BigTV English

Bigg Boss 8 Day 45 Promo 1: లేడీ కంటెస్టెంట్స్ కి గోల్డెన్ ఆఫర్ ఇచ్చిన మణికంఠ.. ఏడిపించిన విష్ణు.. నవ్వించిన రోహిణి..!

Bigg Boss 8 Day 45 Promo 1: లేడీ కంటెస్టెంట్స్ కి గోల్డెన్ ఆఫర్ ఇచ్చిన మణికంఠ.. ఏడిపించిన విష్ణు.. నవ్వించిన రోహిణి..!

Bigg Boss 8 Day 45 Promo 1.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఏడవ వారం మొదలైంది.. అప్పుడే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తయిన నేపథ్యంలో మెగా చీఫ్ కంటెండర్ కోసం కంటెస్టెంట్స్ పోటీ పడుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా నామినేషన్ వాడి వేడి నుంచి ఇప్పుడే బయటపడ్డ కంటెస్టెంట్స్ కాస్త మస్తీ చేశారని చెప్పాలి. అందులో భాగంగానే ఈరోజు ఎపిసోడ్లో టాస్కులు కాస్త కొద్దిసేపు పక్కన పెట్టి , కామెడీలు చేస్తూ కంటెస్టెంట్స్ అందరూ చిల్ అయ్యారు. మరి తాజాగా విడుదలైన ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.


గంగవ్వను ఏడిపించిన విష్ణు ప్రియ..

ప్రోమో విషయానికొస్తే గార్డెన్ ఏరియాలో గంగవ్వ, అవినాష్ , పృథ్వీ , విష్ణుప్రియ ముచ్చట్లు పెట్టారు.. అందులో భాగంగానే.. గంగవ్వ మాట్లాడుతూ.. మీ నాన్న ఎక్కడుంటాడు అని అడగ్గా ..దానికి విష్ణు ప్రియ మాట్లాడుతూ.. నాన్న ఊర్లో ఉంటారు అవ్వ అని సమాధానం ఇచ్చింది. మీరు కలవరా అంటే మా అమ్మకి వాళ్లతో కలవడం ఇష్టం లేదు. మా అమ్మ కోసం.. మా నాన్న మీద ఎంత ప్రేమ ఉన్నా.. మా నాన్నను ఎంత మిస్ అయినా సరే మా అమ్మ కోసం మా నాన్నతో నేను మాట్లాడలేదు అంటూ కంటతడి పెట్టించింది. దాంతో గంగవ్వ ఏడవడంతో నీళ్లు వస్తున్నాయి అంటూ ఇద్దరూ హగ్ చేసుకున్నారు.


లేడీ కంటెస్టెంట్స్ కి బంగారం చేయిస్తానన్న మణికంఠ..

ఆ తర్వాత హౌస్ లో హరితేజ, నబీల్, మణికంఠ, గంగవ్వ ముచ్చట్లు పెట్టుకోగా.. లేడీ కంటెస్టెంట్స్ కి మణికంఠ గోల్డెన్ ఆఫర్ ఇచ్చారు. గంగవ్వ దగ్గరకొచ్చి మణికంఠ మంచి డీలింగ్ చేసుకుందాం అని చెప్పగా.. హరితేజ.. నీతో ఆమెకేంటి డీలింగ్ అంటూ అడిగింది. దీనికి మణికంఠ మాట్లాడుతూ.. ఈవారం నేను సేవ్ అయితే నీకు బంగారు ముక్కు పుడక ఇస్తానంటూ కామెంట్ చేశాడు. హరితేజ నాకు బంగారు వడ్డానం కావాలి అని అడగ్గా.. సరేలే బేగంబజార్ కు తీసుకెళ్తాను అంటూ కామెడీ చేశాడు. ఆ తర్వాత రోహిణి నాకేం ఇస్తావంటే నీకు ముద్దిస్తా అంటూ రొమాంటిక్ పండించాడు. నువ్వు సేవ్ అయితే నాకెందుకు నీ ముద్దు అంటూ వెటకారంగా కామెంట్ చేసింది రోహిణి. నాకు తులం బంగారం పెట్టు అని గంగవ్వ అడగగా.. ఏడో వారం నేను సేవ్ అవ్వాలి, 9వ వారం నేను హౌస్ లో ఉండాలి అని అడగ్గా.., నువ్వు తొమ్మిదో వారం ఉండవు .. 8 వారాలకే ఛాన్స్.. తొమ్మిదవ వారం ఎలిమినేట్ అవుతావు అంటూ కామెడీ చేసింది గంగవ్వ.

కామెడీతో కడుపుబ్బా నవ్వించిన రోహిణి..

ఇక తర్వాత కంటెస్టెంట్స్ అంతా ఒకచోట చేరి రోహిణి, ముక్కు అవినాష్ తమ కామెడీతో అందరిని నవ్వించారు. నామినేషన్ లో జరిగిన సంఘటనలను వెలికితీస్తూ ఒక్కొక్కరిపై కామెంట్లు చేస్తూ అందరిని కడుపుబ్బా నవ్వించారు. ఆ తర్వాత నామినేషన్ లో గౌతమ్, అవినాష్ మధ్య జరిగిన గొడవను అవినాష్, టెస్టీ తేజ కామెడీగా చూపించి అందర్నీ నవ్వించారు మొత్తానికైతే ఈ ప్రోమో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు.

Related News

Bigg Boss 9: అమ్మ బాబోయ్ ఎంతకు తెగించార్రా? మోసం చేసి కెప్టెన్ అయ్యాడు, షాకింగ్ వీడియో

Bigg Boss 9 : భరణి తనూజ బాండింగ్ కు బ్రేక్ పడినట్లేనా? సంచాలక్ గా ఇమ్ము ఫెయిల్? దుమ్ము లేపిన మాస్

Bigg Boss 9 Promo: మైండ్ దొబ్బిందా.. రీతూకి హోస్ట్ స్ట్రాంగ్ కౌంటర్!

Bigg Boss 9 Promo : భరణి గెట్ అవుట్ ఫ్రం హౌస్… హీటెక్కిన వీకెండ్ ఎపిసోడ్

Bigg Boss 9: సుమన్ శెట్టి ఫైర్, కొత్త కెప్టెన్ గా కామనర్, హౌస్ మేట్స్ పై రెచ్చిపోయిన తనూజ

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

Bigg Boss 9 New Captain: భరణికి చెక్ పెట్టిన కళ్యాణ్.. హౌజ్‌ కొత్త కెప్టెన్‌ అతడే!

Bigg Boss 9 Promo: అదిరిపోయిన కెప్టెన్సీ టాస్క్.. అతి నమ్మకం పనికిరాదు పాపా!

Big Stories

×