Bigg Boss. లిమిట్ లెస్ ఎంటర్టైన్మెంట్ అంటూ బిగ్ బాస్ సీజన్ 8 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందులో భాగంగానే నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టగా , అందులో నలుగురు ఎలిమినేట్ అయ్యారు. ఇదిలా ఉండగా గత వారం క్రిందటే హౌస్ లోకి ఏకంగా 12 వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఉంటాయని, అయితే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్టు ఛాలెంజ్ లో భాగంగా 12 ఛాలెంజ్ లను హౌస్ లో ఉన్న టీం గెలిచిందంటే, ఆ 12 వైల్డ్ కార్డు ఎంట్రీస్ ను ఆపవచ్చు అంటూ బిగ్ బాస్ తెలిపాడు. దీంతో ఎంతో కష్టపడి ఆరు ఛాలెంజ్లను గెలిచారు. మరి ఆ ఆరుగురు మాత్రమే హౌస్ లోకి అడుగు పెడతారా? అనే కామెంట్లు వ్యక్తం అవుతుండగా.. లేదు 12 మంది హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని, తాజాగా ఈరోజు విడుదలైన ప్రోమోలో మణికంఠ తెలియజేశారు.
వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆరోజే..
ఇదిలా ఉండగా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఎవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు..? ఎవరెవరు వస్తారు..? ఎప్పుడు వస్తారు..? అనే విషయాలేవీ కూడా ఆడియన్స్ కి తెలియవనే చెప్పాలి. అయితే తాజాగా స్టార్ మా బిగ్ బాస్ నిర్వహకులు వైల్డ్ కార్డు ఎంట్రీ కి సంబంధించిన ఒక చిన్న వీడియోని విడుదల చేశారు. ఇక అందులో వైల్డ్ కార్డు ఎంట్రీ ఎప్పుడు ఉండబోతుందనే విషయాన్ని హోస్ట్ నాగార్జున రివీల్ చేశారు. ఆ వీడియో విషయానికి వస్తే.. హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ.. ఈ వారం వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 లో ఆదివారం వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుంది. గుర్తు పెట్టుకోండి ఫన్ కి లిమిటే లేదు అంటూ.. ఆదివారం అనగా అక్టోబర్ 6వ తేదీన సాయంత్రం 7:00 గంటలకు స్టార్ మా లో ప్రసారమయ్యే బిగ్ బాస్ షోలో వైల్డ్ కార్డు ఎంట్రీస్ రాబోతున్నాయని ప్రోమోతో సహా వెల్లడించారు బిగ్ బాస్. బిగ్ బాస్ రీలోడ్ ఈవెంట్ అంటూ వచ్చిన ఈ వీడియో వైరల్ గా మారుతోంది.
వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేది వీరేనా..
ఇదిలా ఉండగా వారం క్రిందటే హౌస్ లోకి 12 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని , బిగ్ బాస్ ప్రకటించినప్పటి నుంచి కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్ లిస్ట్ ఇదే అంటూ ఒక లిస్టు వైరల్ అవుతోంది.. ఆ లిస్టు విషయానికి వస్తే యాంకర్ రవి, గంగవ్వ, గౌతమ్, టేస్టీ తేజ, శోభా శెట్టి, నయనీపావని , హరితేజ, రోహిణి , అవినాష్ ఇలా వీరి పేర్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ వీరే గనుక హౌస్ లోకి అడుగు పెట్టారంటే ఇక షో రేటింగ్ జెడ్ స్పీడ్ లో దూసుకుపోతుందనడంలో సందేహం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram