BigTV English

Bigg Boss 8 Telugu: అవినాష్‌ను అవమానించిన నబీల్.. పర్ఫెక్ట్‌గా పగ తీర్చుకుంటున్న ఎంటర్‌టైన్మెంట్ టీమ్

Bigg Boss 8 Telugu: అవినాష్‌ను అవమానించిన నబీల్.. పర్ఫెక్ట్‌గా పగ తీర్చుకుంటున్న ఎంటర్‌టైన్మెంట్ టీమ్

Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ సీజన్ 8లో ప్రస్తుతం హౌస్‌లో 9 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. ఇంకా ఫైనల్స్‌కు కొన్నిరోజుల సమయం మాత్రమే ఉంది. అందుకే టికెట్ టు ఫినాలే రేసులో పోటీపడేది ఎవరో తెలుసుకోవడం కోసం టాస్కులు మొదలయ్యాయి. అయితే ఈ సీజన్‌లో స్పెషల్‌గా ట్విస్ట్ ఏంటంటే.. టికెట్ టు ఫినాలే కంటెండర్స్ టాస్కులను మాజీ కంటెస్టెంట్స్ వచ్చి ఆడిస్తున్నారు. బయట నుండి మాజీ కంటెస్టెంట్స్ రావడం, ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్‌తో టికెట్ టు ఫినాలే కంటెండర్‌షిప్ టాస్కులు ఆడించడంతో ఈ వారం గడిచిపోతోంది. ఇక తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో మానస్, ప్రియాంక వచ్చి కంటెస్టెంట్స్‌తో టాస్కులు ఆడించారు.


సుడోకు పోటీ

మానస్, ప్రియాంక ముందుగానే స్కిల్, మానసిక బలం కేటగిరిల్లో కంటెస్టెంట్స్‌తో టాస్కులు ఆడిస్తామని బిగ్ బాస్‌కు తెలిపారు. ఇక హౌస్‌లోకి ఎంటర్ అవ్వగానే ఆ టాస్కులు ఆడేది ఎవరో కంటెస్టెంట్స్‌నే సెలక్ట్ చేసుకోమన్నారు. కానీ కంటెస్టెంట్స్ అంతా కలిసి చర్చించుకున్నా ఏం డిసైడ్ అవ్వలేకపోయారు. అందుకే ఆ నిర్ణయాన్ని మానస్, ప్రియాంకకే వదిలేశారు. దీంతో మానస్, ప్రియాంక.. ప్రేరణ, నబీల్‌ను టాస్కులు ఆడడానికి సెలక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరూ చర్చించుకొని అవినాష్, పృథ్వితో పోటీపడతామని చెప్పారు. దీంతో నలుగురి మధ్య టికెట్ టు ఫినాలే కంటెండర్‌షిప్ కోసం పోటీ మొదలయ్యింది. మొదటి టాస్క్ సుడోకు.


Also Read: యష్మీ అంతమాట అనేసిందేంటి.. నాగార్జున పరువు మొత్తం పాయే..

నిజంగా గెలిచావా?

సుడోకును ముందుగా నబీల్ పూర్తి చేశాను అనుకొని గంట కొట్టాడు. కానీ సంచాలకులు వచ్చి చూసేసరికి తన సుడోకు పూర్తికాలేదు. అలాగే ప్రతీ కంటెస్టెంట్ తమ సుడోకు అయిపోయిందనే అనుకున్నారు. కానీ కన్ఫ్యూజన్‌లో ఎవ్వరూ పూర్తి చేయలేకపోయారు. దీంతో బిగ్ బాస్ ఒక హింట్ ఇచ్చారు. అది ఇవ్వగానే అవినాష్ ముందుగా కరెక్ట్‌గా తన సుడోకును పూర్తిచేశాడు. ఆ తర్వాత ప్రేరణ, పృథ్వి, నబీల్ పూర్తిచేశారు. అయితే అవినాష్ ముందుగా సుడోకు పూర్తి చేయడం చూసి నబీల్ నమ్మలేకపోయాడు. తేజ ఏమైనా హెల్ప్ చేశాడా అని అడిగాడు. ఆ తర్వాత నబీల్, అవినాష్‌కు ఈ విషయంపై డిస్కషన్ కూడా అయ్యింది. తనను అలా అంటే అవమానించినట్టుగా ఉందని అవినాష్ ఫీలయ్యాడు.

చేసి చూపించారు

నబీల్ చేసిన అవమానంతో అవినాష్‌లో కసి పెరిగింది. ఎలాగైనా టికెట్ టు ఫినాలే కంటెండర్ అవ్వాలని టేస్టీ తేజతో అన్నాడు. ఈసారి తనకు టాప్ 5లో ఉండాలని ఉందని కోరికను బయటపెట్టాడు. సుడోకులో గెలవడంతో అవినాష్‌కు అడ్వాంటేజ్ లభించింది. ఆ తర్వాత ఆడాల్సిన క్రికెట్ టాస్క్ కోసం తనకు ఎక్కువ బంతులు లభించాయి. దీంతో అవినాషే ఆ టాస్కులో కూడా గెలిచాడు. ప్రేరణ, పృథ్విలకు టై అయ్యింది. నబీల్ ఓడిపోయాడు. దీంతో తను అనుకున్నట్టుగానే అవినాష్ టికెట్ టు ఫినాలే కంటెండర్ అయ్యాడు. నబీల్ ఓడిపోవడంతో తనకు బ్లాక్ బ్యాడ్జ్ దక్కింది. కామెడీకి మాత్రమే పనికొస్తారని నెగిటివ్ కామెంట్స్ తెచ్చుకున్న రోహిణి, అవినాష్.. ముందుగా టికెట్ టు ఫినాలే కంటెండర్లు అయ్యి అందరికీ గట్టి సమాధానం చెప్పారు.

Related News

Bigg Boss 9 : ఇవి టాస్క్ లా? కుస్తీ పోటీలా? అంత దారుణంగా కొట్టుకుంటున్నారు

Bigg Boss 9: చెప్పినా వినలేదు.. ప్రియా శెట్టి పేరెంట్స్ ఆవేదన.. ఏమైందంటే?

Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Big Stories

×