Bigg Boss: బిగ్ బాస్ దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టి షో. దేశంలో పలు బాషల్లో ప్రసారం అవుతున్న ఈ బిగ్ బాస్‌కు తెలుగులోనే మోస్ట్ వ్యూవర్స్ ఉన్నారు. అందుకే బిగ్ బాస్ షో వస్తుండంటే చాలు చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరూ టీవీలకు, మొబైల్స్‌కు అతుక్కుపోతున్నారు. ఇప్పటికి ఏడు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తాజాగా 8వ సీజన్ ప్రారంభం అయింది. దీనికి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. సెప్టెంబరు 1 వ తేదీన హౌస్‍లోకి 14 మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టారు. ఆ కంటెస్టెంట్స్‌లో సినీ, టీవీ నటీనటులు, సోషల్ మీడియా ఇన్‍ఫ్లయెన్సర్లు ఉండటం విశేషం.
బయటకు వచ్చిన రెమ్యూనిరేషన్ వివరాలు
బిగ్ బాస్ గురించి చిన్న విషయాన్ని తెలుసుకునేందుకు బీబీ లవర్స్ చాలా ఆసక్తి చూపిస్తుంటారు. ఈక్రమంలోనే బిగ్ బాస్‌లోకి వెళ్లే కంటెంస్టెంట్స్‌కు స్టార్ మా ఛానెల్ ఎంత రెమ్యూనిరేషన్ ఇస్తుందనే వివరాలు మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి తన యూట్యూబ్ ఛానెల్‌లో వెల్లడించాడు. ఇక ఈ సీజన్ 8లో అత్యధిక రెమ్యూనిరేషన్ ఓ బ్యూటి తీసుకుంటుండగా.. అత్యల్ప రెమ్యూనిరేషన్ ఓ టీవీ నటుడు తీసుకుంటున్నట్లు తెలిసింది.
రెమ్యూనిరేషన్ ఎలా ఇస్తారంటే?
బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్స్‌కు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్స్‌కు మొదటి వారం రెమ్యూనిరేషన్ ముందుగానే ఇస్తారట. ఆ తర్వాత హౌస్‌లో ఉన్న మొత్తం వారాలకు లెక్కేసి కంటెస్టెంట్స్‌కు అందజేస్తారు. అలా కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాక 80 శాతం రెమ్యూనిరేషన్ని ఒక నెలలోపు ఇస్తారు. మిగిలిన 20శాతాన్ని మాత్రం తొమ్మది నెలల తర్వాత మాత్రమే ఇస్తారట. మరి ఈ సీజన్ 8లో 14 కంటెస్టెంట్స్‌లో ఎవరెవరు ఎంత రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నరో తెలుకుసుకుందాం.
Also Rad: క్యాస్టింగ్ కౌచ్ పై స్వీటీ కూడా స్పందించేసింది.. సమంతకు మద్దతుగా
* యాంకర్ విష్ణు ప్రియ- రూ. 3.5లక్షల నుంచి రూ. 4లక్షలు (వారానికి)
* సినీ నటుడు ఆదిత్య ఓం – రూ.3లక్షలు (వారానికి)
* టీవీ నటుడు నిఖిల్ – రూ.3లక్షలు (వారానికి)
*టీవీ నటి యష్మి గౌడ- రూ.2.5లక్షలు (వారానికి)
* టీవీ నటి ప్రేరణ- రూ.2.5లక్షలు (వారానికి)
* ఆర్జే శేఖర్ బాష- రూ.2.3లక్షలు (వారానికి)
* డ్యాన్సర్ నైనిక- రూ.2.3లక్షలు (వారానికి)
* నటి, యూట్యూబర్ కిర్రాక్ సీత- రూ.2.2లక్షలు (వారానికి)
* నటుడు అభయ్ నవీన్- రూ.2లక్షలు (వారానికి)
* యూట్యూబర్ నబీల్ ఆఫ్రిది- రూ.1.7లక్షలు (వారానికి)
* నటి సోనియా ఆకుల- రూ. 1.7లక్షలు (వారానికి)
* టీవీ నటుడు పృథ్విరాజ్- రూ.1.5లక్షలు (వారానికి)
* యూట్యూబర్ బెజవాడ బేబక్క- రూ.1.3లక్షలు (వారానికి)
* టీవీ నటుడు నాగ మణికంఠ- రూ.1.2లక్షలు (వారానికి)
ఈ రెమ్యూనిరేషన్ వివరాలల్లో కాస్త లేడాలు ఉండే అవకాశం ఉందని ఆదిరెడ్డి తన వీడియోలో తెలిపాడు. ఇక ఈ సీజన్‌లో అత్యధిక రెమ్యూనిరేషన్ యాంకర్ విష్ణు ప్రియ తీసుకుంటుండగా.. తర్వాత స్థానంలో సినీ నటుడు ఆదిత్య ఓం ఉన్నాడు. ఇకపోతే అందరి కంటే తక్కువ రెమ్యూనిరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్‌గా టీవీ నటుడు నాగ మణికంఠ హౌస్‌లో ఉన్నాడు.