BigTV English

Bigg Boss 8 Day 32 Promo 1: చీఫ్ కోసం మళ్ళీ ఫైట్.. ఆమె కల నెరవేరిందా..?

Bigg Boss 8 Day 32 Promo 1: చీఫ్ కోసం మళ్ళీ ఫైట్.. ఆమె కల నెరవేరిందా..?

Bigg Boss 8 Day 32 Promo1.. బుల్లితెర ఆడియన్స్ కు ఎప్పటికప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి బిగ్ బాస్ ఎప్పుడు ముందుంటుంది అనడంలో సందేహం లేదు. ఇప్పటికే 7 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఎనిమిదవ సీజన్ కూడా మొదలైంది. అప్పుడే నాలుగు వారాలు పూర్తి కాగా ఐదో వారం కూడా చివరి దశకు చేరుకోబోతోంది. ఇదిలా ఉండగా ఈ వారం ఈ హౌస్ కి చీఫ్ గా ఎవరు నిలబడతారు అనే విషయంపై కంటెస్టెంట్స్ మధ్య పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పదిమంది హౌస్ లో ఉన్నారు. వారిలో ఎవరు ఈసారి చీఫ్ గా ఉండబోతున్నారు అనే విషయంపై కంటెస్టెంట్స్ మధ్య టఫ్ ఫైట్ జరిగిందని చెప్పవచ్చు.


కల నెరవేర్చుకున్న ప్రేరణ..

ఇకపోతే గత నాలుగు వారాలుగా తన ఆట తీరుతో మాట తీరుతో ఆడియన్స్ హృదయాలను దోచుకుంటున్న ప్రముఖ కంటెస్టెంట్ ప్రేరణ.. చీఫ్ అవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి.. దాదాపు ఎంతో కష్టపడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా చీఫ్ అవడం కోసం మూడవ వారంలో ఏకంగా దెబ్బలు తాకినా ఏ గేమ్ లో కూడా గివ్ అప్ ఇవ్వలేదు. తన కష్టంతో చీఫ్ అవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఇక అందులో భాగంగానే తాజాగా బిగ్ బాస్ ఇచ్చిన గేమ్ లో తన ఆట తీరుతో కుటుంబ సభ్యుల మనసు దోచుకున్న ప్రేరణ ఇంటికి కొత్త చీఫ్ గా ఎన్నికయింది.


ఇంటికి కొత్త చీఫ్ గా ప్రేరణ..

ఇకపోతే కొత్త చీఫ్ అవ్వడం కోసం ఇంటిలో ఉన్న పదిమంది కూడా దాదాపుగా పోటీ పడ్డారని చెప్పాలి. చివరిగా నిఖిల్, నబీల్, ప్రేరణ, ఆదిత్య నిలిచారు. ప్రతి గేమ్ లో కూడా నేను విన్ అవుతాను.. గెలిచేస్తాను అని ఎప్పుడు చెప్పను. కానీ నా సాయశక్తుల పోరాడుతాను. చీఫ్ గా ఈసారి నాకు అవకాశం ఇవ్వండి. కచ్చితంగా నేను చేసి చూపిస్తాను అంటూ కోరింది. దీంతో ఆదిత్య, ప్రేరణ లలో నైనిక ప్రేరణకు ఓటు వేసింది. ఆ తర్వాత నిఖిల్, ప్రేరణ స్టేజ్ పైకి రాగా.. ఆ తర్వాత ఆదిత్య ప్రేరణకు సపోర్టు చేశారు. ఇక చివరిగా నబీల్, ప్రేరణ నిలబడగా.. ఇద్దరిలో ఎవరో ఒకరిని చీఫ్ గా ఇంటికి నియమించండి అని కుటుంబ సభ్యులకు చెప్పారు బిగ్ బాస్ . దీంతో ఆదిత్య మాట్లాడుతూ.. ఈ క్లాన్ కి ఈ హౌస్ కి ఒక ఫిమేల్ లీడర్ ని చూడాలని ఉంది. గత రెండు వారాల నుంచి నేను ప్రేరణను అబ్జర్వ్ చేస్తున్నాను. ఆ లీడర్షిప్ కోసం ఉన్న ఆమె పోరాటం , ఆమె కష్టపడే తత్వాన్ని నేను ప్రేరణలో చూశాను. అందుకే నేను ప్రేరణ చీఫ్ గా ఉండాలని అనుకుంటున్నాను అని తెలిపారు. అలా మొత్తానికైతే ప్రేరణ తన కల నెరవేర్చుకొని.. ఇంటికి చీఫ్ గా ఎన్నికయింది ప్రేరణ.

Related News

Bigg Boss 9 Promo: మైండ్ దొబ్బిందా.. రీతూకి హోస్ట్ స్ట్రాంగ్ కౌంటర్!

Bigg Boss 9 Promo : భరణి గెట్ అవుట్ ఫ్రం హౌస్… హీటెక్కిన వీకెండ్ ఎపిసోడ్

Bigg Boss 9: సుమన్ శెట్టి ఫైర్, కొత్త కెప్టెన్ గా కామనర్, హౌస్ మేట్స్ పై రెచ్చిపోయిన తనూజ

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

Bigg Boss 9 New Captain: భరణికి చెక్ పెట్టిన కళ్యాణ్.. హౌజ్‌ కొత్త కెప్టెన్‌ అతడే!

Bigg Boss 9 Promo: అదిరిపోయిన కెప్టెన్సీ టాస్క్.. అతి నమ్మకం పనికిరాదు పాపా!

Bigg Boss 9 Promo: పొట్టిగా ఉండడం ఆయన చేసిన తప్పా.. ఏంటమ్మా ఫ్లోరా?

BB 9 Wild Card: వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్న కాంట్రవర్సీ క్వీన్.. రచ్చ మాములుగా ఉండదు మరి..!

Big Stories

×