BigTV English

Byreddy Siddharth Reddy: పిల్ల ఫ్యాక్షనిస్ట్.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎక్క‌డ‌?

Byreddy Siddharth Reddy: పిల్ల ఫ్యాక్షనిస్ట్.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎక్క‌డ‌?

Where is Byreddy Siddhartha Reddy: వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని మంత్రులు, నామినేటెడ్ పదవులలో ఉన్న నాయకులు ఇష్టారీతిన వ్యవహరించారు. అలాంటి జాబితాలో మాజీ మంత్రులు ఉన్న కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, రోజా ఇలా చెప్పుకుంటూ వస్తే ఉమ్మడి కర్నూలు జిల్లా కు చెందిన మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తమదైన స్టైల్‌లో నోరు పారేసుకున్నారు. అలాంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్రస్‌ లేకుండా పోవడం హాట్‌టాపిక్‌గా మారింది. నందికొట్కూరు నియోజకవర్గ యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కనపడుట లేదని అని నెటిజెన్లు పోస్టులు పెడుతున్నా అతని అడ్రస్ దొరకడం లేదంట.


బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ యువతను సైతం తన ప్రసంగాలు, పోస్టులతో యూత్‌తో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో బైరెడ్డి కుటుంబానికి మంచి రాజకీయ నేపధ్యముంది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తాత బైరెడ్డి శేషసేనారెడ్డి మాజీ మంత్రిగా నందికొట్కూరు నియోజకవర్గంలో బైరెడ్డి బ్రాండ్‌ను అప్పట్లోనే క్రియేట్ చేశారు… తండ్రి జాడలోనే ముగ్గురు సంతానంలో ఒకరైన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీలో ఫైర్‌బ్రాండ్‌గా ఫోకస్ అయ్యారు. ప్రత్యేక రాయలసీమ నినాదంతో కొంత కాలం హడావుడి చేసిన బైరెడ్డి రాజశేఖర్ తిరిగి టీడీపీలో చేరి తన కుమార్తెను ఎంపీగా గెలిపించుకుని మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చారు.

తన పెద్ద నాన్న బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డితో తిరిగి రాజకీయం నేర్చుకున్న బైరెడ్డి సిద్దార్ధరెడ్డి.. తర్వాత ఆయన్ని చులకన చేస్తూ మాట్లాడి వైసీపీలో చేరి బైరెడ్డి ఫ్యామిలీలో మరో యూత్ లీడర్ అనిపించుకున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుంచి ఆర్థర్ ఎమ్మెల్యే గా గెలిచారు. ఆ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన జగన్ బైరెడ్డిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని చేసిన వ్యాఖ్యలతో ఒక్క సారిగా అతనికి హైప్ వచ్చింది. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో ప్రత్యర్ధులను టార్గెట్ చేస్తూ ఫాలోయర్స్‌ను పెంచుకున్నారు. అలాగే నందికొట్కూరులో అర్థర్ ఎమ్మెల్యేగా ఉన్నా తానే ఎమ్మెల్యే అయినట్లు పెత్తనం చేశారు.


Also Read: ఏపీకి తుపాను ముప్పు.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. బెంగుళూరు, చెన్నైల్లో

నందికొట్కూరు నియోజకవర్గం ప్రస్తుతం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గ కావడంతో నందికొట్కూరు నుంచి పోటీ చేయడానికి వీలు లేక ఈసారి ఎలాగైనా తాను ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా నైనా పోటీ చేయాలని సిద్దార్థ కలలు కన్నారు. అయితే ఆయన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానన్న జగన్ టికెట్ కూడా ఇవ్వలేదు. దాంతో నిరాశ చెందిన జూనియర్ బైరెడ్డి నందికొట్కూరు సెగ్మెంట్‌‌లోనే రాజకీయం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అర్థర్ తన మాట వినడం లేదని.. ఆయనకు టికెట్ రాకుండా చేసి తన అనుచరుడైన ధారా సుధీర్‌కు టికెట్ ఇప్పించుకున్నారు. తీరా చూస్తే అటు అర్థర్, ఇటు సుధీర్‌ ఇద్దరికి పొలిటికల్ సినిమా కనపడింది. ఇక అప్పటి నుంచి ఆ సోషల్ మీడియా పులి కనిపించకుండా పోయింది.

ఎన్నికల ఫలితాల తర్వాత సిద్దార్థరెడ్డి నియోజకవర్గంలో ఎక్కడా కనిపించలేదు. మాజీ మంత్రి రోజాతో కలిసి ఆయన శాప్ చైర్మన్‌గా క్రీడా నిధులు పెద్ద ఎత్తున్న దుర్వినియోగం చేసారన్న ఆరోపణలు ఉన్నాయి. దానిపై రేపోమాపో ఆ ఇద్దరిపై కేసు నమోదు చేస్తారంటున్నారు. ఆ భయంతోనే సిద్దార్ధ హైదరాబాద్‌కు మకాం మార్చేసారంట. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిద్ధార్థ రెడ్డి ఏ కార్యక్రమానికి వెళ్లినా అ ఫోటోలు దిగడం కోసం కుర్ర కారు ఎగబడే వారు. సోషల్ మీడియాలో అంత క్రేజ్ ఉంది ఆయనకి.. అయితే పార్టీ ఓటమి తర్వాత ఆయన సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి సోషల్‌మీడియాలో ఉన్న క్రేజ్ చూసే జగన్ అంత ప్రాధాన్యత ఇచ్చారంటారు.. అది చూసుకుని ఆయన తన పెదనాన్ని బైరెడ్డి రాజశేఖరరెడ్డిని చిన్న చూపు చూస్తూ.. వయసైపోయిన ఎక్స్‌పైర్ నేతని విమర్శలు గుప్పించేవారు. ఇప్పుడు చూస్తే సీన్ పూర్తిగా రివర్స్ అయింది. గత అయిదేళ్లు అంత చెలరేగిపోయిన సిద్దార్ధ పొలిటికల్ సీన్ మీద నుంచి మాయమయ్యారు. అయన ఎక్స్‌పైర్ అయిపోయారని విమర్శించిన బైరెడ్డి రాజశేఖరరెడ్డి తిరిగి ఫామ్‌లోకి వచ్చేశారు. ఆయన కుమార్తె శబరి నంద్యాల ఎంపీగా ఘనవిజయం సాధిస్తే.. ఆయన నందికొట్కూరు సహా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతూ యాక్టివ్ అవుతున్నారు. బళ్లు ఓడలు.. ఓడలు బళ్లు అవ్వడం అంటే ఇదేనేమో.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×