందరూ కూడా తమ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను విపరీతంగా మెప్పించారు. ఈరోజు టీఆర్పీ రేటింగ్ పెరగడం కూడా ఖాయం అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.