BigTV English

BB Telugu 8 : కన్నడ బ్యాచ్ ముసుగు తీసిన గౌతమ్.. తెలుగు ఆడియన్స్ లో పెరుగుతున్న కసి..!

BB Telugu 8 : కన్నడ బ్యాచ్ ముసుగు తీసిన గౌతమ్.. తెలుగు ఆడియన్స్ లో పెరుగుతున్న కసి..!

BB Telugu 8 : తెలుగులో రియాల్టీ షో గా వచ్చిన బిగ్ బాస్ (Bigg Boss) షో ఇప్పటికే 7 సీజన్లు పూర్తి చేసుకుంది. నిజానికి ప్రతి బిగ్ బాస్ సీజన్ కి టైటిల్ విన్నర్ ఎవరో ముందుగానే తెలిసిపోతుంది. ఆ తర్వాత సోషల్ మీడియా పోల్స్ ద్వారా క్లారిటీ వచ్చేస్తుంది. అయితే ఈ సీజన్ 8 లో మాత్రం ఎవరు విన్నర్ అవుతున్నారు అనేది చెప్పడం దాదాపు 11వ వారం వచ్చినా కూడా కష్టమవుతోంది. నిజంగా కంటెస్టెంట్ లు ఏ రేంజ్ లో టైటిల్ కోసం పోటీ పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే మొదటి వారం నుండి నిఖిల్ టాప్‌లో కొనసాగుతూ ప్రేక్షకుల మన్ననలు పొందారు. అయితే ఇతడికి పోటీగా నబీల్ వచ్చారు. ఇక టైటిల్ విన్నర్ కోసం పోటీ వీళ్లిద్దరి మధ్యలోనే ఉంటుందని అందరూ అనుకోగా.. మధ్యలో నాగ మణికంఠ సింపథీ ప్లే చేసి టైటిల్ కొట్టే ప్రయత్నాలు కూడా చేశారు. కానీ అనూహ్యంగా సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకొని నాగ మణికంఠ వెళ్లిపోయారు.


అయితే ఇదంతా చూస్తుంటే బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీస్ కి ముందు.. వైల్డ్ కార్డు ఎంట్రీస్ తర్వాత అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఒకవేళ వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ హౌస్ లోకి రాకపోయి ఉండి అంటే, ఈ సీజన్ అతిపెద్ద డిజాస్టర్ అయ్యుండేదనడంలో సందేహం లేదు. ఇకపోతే వైల్డ్ కార్డు ఎంట్రీస్ పర్ఫామెన్స్ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది నిజం అని చెప్పాలి. ఇకపోతే అవినాష్, టేస్టీ తేజ, రోహిణి వంటి వారు వచ్చిన తర్వాత హౌస్ లో బోలెడంత ఎంటర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. ముఖ్యంగా వీళ్ళ కోసం చూస్తున్న వారి సంఖ్య కూడా పెరిగిపోయింది.

ఇకపోతే గత సీజన్లో 13 వారాలు హౌస్‌లో కొనసాగిన గౌతమ్ కృష్ణ ఈ సీజన్లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి, గేమ్ మొత్తాన్ని ఒక్కసారిగా మార్చేసారు. ముఖ్యంగా మణికంఠ మీద యష్మీ, ప్రేరణ, పృథ్వీ, నిఖిల్ (కన్నడ బ్యాచ్) వంటి వారు చీటికీ , మాటికీ అరుస్తూ అతడి పట్ల చాలా పొగరుగా ప్రవర్తించడం వంటివి చూసినప్పటి నుంచి సోషల్ మీడియాలో కన్నడ బ్యాచ్ మన తెలుగు కంటెస్టెంట్ ను టార్గెట్ చేసి మరీ టార్చర్ చేస్తున్నారు. అనే వాదన చాలా బలంగా వినిపించింది. ఇక వీరిందరి అంతు చూడడానికే హౌస్ లోకి వచ్చాడేమో గౌతమ్ అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఒక్కొక్కరి ముసుగు బయటకు తీసేశారు. ముందుగా రేలంగి మామయ్యలా ఎంతో సౌమ్యంగా వ్యవహరించిన నిఖిల్ ముసుగు కూడా గౌతమ్ వల్లే తొలగిపోయింది ముఖ్యంగా నిఖిల్ ప్రవర్తనను బయటపెట్టి అతడి నిజస్వరూపాన్ని ఆడియన్స్ కి చూపించారు.


అలాగే యష్మీ ను కూడా గౌతమ్ అడ్డంగా బుక్ చేశాడు. ముఖ్యంగా ఆమెను అక్క అని సంబోధిస్తూ.. ఆమె నిజ స్వరూపాన్ని బయటపెట్టారు. ఇక అలాగే పృథ్వీ, ప్రేరణల ముసుగులు కూడా బయటికి తీసి తెలుగు ఆడియన్స్ కి చూపించారు. ఇకపోతే నిన్న మొన్నటి వరకు కన్నడ బ్యాచ్ టైటిల్ ఫేవరెట్ గా నిలిచారు అంటూ వార్తలు వినిపించగా.. రంగంలోకి దిగిన గౌతమ్ కన్నడ బ్యాచ్ ముసుగు మొత్తాన్ని తీసేసి వారి నిజ స్వరూపాన్ని చూపించారు. ఇది చూసిన తర్వాత తెలుగు ఆడియన్స్ లో కూడా మన తెలుగువారిని గెలిపించుకోవాలనే తపన, కసి ఎక్కువైపోయింది. ఇక గౌతమ్ కారణంగా తెలుగు ఆడియన్స్ లో తెలుగు కంటెస్టెంట్స్ పై మక్కువ పెరిగి తెలుగు వారే టైటిల్ విన్నర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related News

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Big Stories

×