Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్స్ అంతా ఆడుతున్న చివరి టాస్కులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం కంటెస్టెంట్స్ అంతా తమను ఫైనల్‌కు పంపించమని, తమకు ఓటు వేసి విన్నర్ చేయమని ప్రేక్షకులకు ఓటు అప్పీల్ చేసుకుంటున్నారు. అయితే ఆ ఓటు అప్పీల్ కూడా వారికి అంత ఈజీగా దొరకదు. ఇతర కంటెస్టెంట్స్‌తో పోటీపడి మరీ దానిని దక్కించుకోవాలి. అలా ఇప్పటివరకు ప్రేరణ, నబీల్‌కు ఓటు అప్పీల్ చేసుకునే ఛాన్స్ దొరికింది. అయినా వాళ్లు కూడా మళ్లీ మళ్లీ ఓటు అప్పీల్ చేసుకోవడానికి ఆటలు ఆడవచ్చు. అలా తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ మధ్య మళ్లీ ఓటు అప్పీల్ టాస్కులు మొదలయ్యాయి.
పాపం విష్ణుప్రియా
టాస్కులు ప్రారంభం కాకముందు కంటెస్టెంట్స్‌తో కలిసి జోకులు వేసింది విష్ణుప్రియా. అవినాష్‌కు ఇంగ్లీష్ రాదని మరోసారి తనతో ఆడుకుంది. ఆ తర్వాత గౌతమ్ గురించి ఇతర కంటెస్టెంట్స్‌తో జోకులు వేసింది. సోలో బాయ్ అంటూ గౌతమ్ చెప్పేది సొల్లు అని కామెంట్ చేసింది. అలా కాసేపు సరదాగా సాగిపోయిన తర్వాత ఓటు అప్పీల్ కోసం మొదటి టాస్క్ మొదలయ్యింది. ఈ టాస్క్‌లో గార్డెన్ ఏరియాలో ఒక జెండా పెట్టి ఉంటుంది. కంటెస్టెంట్స్‌లో ముందుగా ఎవరైతే వెళ్లి దానిని పట్టుకుంటారో వారు గేమ్‌లో నుండి ఒకరిని తీసేసే పవర్ పొందుతారు. ఈ టాస్క్ మొదట్లోనే విష్ణుప్రియా ముక్కుపగిలినా కూడా చివరి వరకు కష్టపడి ఆడగలిగింది.
Also Read: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే ఎప్పుడు? గెస్టులు ఎవరంటే?
గౌతమ్‌దే పైచేయి
మొదటి రెండుసార్లు గౌతమ్‌కే ఆ జెండా లభించింది. దీంతో తను ఇప్పటికే ఓటు అప్పీల్ చేసుకున్న ప్రేరణ, నబీల్‌ను తొలగించాడు. ఆ తర్వాత నిఖిల్ తనకు పోటీ ఇస్తాడంటూ తనను కూడా తొలగించాడు. ఫైనల్‌గా చాలా కష్టపడి గౌతమ్ చేతిలో నుండి జెండా దక్కించుకోగలిగింది రోహిణి. గౌతమ్ గేమ్‌లో ఉంటే తాము ఆడలేమని ఫీల్ అయ్యి తననే తీసేసింది. ఇంక ఆటలో విష్ణుప్రియా, రోహిణి, అవినాష్ మాత్రమే మిగిలారు. అప్పుడే జెండా అవినాష్ చేతిలోకి వెళ్లింది. ఎలాగో తన ఫ్రెండ్ రోహిణిని ఆటలో నుండి తీసేయడు కాబట్టి విష్ణుప్రియాను తొలగించాడు అవినాష్. చివరిగా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య పోటీ మొదలయ్యింది.
రోహిణి ఎమోషనల్
అవినాష్, రోహిణి ఆటలో ఉన్నా జెండా ముందుగా అవినాష్ చేతికి వెళ్లింది. కానీ తను సింపుల్‌గా చేతిలో నుండి వదిలేసి రోహిణికి ఇచ్చాడు. అదేంటి ఇంత సింపుల్‌గా ఇచ్చేశావని అనగానే ముందు నుండి నువ్వు చాలా కష్టపడ్డావంటూ త్యాగం చేసినట్టు ఒప్పుకున్నాడు అవినాష్. తన త్యాగం చూసి రోహిణి ఏడ్చేసింది. దాదాపు కాళ్ల మీద పడినంత పని చేసింది. వీరిద్దరి బాండింగ్ చూసి కంటెస్టెంట్స్ కూడా ఎమోషనల్ అయ్యారు. అలా రోహిణి ఓటు అప్పీల్ కంటెండర్ అయ్యింది. ఓటు అప్పీల్ కోసం జరిగే రెండో టాస్క్‌లో సంచాలకురాలు కూడా అయ్యింది. రెండో రౌండ్‌లో గెలిచిన కంటెస్టెంట్‌తో గెలిస్తేనే రోహిణి.. ఓటు అప్పీల్ చేసుకోగలదు.